మాదిరి ప్రశ్నలు | model questions | Sakshi
Sakshi News home page

మాదిరి ప్రశ్నలు

Published Thu, Aug 29 2013 11:11 PM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM

model questions

 1.    హ్యుయాన్‌త్సాంగ్ బాదామి చాళుక్య     రాజ్యాన్ని ఏ సంవత్సరంలో సందర్శిం చాడు?
     ఎ) క్రీ.శ.642     బి) క్రీ.శ.641
     సి)  క్రీ.శ.640     డి)  క్రీ.శ.639
 
 2.    సత్యాశ్రయ అనే బిరుదున్న బాదామి చాళుక్య రాజు?
     ఎ) మొదటి పులకేశి     
     బి) రెండో పులకేశి    
     సి) రెండో విక్రమాదిత్యుడు
     డి) రెండో విజయాదిత్యుడు
 
 3.    హరీతిపుత్రులు అని ఏ రాజవంశాన్ని పిలుస్తారు?
     ఎ) పల్లవులు     బి) రాష్ర్టకూటులు
     సి) చాళుక్యులు     డి) వాకాటకులు
 
 4.    కాదంబుల రాజధాని?
     ఎ) పట్టడకల్     బి) కళ్యాణి
     సి) ఐహోల్     డి) బనవాసి
 
 5. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత దక్కన్‌లో అంతటి విశాలమైన రాజ్యాన్ని నిర్మించిన చక్రవర్తి?
     ఎ) హర్షవర్థ్ధనుడు     
     బి) రెండో పులకేశి
     సి) సముద్రగుప్తుడు     
     డి) రెండో నరసింహవర్మ
 
 6.    కుబ్జ విష్ణువర్థనుడు రెండో పులకేశి ప్రతి నిధిగా ఆంధ్ర ప్రాంతాన్ని ఏ రాజధాని నుంచి పాలించాడు?
     ఎ) వేంగీ     బి) వినుకొండ
     సి) పిష్టపుర     డి) విజయపురి
 
 7.    రెండో పులకేశి మొదటి మహేంద్రవర్మను ఏ యుద్ధంలో అంతం చేశాడు?
     ఎ) పుల్లలూరు యుద్ధం
     బి) కొప్పం యుద్ధం
     సి) సంగమేశ్వర యుద్ధం
     డి) మణిమంగళ యుద్ధం
 
 8.    ఏ చాళుక్యరాజు గుజరాత్‌పై జరిగిన అర బ్బుల దాడిని తిప్పికొట్టాడు?
     ఎ) రెండో పులకేశి     
     బి) మొదటి విక్రమాదిత్యుడు
     సి) రెండో విక్రమాదిత్యుడు
     డి) రెండో కీర్తివర్మ
 
 9.    రెండో పులకేశి క్రీ.శ.642లో జరిగిన ఏ యుద్ధంలో మొదటి నరసింహవర్మ చేతిలో అంతమయ్యాడు?
     ఎ) మణిమంగళ యుద్ధం
     బి) కంచి యుద్ధం
     సి) అనిల్‌వారా యుద్ధం
     డి) బనవాసి యుద్ధం
 
 10.    బాదామి చాళుక్యుల రాజ చిహ్నాం?
     ఎ) వరాహం     బి) వృషభం
     సి) సింహం     డి) పులి
 
 11.    ఐహోల్ శాసనాన్ని రచించిన వారు?
     ఎ) హరిసేనుడు     
     బి) రవికీర్తి
     సి) మొదటి పులకేశి     
     డి) బాణుడు
 
 12.    కంచిలోని కైలాసనాథ ఆలయ నమూనా లో నిర్మించిన పట్టడకల్‌లోని ఆలయం?
     ఎ) విరూపాక్షాలయం
     బి) లింగరాజ ఆలయం
     సి) దశావతారాలయం
     డి) సర్వ దేవాలయం
 
 13.    ఐహోల్ ప్రశస్తిని కలిగిన దేవాలయం?
     ఎ) దుర్గాలయం     
     బి) మేగుటి జైనాలయం
     సి) లాడ్‌ఖాన్ ఆలయం
     డి) లోకేశ్వరాలయం
 
 14.    చాళుక్యుల కాలంలో దేవాలయాల నగరమని ప్రసిద్ధిగాంచింది?
     ఎ) ఐహోల్     బి) పట్టడకల్
     సి) అలంపూర్     డి) మహానంది
 
 15.    హిందూ పాలకుల్లో అక్బర్ లాంటి వాడు అని కీర్తిగాంచిన రాజు?
     ఎ) రెండో పులకేశి     బి) సముద్రగుప్తుడు
     సి) హర్షుడు     డి) అశోకుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement