మాదిరి ప్రశ్నలు | model questions | Sakshi
Sakshi News home page

మాదిరి ప్రశ్నలు

Published Sun, Sep 1 2013 11:57 PM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM

model questions

 1.    నదుల రాష్ర్టంగా దేన్ని పిలుస్తారు?
 ఎ) పంజాబ్    బి) ఉత్తరప్రదేశ్
 సి) ఆంధ్రప్రదేశ్    డి) తమిళనాడు
 
 2.    కింది వాటిలో సరికాని జత?
 ఎ) రామ్‌గంగా - గంగా
 బి) వెన్‌గంగా - గోదావరి
 సి) దూద్‌గంగా - కృష్ణా
 డి) పంచ్‌గంగా - కావేరి
 
 3.    మన్నార్ సింధూశాఖలో కలిసే నది?
 ఎ) వైగై        బి) కబిని
 సి) తాబ్రాపాణి    డి) కుందా
 
 4.    ఒకే భౌగోళిక ప్రాంతంలో జన్మించి ఒక దానితో మరొకటి వ్యతిరేక దిశలో ప్రవహించే నదుల జంట?
 ఎ) నర్మద- తపతి
 బి) నర్మద - సోన్
 సి) తపతి - వెన్‌గంగ
 డి) కావేరి - పెన్నా
 
 5.    కింది వాటిలో పాక్ అఖాతంలో కలిసే నది?
 ఎ) తాబ్రాపాణి    బి) వైగై
 సి) కబని    డి) హేమంగి
 
 6.    నర్మద చెలికత్తెగా ఏ నదిని పిలుస్తారు?
 ఎ) తపతి    బి) సోన్
 సి) చంబల్    డి) సబర్మతి
 
 7.    గోదావరికి కుడివైపున ఉన్న ఉపనది?
 ఎ) మంజీర    బి) ప్రాణహిత
 సి) ఇంద్రావతి    డి) సీలేరు
 
 8.    వేణుగోపాలస్వామి ఆలయం ఏ నది ఒడ్డున ఉంది?
 ఎ) గోదావరి    బి) కృష్ణా
 సి) కావేరి    డి) పెన్నా
 
 9.    గుజరాత్‌లో గల్ఫ్ ఆఫ్ ఖంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలవని నది?
 ఎ) నర్మద    బి) తపతి
 సి) సబర్మతి    డి) వెన్‌గంగ
 
 10. కృష్ణానది పరీవాహక ప్రాంతం అధికంగా గల రాష్ర్టం?
 ఎ) కర్ణాటక    బి) మహారాష్ర్ట
 సి) ఆంధ్రప్రదేశ్    డి) తమిళనాడు
 
 11.    బైసన్‌గార్‌‌జ ద్వారా ప్రవహించే నది?
 ఎ) గోదావరి    బి) కృష్ణా
 సి) పెన్నా    డి) కావేరి
 
 12.    రూర్కెలా ఇనుము - ఉక్కు కర్మాగారానికి  నీటిని ఏ నది నుంచి సరఫరా చేస్తున్నారు?
 ఎ) సువర్ణరేఖ    బి) వైతరణి
 సి) బ్రాహ్మణి    డి) స్వర్ణముఖి
 
 13.    {పముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తీ శ్వర దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది?
 ఎ) సువర్ణరేఖ     బి) స్వర్ణముఖి
 సి) వైతరణి    డి) చెయేరు
 
 14. పెన్నానది సముద్రంలో కలిసే ప్రాంతం?
 ఎ) అందాలమాల    బి) హంసల దీవి
 సి) ఊటుకూరు    డి) అంతర్వేది
 
 15. గోదావరి నది మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం?
 ఎ) కొవ్వూరు    బి) పోలవరం
 సి) రాజమండ్రి    డి) కొమరగిపట్నం
 
 
 సమాధానాలు
 1)   సి;    2)  డి;    3) సి;     4) బి;
 5)   బి;     6)  ఎ;    7) ఎ;     8) బి;    
 9)   డి;     10) ఎ;     11) ఎ;   12) సి;    
 13) బి;     14) సి;     15) బి
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement