మాదిరి ప్రశ్నలు | model questions | Sakshi
Sakshi News home page

మాదిరి ప్రశ్నలు

Published Sat, Sep 7 2013 11:29 PM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

model questions

 1.     అవనీసింహ అనే బిరుదున్న పల్లవ రాజు?
     ఎ) సింహవిష్ణు    
     బి) రెండో నరసింహవర్మ
     సి) మొదటి మహేంద్రవర్మ
     డి) మొదటి పరమేశ్వర వర్మ
 
 2.    మహాబలిపురంలోని ఆది వరాహ దేవాలయంలోని పల్లవరాజు విగ్రహం ఎవరికి సంబంధించినది?
     ఎ) మొదటి నరసింహవర్మ        బి) రెండో నరసింహవర్మ
     సి) సింహవిష్ణు    డి) అపరాజిత వర్మ
 
 3.     ఏ పల్లవరాజును సైనికుడు, పాలనాదక్షుడు, మత సంస్కర్త, భవన నిర్మాత, కవి, సంగీతకారుడు అని పిలిచేవారు?
     ఎ) రెండో నరసింహవర్మ        బి) మొదటి మహేంద్రవర్మ
     సి) రెండో పరమేశ్వరవర్మ         డి) రెండో నందివర్మ
 
 4.     అప్పార్ అని పేరుగాంచిన హిందూమత సన్యాసి?
     ఎ) తిరుజాఖన సంబంధార్         బి) తిరునవుక్కరసు
     సి) ఆది శంకరాచార్య
     డి) విజయానంద
 
 5.     మత్త విలాస ప్రహసనం గ్రంథకర్త?
     ఎ) భారవి    బి) దండి
     సి) మొదటి మహేంద్రవర్మ         డి) రెండో నరసింహవర్మ
 
 6.     }లంకపై దాడిచేసిన పల్లవ రాజు?
     ఎ) మొదటి నరసింహవర్మ         బి) మొదటి మహేంద్రవర్మ
     సి) మొదటి పరమేశ్వర వర్మ         డి) మొదటి విక్రమేంద్ర వర్మ
 
 7. అగస్త్య మహామునితో పోల్చిన పల్లవ రాజు?
     ఎ) సింహవిష్ణు    బి) రెండో నందివర్మ
     సి) దంతివర్మ         
     డి) మొదటి నరసింహవర్మ
 
 8.     దండి ఏ పల్లవరాజు ఆస్థాన కవి?
     ఎ) రెండో నందివర్మ బి) దంతివర్మ
     సి) రెండో నరసింహవర్మ
     డి) మొదటి మహేంద్రవర్మ
 
 9. చైనాకు రాయబార బృందాన్ని పంపిన పల్లవ రాజు?
     ఎ) దంతివర్మ    బి) రెండో నందివర్మ
     సి) రెండో విక్రమేంద్రవర్మ         డి) రెండో నరసింహ వర్మ
 
 10.     తమిళ భారతాన్ని రచించింది?
     ఎ) భారవి    బి) ఏరుందేవనార్
     సి) దండి     డి) తిరునవుక్కరసు
 
 11.     పల్లవుల కాలంలో సయాం(మలయా)లో విష్ణు దేవాలయాన్ని నిర్మించిన వ్యాపార శ్రేణి?
     ఎ) మణిగ్రామ    బి) అయ్యవొళె
     సి) నానాదేశి    డి) పరదేశి
 
 12.    కుంభకోణం యుద్ధంలో పాండ్యుల చేతిలో ఓడిన పల్లవ రాజు?
     ఎ) రెండో నందివర్మ బి) నృపతుంగ
     సి) మూడో నందివర్మ
      డి) అపరాజితవర్మ
 
 13.     {దావిడ వేదం అని ఏ గ్రంథాన్ని పేర్కొం టారు?
     ఎ) తమిళ భారతం         బి) తిరుమురై
     సి) తమిళ రామాయణం డి) నీలరీయం
 
 14.    అర్జునుడి తపస్సు లేదా గంగావతరణ శిల్పం ఎక్కడ ఉంది?
     ఎ) బాదామి    బి) పట్టడకల్
     సి) కంచి    డి) మామల్లపురం
 
 15.    {దావిడ శైలికి నాంది అని ఏ దేవాలయాన్ని భావిస్తారు?
     ఎ) కంచి కైలాసనాథ ఆలయం         బి) కంచి వైకుంఠ పెరుమాళ్ ఆలయం
     సి)మహాబలిపురంలోని తీర దేవాలయం
     డి) తంజావూరులోని రాజరాజ ఆలయం
 
 16.    రాజసింహేశ్వరాలయం అని ఏ దేవాలయాన్ని పిలుస్తారు?
     ఎ) తీరదేవాలయం    
     బి) కైలాసనాథాలయం
     సి) ఐరావతేశ్వరాలయం         డి) పరశురామేశ్వరాలయం
 
 సమాధానాలు
  1) ఎ;   2)  సి;   3) బి;    4)  బి;
  5) సి;       6)  ఎ;   7)  డి;   8)  సి;    
  9)  డి;      10) బి;  11) ఎ;   12)సి;
  13) బి; 14) డి;  15) సి;   16) బి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement