నాటా - 2016
గరిష్టంగా ఐదుసార్లు
గ్రాడ్యుయేట్స్ స్పెషల్
ఎన్నో అందమైన, ఎత్తై భవనాలకు చక్కటి రూపమిచ్చేది ఆర్కిటెక్ట్‌లే. అలాంటి సృజనాత్మక ఆర్కిటెక్టులుగా రూపొందాలంటే రాయాల్సిన పరీక్ష.. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా). దీన్ని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రతి ఏటా నిర్వహిస్తోంది. నాటా స్కోర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపుపొందిన కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్)లో చేరొచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 1న మొదలైంది. ఆగస్టు 20 వరకు రాయవచ్చు. ఈ ఏడాది నుంచి నాటాలో కొన్ని ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. వాటి వివరాలు...
నాటా-2016 మార్పులు..
* ఈ ఏడాది నుంచి ఐదుసార్లకు మించి పరీక్ష రాయడానికి వీల్లేదు. అది కూడా మొదటిసారి పరీక్ష రాసిననాటి నుంచి రెండేళ్లలోపు వరకు మాత్రమే వర్తిస్తుంది.
* నాటా పరీక్ష ఏప్రిల్ 1న ప్రారంభమైంది. అప్పటి నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఔత్సాహిక అభ్యర్థులు ఆగస్టు 20 వరకు పరీక్ష రాసుకునే అవకాశం ఉంది.
* అభ్యర్థులు గరిష్టంగా ఐదుసార్లు పరీక్ష రాసుకోవచ్చు కాబట్టి వీటిలో ఉత్తమ స్కోర్‌ను ‘బెస్ట్ స్కోర్’గా పరిగణిస్తారు.
* నాటా స్కోర్‌కు పరీక్ష రాసిన నాటి (ఏప్రిల్ 1, 2016) నుంచి రెండేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. 2016కు ముందు పరీక్ష రాసినవారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.
* నాటా ఔత్సాహిక అభ్యర్థులు పరీక్ష రాసే ప్రతిసారి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా రాసిన ప్రతిసారి పరీక్ష ఫీజు చెల్లించాలి.
* పరీక్ష తర్వాత ప్రకటించే మార్కుల జాబితాలో అంతకుముందు రాసిన పరీక్షల్లో సాధించిన అత్యుత్తమ మార్కులు కూడా ఉంటాయి.
* నాటా-2016కు దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఇంతకుముందు రాసిన నాటా వివరాలను దరఖాస్తులో పొందుపరచాలి.
* గతంలో నాటాకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాయనివారు, రాసినా ఆ వివరాలు తెలపనివారి ప్రీవియస్ నాటా స్కోర్లన్నీ రద్దవుతాయి. వారు మళ్లీ పరీక్ష రాయడానికి అనర్హులు.
నాటా-2016 సమాచారం
అర్హత: 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధి: ఐదేళ్లు
పరీక్ష విధానం..
ఈ పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది.
డ్రాయింగ్ టెస్ట్: అభ్యర్థిలోని సృజనాత్మకతను పరీక్షించే విధంగా డ్రాయింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో నిర్ణీత ఆకారం లేదా వస్తువును అభ్యర్థి ముందుంచి.. దాని ఆధారంగా ఊహాశక్తితో డ్రాయింగ్ వేయమంటారు. ఒక వస్తువును పలు కోణాల్లో చిత్రించమన డం, నిర్ణీత ఆకారానికి ఆకట్టుకునే రంగులు వేయడం వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. నిజజీవితంలో ఎదురైన సంఘటనలను ఊహించుకుంటూ.. వాటికి సంబంధించిన చిత్రాలను గీయమని కూడా అడుగుతుంటారు. పరీక్ష వ్యవధి 2 గంటలు.
నాటాతో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశం కల్పిస్తున్న ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్- జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, హైదరాబాద్.
కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-ఏయూ, వైజాగ్.
శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ - హైదరాబాద్
ఎస్‌ఏఆర్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్-అగిరిపల్లి, కృష్ణాజిల్లా.
వివరాలకు: http://www.nata.in
రిజిస్ట్రేషన్
ఆగస్టు 18 వరకు www.nata.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.1,250 డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.
ఆన్‌లైన్ టెస్ట్
కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరిగే ఈ పరీక్షలో 40 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. అభ్యర్థిలోని పరిశీలనాత్మక, సృజ నాత్మక శక్తి, భావ వ్యక్తీకరణ, ఆలోచనా శక్తిని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి.