ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రిపరేషన్ | Objective, Descriptive method Prep | Sakshi
Sakshi News home page

ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రిపరేషన్

Published Thu, Jul 10 2014 2:29 AM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM

ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రిపరేషన్ - Sakshi

ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రిపరేషన్

 ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఎంతో కీలకం.. ముఖ్యంగా సెన్సైస్ విద్యార్థులకు.. ఈ క్రమంలో బైపీసీ విద్యార్థులు అకడెమిక్ పరంగా ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలతోపాటు ఎంసెట్, జిప్‌మర్, ఎయిమ్స్ ఎంట్రన్స్ టెస్ట్ వంటి పోటీ పరీక్షలకు సమాంతరంగా సన్నద్ధం కావాల్సి వస్తోంది.. ఈ నేపథ్యంలో అకడమిక్ పరీక్షలను పోటీ పరీక్షలను సమన్వయం చేసుకుంటూ ఏవిధంగా ప్రిపేర్ కావాలి.. ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి? తదితర అంశాలపై సలహాలు, సూచనలు..
 
 ఫిజిక్స్
 ఇంటర్మీడియెట్ బైపీసీలో అకడమిక్ లేదా పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపే క్రమంలో ఫిజిక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం సమయపాలన, ఏకాగ్రత, సరైన ప్రణాళిక చాలా అవసరం.ద్వితీయ సంవత్సరంలో ఎప్పటికప్పుడు పూర్తి అయిన అంశాలపై పూర్తి అవగాహనను పెంచుకుంటూ ముఖ్యమైన ఫార్మూలాలను, సిద్ధాంతపరమైన అంశాలను ఒకే నోట్స్‌లో రాసుకోవాలి. దీనివల్ల పోటీ పరీక్షలకు ముందు పునఃశ్చరణలో సమయం చాలా ఆదా అవుతుంది. ప్రథమ సంవత్సర అంశాలపై కూడా ఈ పద్ధతి పాటించవచ్చు.ద్వితీయ సంవత్సర అంశాలను కూడా కింది విధంగా భాగాలుగా విభజించుకోవాలి. ఉదాహరణకు కిరణ దృశ్య శాస్త్రాన్ని తీసుకుంటే..
 
 1. పరావర్తనం-దర్పణాలు, 2. వక్రీభవనం-ప్రాథమిక భావనలు, 3. పట్టకం, 4. కటకాలు, 5. దృక్ సాధనాలుగా.. విభజించుకోవచ్చు. తద్వారా ప్రిపరేషన్ సులభమవుతుంది.    తరంగ దృశ్య శాస్త్రం, అయస్కాంతత్వం, అయ స్కాంత పదార్థాలు, కాంతి విద్యుత్ ఫలితం, పరమాణువులు, కేంద్రకాలు వంటి అంశాలలో సంఖ్యాత్మక ప్రశ్నలతోపాటు సిద్ధాంతపరమైన అంశాలను అధ్యయనం చేయాలి. ఇందుకోసం ఇంటర్మీడియెట్ అకాడమీ పుస్తకాలు చదవటం మేలు.    స్థిర విద్యుత్‌లో విద్యుదావేశాల వితరణ, పొటెన్షియల్ వితరణ వంటి అంశాలు క్షుణ్నంగా అభ్యసించాలి. ఇంటర్ అకాడమీ పాఠ్యాంశాలతోపాటు ఎంసెట్ ప్రశ్నలనిధిని కూడా పూర్తిగా అభ్యసించాలి.
 
 ధ్వని నుంచి 2 ప్రశ్నలు (5 శాతం), దృశ్య శాస్త్రం నుంచి 4 ప్రశ్నలు (10 శాతం), విద్యుత్ విభాగం నుంచి 8 ప్రశ్నలు (20 శాతం) ఆధునిక భౌతిక శాస్త్రం నుంచి 6 ప్రశ్నలు (15 శాతం) వస్తాయి. కాబట్టి ప్రాధాన్యత క్రమంలో వీటిని ప్రిపేర్ కావాలి.ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పోటీ పరీక్షలకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి ద్వితీయ సంవత్సరం పాఠ్యాంశాలతోపాటు ప్రథమ సంవత్సర పాఠ్యాంశాలను కూడా పునశ్చరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందుగా ప్రథమ సంవత్సర పాఠ్యాంశాలను మూడు భాగాలుగా చేసుకోవాలి. అవి..
 
     1. గతిశాస్త్రం, 2. ద్రవ్య ధర్మాలు, 3. ఉష్ణం.
 గతిశాస్త్రం నుంచి సుమారు 12 ప్రశ్నలు (20 శాతం), ద్రవ్యధర్మాల నుంచి 4 (10 శాతం) ప్రశ్నలను, ఉష్ణం నుంచి 4 ప్రశ్నలు (20 శాతం) వస్తాయి. కాబట్టి ప్రాధాన్యత క్రమంలో వీటిని ప్రిపేర్ కావాలి.
 ద్రవ్యధర్మాలు, ఉష్ణంలలో ప్రశ్నలు గతిశాస్త్రంతో పోల్చితే తేలికగా ఉంటాయి. కాబట్టి వీటిపై పూర్తి అవగాహన వచ్చేలా సాధన చేయాలి.
 
 సరళరేఖాత్మక గమనం, సమతలంలో చలనం, న్యూటన్ గమన సూత్రాలు వంటి భాగాల్లో ప్రాథమిక అంశాలను బాగా పునశ్చరణ చేసుకోవడం ప్రయోజనకరం.ఇదేవిధంగా ఉష్ణ వ్యాకోచం, ఉష్ణ ప్రసారాలు ఉష్ణయంత్రాలు, అణుచలన సిద్ధాంతం వంటి అంశాలను విస్తృతంగా అధ్యయనం చేయాలి.మొదటి సంవత్సరం అధ్యాయాలు ప్రతిరోజూ చదవటానికి సమయం సరిపోకపోవచ్చు. కాబట్టి ప్రతి అధ్యాయాన్ని విభాగాలుగా విభజించి అదనపు సమయం దొరికినప్పుడు వాటిని పునశ్చరణ చేసుకోవాలి.
 
 ఉదాహరణకు సరళరేఖాత్మక గమనాన్ని ఈ భాగాలుగా విభజించుకోవచ్చు.1. క్షితిజ సమాంతర చలనం, 2. స్వేచ్ఛగా కిందకుపడే వస్తువులు, 3. నిలువుగా పైకి విసిరిన వస్తువులుఇదేవిధంగా న్యూటన్ గమన నియమాలను ఈ విభాగాలుగా విభజించవచ్చు.1. గమన సూత్రాలు; 2. ద్రవ్య వేగ నిత్యత్వ నియమం; 3. సమాంతర తలాలపై ఘర్షణ; 4. వాలు తలాలపై ఘర్షణ. ఈ విధంగా ప్రతి అధ్యాయాన్ని విభజించి, అందుబాటులో ఉన్న సమయానికి అనుగుణంగా పునశ్చరణ చేసుకోవాలి.
 
 -పి. కనక సుందర రావు,
 (శ్రీ గాయత్రి విద్యా సంస్థలు)
 
 బోటనీ
 ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం బోటనీలో 6 యూనిట్లు (14 చాప్టర్లు) ఉన్నాయి.
 ఇందులో మొదటి యూనిట్ ఫిజియాలజీ. ఇందులో ఆరు చాప్టర్లు ఉన్నాయి.  మొదటి చాప్టర్ ట్రాన్స్‌పోర్ట్ ఫెనమిన ఇన్ ప్లాంట్స్. ఇందులోని అంశాలను పరిమితంగానే వివరించారు. కాబట్టి పాఠ్యపుస్తకం చివర ఉన్న ప్రశ్నలకు మాత్రమే ప్రిపరేషన్‌ను పరిమితం చేయాలి. ఫిజియాలజీలోని ఎంజైమ్స్, ఫోటోసెంథిసిస్, రెస్పిరేషన్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ అంశాల వివరణ కొంత గందరగోళంగా ఉంది.కాబట్టి విద్యార్థులు పాఠ్యపుస్తకం చివర ఉన్న ప్రశ్నలకు మాత్రమే ప్రిపరేషన్‌ను పరిమితం చేస్తే సరిపోతుంది.
 
 పాఠ్యపుస్తకం చదివినంత మాత్రన ఐపీఈలో కావల్సిన విధంగా సమాధానాన్ని ఇవ్వలేకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలకు సంబంధించి సినాప్సిస్, వివరణలను రూపొందించుకోవడం ప్రయోజనకరం. సినాప్సిస్ వల్ల ప్రిపరేషన్ సమయం ఆదా అవ్వడమే కాకుండా సమాధానాన్ని ప్రభావవంతంగా ఇవ్వడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్ (ఔఅఖ), షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ (అఖ)లకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా చేర్చిన ప్రశ్నలను కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి.
 
 యూనిట్ల వారీగా వెయిటేజీ:
 ప్లాంట్ ఫిజియాలజీ (28 మార్కులు); మైక్రోబయాలజీ (6 మార్కులు); జెనెటిక్స్ (6 మార్కులు); మాలిక్యులర్ బయాలజీ (8 మార్కులు); బయోటెక్నాలజీ (16 మార్కులు); ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ (12 మార్కులు)దీర్ఘ సమాధాన ప్రశ్నలు యూనిట్-1, 5, 6 నుంచి రావచ్చు. మొదటి యూనిట్‌కు మొత్తం మార్కుల్లో దాదాపు సగం వెయిటేజీ ఇచ్చిన కారణంగా.. ఈ యూనిట్‌పై అధికంగా దృష్టి సారించాలి.ఫోటోసెంథిసిస్, రెస్పిరేషన్ ప్రశ్నలు అడగడం ఒక అనవాయితీగా వస్తోంది. కాబట్టి వీటిల్లోని దీర్ఘ సమాధాన ప్రశ్నలను రెండు/మూడు సార్లు ప్రాక్టీస్ చేయాలి.సమాధానాలను రాసే క్రమంలో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ప్రతి సమాధానానికి సబ్-హెడ్డింగ్, అవసరమైన చోట ఫ్లోర్ చార్ట్ వేయడం వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే వీటికోసం ప్రత్యేకంగా కొన్ని మార్కులు కేటాయిస్తారు.
 
 అవసరమైన చోట డయాగ్రమ్‌ను చక్కగా వేయడంతోపాటు మంచి వివరణ కూడా ఇవ్వాలి.
 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఐపీఈతోపాటు ఎంసెట్ పరీక్షకు సమాంతరంగా సిద్ధం కావాలి. ఈ రెండు విభాగాలు దేనికవే ప్రత్యేకమైనవి. కాబట్టి ప్రిపరేషన్ కూడా అందుకు తగ్గట్టుగా మార్చుకోవాలి. ప్రతి చాప్టర్‌ను చదివే క్రమంలో అందులోని మౌలిక భావనలపై పట్టు సాధించాలి.ద్వితీయ సంవత్సరం నుంచి ఎంసెట్‌లో దాదాపు 20 ప్రశ్నలు రావచ్చు. అంటే ప్రతి చాప్టర్ నుంచి ప్రశ్న ఇవ్వొచ్చు. మైక్రోబయాలజీ, ప్లాంట్స్, మైక్రోబ్స్, హ్యూమన్ వెల్ఫేర్ నుంచి అధిక శాతం ప్రశ్నలు అడగొచ్చు.
 -బి. రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
 
 జువాలజీ
 ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంతో పోల్చితే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి. ఎందుకంటే ద్వితీయ సంవత్సరంతోపాటు మొదటి సంవత్సరం సిలబస్‌ను సమాంతరంగా చదవడమేకాకుండా.. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రిపరేషన్ సాగించాల్సి వస్తోంది. ద్వితీయ సంవత్సరం జువాలజీ సబ్జెక్ట్‌లో 8 యూనిట్లు ఉన్నాయి. ఇందులో 5 యూనిట్లు హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీకి సంబంధించినవి. మిగతా యూనిట్లు.. జెనెటిక్స్, ఆర్గానిక్ ఎవల్యూషన్, అప్లయిడ్ బయాలజీకి చెందినవి.ఎంసెట్, ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామ్స్ (ఐపీఈ) దృష్టి కోణంలో మొదటి 5 యూనిట్లు కీలకమైఎంసెట్‌లో సీనియర్ జువాలజీ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి.
 
  ఇందులో 10-12 ప్రశ్నలు మొదటి ఐదు యూనిట్ల నుంచే అడుగుతారు.ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టిమ్ సమాధానాలను గుర్తుంచుకోవడానికి షార్ట్ కట్ మెథడ్స్‌ను నేర్చుకోవాలి.హ్యూమన్ అనాటమీ-ఫిజియాలజీ యూనిట్లలోని డయాగ్రమ్స్‌ను రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అధిక శాతం సమాధానాలను వీటితోనే ముడిపడి ఉంటాయి.ప్రతి యూనిట్ చివర ఇచ్చిన వేరీ షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. మెరుగైన మార్కుల సాధనలో ఇవి కీలకం. అయితే వరుసక్రమంలో సమాధానాలను రాయడం మరవద్దు.షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్‌కు పాయింట్ల వారీగా జవాబులివ్వాలి. లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్‌ల్లో డయాగ్రమ్‌తో కూడిన ప్రశ్నలను ఎంచుకోవడం మార్కుల సాధనలో మంచి ఎత్తుగడగా నిలుస్తుంది.
 
 యూనిట్ల వారీగా వెయిటేజీ:
 హ్యూమన్ అనాటమీ-ఫిజియాలజీ-1 (10 మార్కు లు); హ్యూమన్ అనాటమీ-ఫిజియాలజీ-2 (10 మార్కులు); హ్యూమన్ అనాటమీ-ఫిజియాలజీ-3 (8 మార్కులు); హ్యూమన్ అనాటమీ-ఫిజియాలజీ-4 (8 మార్కులు); హ్యూమన్ రీప్రొడక్షన్ (12 మార్కులు); జెనెటిక్స్ (12 మార్కులు); ఆర్గానిక్ ఎవల్యూషన్ (8 మార్కులు); అప్లయిడ్ బయాలజీ (8 మార్కులు).ప్రతి యూనిట్ చివర్లో ఇచ్చిన పారిభాషిక పదకోశాన్ని సాధన చేయాలి. పాఠ్యపుస్తకాల్లో నేరుగా సమాధానాలు లేని ప్రశ్నలకు అధ్యాపకులను సంప్రదించి సమాధానాలు రాసుకోవాలి. తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకంలో ప్రతి యూనిట్ చివర్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను సాధన చేయాలి. తోటి విద్యార్థులతో క్లిష్టమైన పాఠ్యాంశాలపై చర్చించడం వల్ల పరోక్షంగా పునశ్చరణకు వీలవుతుంది.
 -కె. శ్రీనివాసులు, శ్రీచైతన్య విద్యాసంస్థలు.
 
 కెమిస్ట్రీ
 కెమిస్ట్రీలో మూడు విభాగాలు.. ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆయా విభాగాల వారీగా సమయాన్ని కేటాయించాలి.
 సెకండియర్ కెమిస్ట్రీ సిలబస్‌లోని సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. కొత్త సిలబస్ ప్రకారం ఆర్గానిక్‌లో చాలా రీజనింగ్ ప్రశ్నలున్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి.
 
 ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ.. ఈ మూడింటిలో మూడు వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి. వీటిలో అధిక ప్రాధాన్యం గల చాప్టర్లు.. ఆల్కహాల్స్, అమైన్స్, సాలిడ్ స్టేట్, కార్బొనిల్ కాంపౌండ్‌‌స, ఎలక్ట్రో కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్.
 కెమిస్ట్రీలో ఏదైనా చాప్టర్ చదివేటప్పుడు తెలుగు అకాడమీ బుక్‌లోని ప్రతి ముఖ్యమైన పాయింట్‌ను అండర్‌లైన్ చేసుకోవాలి. వాటిని దశలవారీగా రివిజన్ చేయాలి. దీనివల్ల విద్యార్థులు లఘు సమాధాన ప్రశ్నలన్నింటికీ తేలిగ్గా సమాధానాలు రాయగలుగుతారు.
 
 ముఖ్యమైన చాప్టర్లు- చదవాల్సిన కనీస సమయం:
 సాలిడ్ స్టేట్    6 గంటలు
 సొల్యూషన్స్    4 గంటలు
 ఎలక్ట్రో కెమిస్ట్రీ    4 గంటలు
 సర్ఫేస్ కెమిస్ట్రీ    3 గంటలు
 మెటలర్జీ    8 గంటలు
 పి-బ్లాక్ ఎలిమెంట్స్    8 గంటలు
 డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్    8 గంటలు
 కోఆర్డినేట్ కాంపౌండ్స్    4 గంటలు
 పాలిమర్స్    4 గంటలు
 బయో మాలిక్యూల్స్    3 గంటలు
 ఆర్గానిక్ కాంపౌండ్స్    12 గంటలు
 
 గెలుపు సూత్రాలు
 పరీక్షల కోణంలో ముఖ్యమైన చాప్టర్లను, కాన్సెప్ట్‌లను గుర్తించి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
 ప్రధాన కాన్సెప్ట్‌ను చదవడంతోపాటు సంబంధిత లెక్చర్ నోట్స్‌ను, మెటీరియల్‌ను బాగా అధ్యయనం చేయాలి. ప్రతి కాన్సెప్ట్‌ను నిర్వచించడం-విశ్లేషించడం-అనువర్తించడం విధానంలో చదవాలి.
 లను ఆ రోజే పూర్తిచేయాలి. ప్రతి చాప్టర్‌కు సంబంధించిన ముఖ్యమైన సినాప్సిస్‌ను నోట్ బుక్‌లో రాసుకొని బాగా చదవాలి. ప్రశ్నలపైనా దృష్టిసారించాలి. ఎంసెట్ వంటి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నవారు తొలుత సబ్జెక్టు బేసిక్స్‌ను తర్వాత కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. చివర్లో అప్లికేషన్స్‌పై దృష్టిసారించాలి.
 పాఠ్య పుస్తకాలను చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్ చేయాలి. ఇలాచేస్తే చివర్లో క్విక్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement