ఫిజికల్ సైన్స్ | Physical Science | Sakshi
Sakshi News home page

ఫిజికల్ సైన్స్

Published Sat, Jan 18 2014 10:45 PM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

ఫిజికల్ సైన్స్ - Sakshi

ఫిజికల్ సైన్స్

 1.    సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
     కోపర్నికస్
 2.    చంద్రునిపై గురుత్వ త్వరణం విలువ?
     1.67 మీ./సె.
 3.    గురుత్వ త్వరణం జ విలువను కనుగొనే పరికరాన్ని ఏమంటారు?
     గురుత్వమాపకం
 4.    సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్(షార్) ఎక్కడ ఉంది?
     }-çహరికోట, నెల్లూరు జిల్లా
 5.    పలాయన వేగం విలువ ఎంత?
     11.2 కి.మీ./సె.
 6.    భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
     టాలెమీ
 7.    విశ్వ గురుత్వ స్థిరాంకం ’ఎ’కు ప్రమాణాలు?
     NM
 8.    పగలు వేడిగా, రాత్రి చల్లగా ఉండే గ్రహం?
     బుధుడు
 9.    76 ఏళ్లకోసారి  కన్పించే తోకచుక్క?
     హేలీ
 10.    బృహస్పతి గ్రహం పరిభ్రమణ కాలం?
     12 ఏళ్లు
 11.    ఒక కాంతి సంవత్సరం విలువ?
     9.3 ణ1015 మీ.
 12.    భూమికి, చంద్రునికి మధ్య దూరం?
     3.85 ణ105 కి.మీ.
 13.    పలుచటి గాజుపలక మందాన్ని, సన్నని తీగ వ్యాసాన్ని కనుక్కోవడానికి ఉపయోగించేది?
     స్క్రూగేజి
 14. స్క్రూగేజి ఏ సూత్రంపై ఆధారపడి పని చేస్తుంది?
     మరసీల
 15.    కాంతి అభివాహానికి ప్రమాణం?
     ల్యూమెన్
 16.    బంగారం, వజ్రం విలువైన రాళ్ల ద్రవ్యరాశి తెలుసుకోవడానికి వాడే ప్రమాణం?
      క్యారెట్
 17.    పౌనఃపున్యానికి ప్రమాణం?
     హెర్‌‌ట ్జ
 18.    వాతావరణ పీడనాన్ని కనుగొనే పరికరం?
     భారమితి
 19.    ఫాథమ్ ప్రమాణాన్ని దేనికి ఉపయోగిస్తారు?
     సముద్రపులోతు తెలుపడానికి
 20.    ఒక ఆంగ్‌స్ట్రాం యూనిట్ ఎన్ని సెం.మీ.?
     10ృ8 సెం.మీ.
 21.    సమవృత్తాకార చలనంలో స్థిరరాశి?
     కోణీయ వేగం
 22.    అపకేంద్ర బలం ఏ రకమైన బలం?
     మిథ్యా బలం
 23.    న్యూటన్ గమన నియమాలు ఏ నిర్దేశ చట్రంలో పాటించొచ్చు?
     జడత్వ
 24.    1 రేడియన్ విలువ?
     57ని.18’
 25.    చీకటిలో ఫొటోలు తీయడానికి ఉపయోగించే కిరణాలు?
     పరారుణ
 26.    రాడార్, టెలిమెట్రీ, మైక్రో ఓవెన్‌లలో ఉపయోగించే తరంగాలు?
     మైక్రో
 27.    రేడియోధార్మిక కిరణాలు?
     గామా (జ)
 28.    మృదు గీకిరణాలను ఉపయోగించి రోగ నిర్ధారణ చేయడాన్ని ఏమంటారు?
     రేడియోగ్రఫీ
 29.    మృదుగీకిరణాలను ఉపయోగించి రోగ నివారణ చేయడాన్ని ఏమంటారు?
     రేడియోథెరపీ
 30.    స్థిర తరంగాల్లో అత్యధిక స్థానభ్రంశం ఉన్న బిందువు?
     ప్రస్పందన
 31.    స్థిర తరంగాల్లో అత్యల్ప స్థానభ్రంశం ఉన్న బిందువు?
     అస్పందన
 32.    రెండు వరుస ప్రస్పందనలు (లేదా) అస్పందనల మధ్య దూరం?
     /2
 33.    అవరోధాల నుంచి పరావర్తనం చెందిన తరంగాల ప్రావస్థ?
     ఞ (లేదా) 180ని
 34.    ధ్వని ప్రసరణ కావడానికి యానకానికి ఉండాల్సిన లక్షణాలు?
     స్థితిస్థాపకత, జడత్వం
 35.    కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
     న్యూటన్
 36.    హైగెన్‌‌స ప్రతిపాదించిన సిద్ధాంతం?
     తరంగ సిద్ధాంతం
 37.    కాంతి తరంగాలు వ్యాపించడానికి ఏది అవసరమని హైగెన్‌‌స ఊహించాడు?
     ఈథర్
 38.    కాంతి తీవ్రతకు ప్రమాణం?
     కాండెలా
 39.    హేలోజన్ దీపం దీప్యత విలువ?
     58 ల్యూమెన్‌లు/వాట్
 40.    సంపూర్ణ గోళానికి ఘనకోణం?
     4( 22/7) sr
 41.    రూబి లేజర్ తరంగదైర్ఘ్యం?
     6943 అని
 42.    జనాభా విలోమాన్ని సాధించే ప్రక్రియను ఏమంటారు?
     పంపింగ్
 43.    వాయుస్థితి లేజర్‌కు ఉదాహరణ?
     He-Ne లేజర్
 44.    శూన్యంలో అయస్కాంత ప్రవేశ్యశీలత (ఝ0)?
     4(22/7) ణ10ృ7 Henry/mt
 45.    అయస్కాంత భ్రామకం .SI. ప్రమాణం?
     ఆంపియర్ - మీటర్2
 46.    పారా అయస్కాంత పదార్థానికి ఉదాహరణ?
     అల్యూమినియం, ప్లాటినం, క్రోమియం, ఆక్సిజన్, నికెల్, మాంగనీస్
 47.    డయా అయస్కాంత పదార్థానికి ఉదాహరణ?
     బంగారం, ఆల్కహాల్, పాదరసం, గాలి, నీరు, బిస్మత్
 48.    ఫెర్రో అయస్కాంత పదార్థానికి ఉదాహరణ?
     Fe,Co,Ni,Gd,Dy
 49.    విద్యుత్ ప్రవాహ ప్రమాణం?
     ఆంపియర్
 50.    అఓమీయ వాహకాలకు ఉదాహరణ?
     అర్ధవాహకాలు, విద్యుద్విశ్లేష్యాలు
 51.    ఇళ్లలో వినియోగించే విద్యుచ్ఛక్తిని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
     కిలో-వాట్-అవర్
 52.    విద్యుచ్ఛక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది?
     విద్యుత్ మోటార్
 53.    స్వయంప్రేరకత్వం, అన్యోన్య ప్రేరకత్వానికి ప్రమాణం?
     హెన్రీ
 54.    A.C.వోల్టేజ్ పరిమాణాన్ని పెంచడానికి (లేదా) తగ్గించడానికి ఉపయోగపడే విద్యుత్ సాధనం?
     ట్రాన్‌‌సఫార్మర్
 55.    డైనమో ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
     విద్యుత్ అయస్కాంత ప్రేరణ
 56.    మంచు ప్రాంతాల్లో వస్తువుల ఉష్ణోగ్రతలు కొలవడానికి వాడే థర్మామీటర్?
     ఆల్కహాల్ థర్మామీటర్
 57.    ఆరోగ్యవంతమైన మానవుని శరీర సగటు ఉష్ణోగ్రత కెల్విన్‌లలో?
     310 కెల్విన్‌లు
 58.    {Mిమికీటకాల ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి ఉపయోగించే థర్మామీటర్?
     సీబెక్ థర్మామీటర్
 59.    SONARను విస్తరించండి?
     sound navigation and ranging

 60.    వాయు వాయిద్యానికి ఉదాహరణ?
     ఫ్లూట్, క్లారినాట్, హార్మోనియం
 61.    తీగ వాయిద్యానికి ఉదాహరణ?
     వీణ, సితార్
 62.    రెండు దర్పణాల మధ్య కోణం 90ని  అయితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య?
     మూడు
 63.    బైక్రోమేట్ ఘటంలోని విద్యుచ్ఛాలక బలం?
     2 v
 64.    1 పుట్ క్యాండిల్ ఎన్ని లక్స్‌లకు సమానం?
     10.76 లక్స్
 65.    అత్యంత శ్రేష్టమైన బొగ్గు?
     ఆంథ్రసైట్
 66.    తటస్థ నిశ్చల స్థితికి ఉదాహరణ?
     రోడ్డు రోలర్
 67.    న్యూటన్ మూడో గమన నియమం ఆధారంగా పనిచేసేది?
     రాకెట్
 68.    సైకిళ్లు, మోటార్‌సైకిళ్ల గొలుసుల్లో వాడే గేర్లు?
     చోదక గొలుసు
 69.    20,000 Hzల కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న ధ్వనులు?
     అతిధ్వనులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement