సాఫ్ట్‌వేర్ సెక్టార్.. ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులతో యువత కలల కొలువులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న సాంకేతిక ప్రపంచం.
ఐటీ కోర్సు
సాఫ్ట్‌వేర్ సెక్టార్.. ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులతో యువత కలల కొలువులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న సాంకేతిక ప్రపంచం. దేశంలో ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ పట్టాలతో కాలేజీల నుంచి బయటకొస్తున్నారు. వీరిలో కంపెనీ అవసరాలకు తగినట్లు సబ్జెక్టులపై పట్టు సాధించి, ఆపై కమ్యూనికేషన్, సాఫ్ట్‌స్కిల్స్‌ను పెంపొందించుకున్న వారికే ‘సాఫ్ట్’ కొలువులు సొంతమవుతాయి..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధితో ఎన్నెన్నో కొత్త టెక్నాలజీలు ఆవిర్భవిస్తూ, కొత్త కొత్త కొలువులను ఆవిష్కరిస్తున్నాయి. వీటిని అందుకోవాలంటే ఏ టెక్నాలజీకి డిమాండ్ ఉందో తెలుసుకొని, సంబంధిత పరిజ్ఞానాన్ని ఒంటబట్టించుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఒకటి ‘షేర్‌పాయింట్’..
షేర్‌పాయింట్ అంటే?
షేర్‌పాయింట్.. సంస్థల వ్యాపార కార్యకలాపాలకు సహకరించే మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్లాట్‌ఫాం. దీన్ని ప్రొడక్ట్స్, టెక్నాలజీస్ సమ్మేళనంగా చెప్పొచ్చు. షేర్‌పాయింట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెబ్‌సైట్లను రూపొందించవచ్చు. దీంట్లోని బిల్ట్ ఇన్ ఫీచర్స్ సహాయంతో తేలిగ్గా, త్వరగా సంక్లిష్టమైన కోడింగ్ అవసరం లేకుండా వివిధ రకాల వెబ్‌సైట్లను ఆవిష్కరించవచ్చు. ఇందులో ఉన్న విభిన్నమైన Templates సహాయంతో సైట్ల రూపకల్పనలో కొత్తదనాన్ని తీసుకురావచ్చు. మొత్తంమీద షేర్‌పాయింట్ ఇటు అప్లికేషన్ ప్లాట్‌ఫాంగానూ అటు డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫాంగానూ సమర్థవంతమైనది.
ఇప్పుడు షేర్‌పాయింట్-2013 అందుబాటులోకి వచ్చింది. షేర్‌పాయింట్-2010తో పోలిస్తే కొత్త వెర్షన్‌లో చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉన్నాయి.
షేర్‌పాయింట్- 2013 ఐడియాలను, సమాచారాన్ని ఇతరులతో పంచుకునేందుకు కూడా వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు షేర్‌పాయింట్.. documents, contacts, tasksనlు స్టోర్ చేసేందుకు, ఇతరులతో పంచుకునేందుకు కూడా వీలు కల్పిస్తుంది.
షేర్‌పాయింట్ ఆధారంగా రకరకాల బిజినెస్ ఆప్స్‌ను కూడా అభివృద్ధి చేయొచ్చు.
కోర్సు వివరాలు:
షేర్‌పాయింట్-2013 కోర్సు మార్కెట్లో అందుబాటులో ఉంది. కొన్ని ఐటీ శిక్షణ సంస్థలు నెల రోజుల వ్యవధితో కోర్సును అందిస్తున్నాయి.
కోర్సులో చేరాలంటే:
షేర్‌పాయింట్ కోర్సు నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులకు డాట్ నెట్ పరిజ్ఞానం అవసరం.
కోర్సులో బోధించే అంశాలు:
షేర్‌పాయింట్ 2013 విశ్లేషణ
మేనేజింగ్ సైట్ కలెక్షన్స్ అండ్ సైట్స్
బిజినెస్ కనెక్టివిటీ సర్వీసెస్
ఎంటర్‌ప్రైజ్ కంటెంట్ మేనేజ్‌మెంట్
వెబ్ కంటెంట్ మేనేజ్‌మెంట్
డెవలపింగ్ షేర్‌పాయింట్ సొల్యూషన్స్
డెవలపింగ్ వెబ్ పార్ట్స్
డెవలపింగ్ షేర్‌పాయింట్ ఆప్స్ తదితర అంశాలను బోధిస్తారు.
కెరీర్ అవకాశాలు:
ఇప్పుడు చాలా సంస్థలు తమ ఇంట్రానెట్,పబ్లిషింగ్ సైట్స్, కంటెంట్ మేనేజ్‌మెంట్ తదితర కార్యకలాపాల కోసం షేర్‌పాయింట్‌ను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షేర్‌పాయింట్ పరిజ్ఞానం సంపాదించిన వారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
అధిక వేతనాలతో కొలువులు
ASP.NET వెబ్ అప్లికేషన్ ఆధారంగా షేర్‌పాయింట్‌ను ఆవిష్కరించారు. అందువల్ల షేర్‌పాయింట్‌ను ఔపోసన పట్టాలంటే తప్పనిసరిగా అ్క.ూఉఖీ, వెబ్ డెవలప్‌మెంట్ పరిజ్ఞానం అవసరం. ప్రస్తుతం మార్కెట్లో చాలా కొద్దిమంది డాట్ నెట్ డెవలపర్లకే షేర్‌పాయింట్‌పై అవగాహన ఉంది. కొన్ని సంస్థలు తమ డాట్‌నెట్ డెవలపర్లకు షేర్‌పాయింట్‌లో శిక్షణ ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ ప్రపంచంలో ముందుండి, మంచి వేతనం వచ్చే అద్భుత అవకాశాలను చేజిక్కించుకోవాలంటే షేర్‌పాయింట్ పరిజ్ఞానం అవసరం.
- విప్రో, ఇన్ఫోటెక్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థలు షేర్‌పాయింట్ ప్రొఫెషనల్స్‌ను అధిక వేతనాలతో నియమించుకుంటున్నాయి. ఇంటర్వ్యూల్లో కేవలం డాట్ నెట్ పరిజ్ఞానం ఉన్నవారి కంటే అదనంగా షేర్‌పాయింట్‌పై అవగాహన ఉన్న వారివైపే కంపెనీలు మొగ్గు చూపుతాయనడంలో సందేహం లేదు.
- కె. నారాయణ రావు,
సీనియర్ ఫ్యాకల్టీ, పీర్స్ టెక్నాలజీస్.