టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్‌ఆర్) బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సెన్సైస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్స్ ఎడ్యుకేషన్, వైల్డ్ లైఫ్ బయాలజీ అండ్ కన్జర్వేషన్ సబ్జెక్టుల్లో.. సబ్జెక్టును బట్టి ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను అందిస్తుంది. జనవరి-2014 నుంచి ప్రారంభమయ్యే కోర్సుల్లో ప్రవేశం కోసం గ్రాడ్యుయేట్ స్కూల్ ఎగ్జామ్ (జీఎస్‌ఈ) నిర్వహించనుంది.
వివరాలు..
జీఎస్‌ఈ-2014 ద్వారా అందిస్తోన్న కోర్సులు: మ్యాథమెటిక్స్‌లో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- పీహెచ్‌డీ; ఫిజిక్స్ లో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- పీహెచ్‌డీ; కెమిస్ట్రీలో పీహెచ్‌డీ; బయాలజీలో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ - పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ; సైన్స్ ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్; కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సెన్సైస్‌లో పీహెచ్‌డీ.
అర్హతలు:
పీహెచ్‌డీ మ్యాథమెటిక్స్: ముంబై క్యాంపస్: సంబంధిత సబ్జెక్టుతో ఎంఎస్సీ/ బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంఏ/బీఏ/బీఎస్సీ ఉత్తీర్ణత. బెంగళూరు కేంద్రం: సంబంధిత సబ్జెక్టుతో ఎంఏ/ ఎంఎస్సీ/ఎంటెక్ ఉత్తీర్ణత.
ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ మ్యాథమెటిక్స్: బెంగళూరు కేంద్రం: సంబంధిత సబ్జెక్టుతో బీఏ/బీఎస్సీ/బీఈ /బీటెక్ ఉత్తీర్ణత. ఎంఎస్సీ విద్యార్థులు అర్హులు కాదు.
పీహెచ్‌డీ ఫిజిక్స్: ఎంఎస్సీ(ఫిజిక్స్)/బీటెక్(ఇంజనీరింగ్ ఫిజిక్స్) ఉత్తీర్ణత. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ ఫిజిక్స్: బీఎస్సీ/బీఈ/ఎంఈ/ ఎంటెక్ లేదా తత్సమానం.
పీహెచ్‌డీ కెమిస్ట్రీ: ఎంఎస్సీ/బీఈ/బీటెక్/ఎంటెక్ /బీఫార్మ్/ ఎంఫార్మ్ ఉత్తీర్ణత. కెమిస్ట్రీలో అడ్వాన్స్‌డ్ నాలెడ్జ్ ఉన్న బీఎస్సీ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. టీసీఐఎస్- హైదరాబాద్‌లో ప్రవేశాలకు ఎంఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బయాలజీలో ఉత్తీర్ణత.
పీహెచ్‌డీ బయాలజీ: మాస్టర్స్ ఇన్ బేసిక్ సైన్స్ లేదా బ్యాచిలర్స్ ఇన్ అప్లైడ్ సైన్స్ ఉత్తీర్ణత. టీఐఎఫ్‌ఆర్ సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సెన్సైస్ (టీసీఐఎస్) - హైదరాబాద్‌లో ప్రవేశాలకు ఎంఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బయాలజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ/ఎంఎస్సీ బయాలజీ: బ్యాచిలర్స్ ఇన్ బేసిక్ సైన్స్ ఉత్తీర్ణత.
ఎంఎస్సీ వైల్డ్‌లైఫ్ బయాలజీ అండ్ కన్జర్వేషన్: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు జూలై 1, 2014 నాటికి 35 ఏళ్ల కంటే తక్కువ వయసు.
పీహెచ్‌డీ కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సెన్సైస్: కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణత.
కోర్సుల వ్యవధి:
పీహెచ్‌డీ: ఐదేళ్లు; ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ - పీహెచ్‌డీ: ఆరేళ్లు; ఎంఎస్సీ: మూడేళ్లు.
ఎంపిక విధానం:
సైన్స్ ఎడ్యుకేషన్ మినహాయించి మిగిలిన సబ్జెక్టులకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
మరెన్నో:
టీఐఎఫ్‌ఆర్ క్యాంపస్‌లు, కేంద్రాల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ స్కూల్ ఎగ్జామ్‌తోపాటు దేశవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ విద్యా సంస్థల్లో బయాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఈ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ బయాలజీ అండ్ ఇంటర్‌డిసిప్లినరీ లైఫ్ సెన్సైస్ (జేజీఈఈబీఐఎల్‌ఎస్)గా వ్యవహరిస్తారు.
జేజీఈఈబీఐఎల్‌ఎస్‌తో ప్రవేశం కల్పిస్తున్నవి:
ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌లు- భోపాల్; కోల్‌కతా; మొహాలీ; పుణె; తిరువనంతపురం; సీసీఎంబీ - హైదరాబాద్; సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ - హైదరాబాద్; నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ - మనేసర్; నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సెన్సైస్ - బెంగళూరు; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ- న్యూఢిల్లీ; ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ బయాలజీ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ - బెంగళూరు; నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్-పుణె; డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయలాజికల్ సెన్సైస్, టీఐఎఫ్‌ఆర్ - ముంబై.
ప్రవేశం ఇలా: జేజీఈఈబీఐఎల్‌ఎస్ స్కోర్ ఆధారంగా ఆయా ఇన్‌స్టిట్యూట్లు సొంత ప్రవేశ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసుకుంటాయి. ఇందుకోసం విద్యార్థులు చేరాలనుకుంటున్న ఇన్‌స్టిట్యూట్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ముఖ్య తేదీలు:దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 20, 2013
ప్రవేశ పరీక్ష: డిసెంబర్ 8, 2013
ఫలితాల ప్రకటన: జనవరి 15, 2014
వెబ్‌సైట్: univ.tifr.res.in
కోర్సులు - అందిస్తున్న కేంద్రాలు
మ్యాథమెటిక్స్ (పీహెచ్‌డీ): స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్, టీఐఎఫ్‌ఆర్- ముంబై; సెంటర్ ఫర్ అప్లికబుల్ మ్యాథమెటిక్స్- బెంగళూరు
మ్యాథమెటిక్స్ (ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ):
సెంటర్ ఫర్ అప్లికబుల్ మ్యాథమెటిక్స్ - బెంగళూరు.
పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ - పీహెచ్‌డీ (ఫిజిక్స్): టీఐఎఫ్‌ఆర్ - ముంబై; నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్- పుణె; టీఐఎఫ్‌ఆర్ సెంటర్ ఫర్ ఇంటర్‌డిసిప్లినరీ సెన్సైస్- హైదరాబాద్; ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియొరెటికల్ సెన్సైస్ - బెంగళూరు.
పీహెచ్‌డీ (కెమిస్ట్రీ): టీఐఎఫ్‌ఆర్- ముంబై; టీఐఎఫ్‌ఆర్ సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సెన్సైస్ - హైదరాబాద్
పీహెచ్‌డీ(బయాలజీ): టీఐఎఫ్‌ఆర్-ముంబై;
నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సెన్సైస్-
బెంగళూరు; టీఐఎఫ్‌ఆర్-హైదరాబాద్
ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- పీహెచ్‌డీ(బయాలజీ):
టీఐఎఫ్‌ఆర్- ముంబై; నేషనల్ సెంటర్ ఫర్
బయలాజికల్ సెన్సైస్ - బెంగళూరు
ఎంఎస్సీ (వైల్డ్‌లైఫ్ బయాలజీ అండ్ కన్జర్వేషన్): నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సెన్సైస్- బెంగళూరు.
పీహెచ్‌డీ (కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సెన్సైస్):
టీఐఎఫ్‌ఆర్ - ముంబై.
పీహెచ్‌డీ (సైన్స్ ఎడ్యుకేషన్): హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్‌బీసీఎస్‌ఈ) - ముంబై.
పరిశోధన కోర్సుల్లో మేటి.. టీఐఎఫ్‌ఆర్
Published Thu, Sep 12 2013 1:32 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement