Tata institute of fundamental research
-
పరిశోధనలకు కేరాఫ్.. టీఐఎఫ్ఆర్
మై క్యాంపస్ లైఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ (టీఐఎఫ్ఆర్)- ముంబై.. దేశంలోని ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థల్లో ఒకటి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, సైన్స్ ఎడ్యుకేషన్‌లో పరిశోధనలు నిర్వహిస్తూ, మాస్టర్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌లో డిగ్రీలను అందిస్తోంది. ఇక్కడ తాజాగా కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసిన కోటమర్తి హేమచంద్ర తన క్యాంపస్ అనుభవాలను వివరిస్తున్నారిలా.. అత్యున్నత వసతులు: క్యాంపస్‌లో అత్యున్నత సదుపాయాలు ఉన్నాయి. ప్రయోగశాలలు ప్రపంచస్థాయి లేబొరేటరీలకు దీటుగా ఉంటాయి. పీహెచ్‌డీలో సబ్జెక్టును బట్టి సుమారు ఏడాదిన్నర కోర్సు వర్క్ ఉంటుంది. వీలును బట్టి విద్యార్థులు నిరంతరం ప్రాక్టికల్ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారు. లైబ్రరీలో ప్రముఖ జర్నల్స్, పుస్తకాలు లభిస్తాయి. విశాలమైన హాస్టల్ గదులతోపాటు నిరంతర ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది. అన్ని రకాల భారతీయ వంటకాలతోపాటు వెస్టర్న్ ఫుడ్ కూడా లభిస్తుంది. ప్రవేశం: మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌లో చేరడానికి గ్రాడ్యుయేట్ స్కూల్ ఎగ్జామ్ రాయాలి. సంబంధిత సబ్జెక్టుతో ఎంఎస్సీ/బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంఏ/బీఏ/బీఎస్సీ తత్సమాన అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షను డిసెంబర్లో నిర్వహిస్తారు. పరిశోధన పత్రాల సమర్పణ: పీహెచ్డీ చేసేవారు దేశ, విదేశాల్లో జరిగే పరిశోధన సదస్సుల్లో పత్రాలు సమర్పించడానికి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. అంతేకాకుండా ఎన్నో అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యేందుకు అవకాశం ఉంది. దేశీయ కాన్ఫరెన్స్‌ల్లో భాగంగా ఏషియన్ బయోఫిజిక్స్ అసోసియేషన్, ఇండియన్ బయోఫిజికల్ సొసైటీల్లో పరిశోధన పత్రాలు సమర్పించాను. యూఎస్ఏ, ఇజ్రాయెల్‌తోపాటు యూరప్ దేశాల్లో జరిగిన కాన్ఫరెన్స్‌లకు హాజరయ్యాను. శాన్ఫ్రాన్సిస్కోలో 2014లో జరిగిన బయోఫిజికల్ సొసైటీ మీటింగ్‌లో స్టూడెంట్ రీసెర్చ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్నాను. పీహెచ్డీ పూర్తయిన తర్వాత పరిశోధనను కొనసాగించడానికి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో అవకాశం లభించింది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్: క్యాంపస్‌లో క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ తదితర క్రీడల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫౌండర్స్ డే, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఓపెన్ డే: సైన్స్ మౌలికాంశాలను, ఆవశ్యకతను ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రతి రెండు వారాలకు ఒకసారి ‘చాయ్ అండ్ వై’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సైన్స్‌ను వివరిస్తారు. అంతేకాకుండా ప్రతి నవంబర్‌లో ‘ఓపెన్ డే’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనిలో విజ్ఞాన శాస్త్రానికి వినోదాన్ని జోడించి విద్యార్థుల్లో పరిశోధన నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తారు. ముంబైలోని పాఠశాల విద్యార్థులను ఈ కార్యక్ర మానికి ఆహ్వానిస్తారు. -
ఉద్యోగాలు
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హైదరాబాద్‌లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సైంటిఫిక్ ఆఫీసర్: 1 అర్హతలు: 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్ లేదా 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్‌లో పీజీ ఉండాలి. ఒకటి నుంచి రెండేళ్ల అనుభవం అవసరం. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ (బి): 1 అర్హతలు: పదోతరగతితో పాటు ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్/ కంప్యూటర్ సైన్స్‌లో 60 శాతం మార్కులతో డిప్లొమా ఉండాలి. రెండేళ్ల అనుభవంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 22 వెబ్సైట్: www.tifrh.res.in వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్: 1 అర్హతలు: అగ్రికల్చర్/ హార్టికల్చర్/ యానిమల్ సెన్సైస్/ ఫిషరీస్‌లో డాక్టోరల్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు. సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్: 12 విభాగాలు: అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్, ఎంటమాలజీ, ఫిషరీస్ సైన్స్, హార్టికల్చర్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ, వెటర్నరీ సైన్స్. అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఏఎస్ఆర్బీ/ యూజీసీ నెట్లో అర్హత సాధించాలి. వయసు: 21 - 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 24 వెబ్సైట్: www.drysrhu.edu.in -
అణుశక్తిమాన్!
సంక్షిప్తంగా... హోమీ భాభా ముంబైలోని రెండు గంభీరమైన సంస్థలు... టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్, భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ లతో ముడివడివున్న సాధుశీల అణుభౌతిక నామం... హోమీ జహంగీర్ భాభా. ఈ పేరులోని ‘హోమీ’కి పార్శీ భావం ‘కాంకరర్ ఆఫ్ ది వరల్డ్’. జగద్విజేత! అయితే ఆయనెప్పుడూ తన దేశాన్నే ముందు వరుసలో ఉంచాలనుకున్నారు తప్ప అణు పితామహుడిగా ఎదగాలన్న ధ్యాసతో లేరు. పితామహుడన్నది ఈ దేశం గౌరవసూచకంగా ఆయనకు పెట్టుకున్న పేరు. 1966 జనవరి 24న హోమీ భాభా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం 101 ఫ్రాన్స్‌లోని మాంట్ బ్లాంక్‌లో కుప్పకూలిపోకుండా ఉన్నట్లయితే, కొద్ది గంటల తర్వాత భారతీయ అణు కార్యక్రమంపై వియన్నా సమావేశంలో అతడు సమర్పించబోతున్న కీలకమైన పత్రాలను ఆయన తీసుకు వెళ్లగలిగి ఉంటే... ఏమో, అంతర్జాతీయ అణుశక్తి రంగంలో భారత్ జగద్విజేతగా నిలిచి ఉండేదేమో! దురదృష్టం. ఆ ప్రమాదంలో హోమీ భాభా మరణించారు. భాభా స్థాపించి, డెరైక్టర్‌గా ఉన్న పై రెండు సంస్థలు ప్రస్తుతం భారతీయ అణుసామర్థ్య అభివృద్ధిలో ఆయన ఆశయాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేస్తున్నాయి. భాభా ఆశయం అణుశక్తి మాత్రమే కాదు. అణుశాంతి కూడా! నేర్చుకోవడం, దేశానికి సేవ చేయడం అన్నవి పారంపర్య సంప్రదాయంగా ఉన్న సంపన్న కుటుంబంలో 1909 అక్టోబర్ 30న జన్మించారు హోమీ జహంగీర్ భాభా. తండ్రి జహంగీర్ హార్ముస్జీ భాభా. ప్రసిద్ధ న్యాయవాది. తల్లి మెహరిన్. ప్రాథమిక, ప్రాథమికోన్నత, కళాశాల విద్యాభ్యాసాలు ముంబైలో పూర్తయ్యాక, మెకానికల్ ఇంజినీరింగ్‌లో అధ్యయనానికి కేంబ్రిడ్జి వెళ్లారు హోమీ. సెలవులకు ఆయన ఇండియా వచ్చేనాటికి రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకుని ఉన్నాయి. ఇక ఇక్కడే ఉండిపోయి. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్‌లో ఫిజిక్స్ రీడర్‌గా చేరారు. అప్పుడా సంస్థకు నేతృత్వం వహిస్తున్నది నోబెల్ గ్రహీత సీవీ రామన్. ఆయన ఆధ్వర్యంలో హోమీ అణుశాస్త్రానికి సంబంధించి కాస్మిక్ కిరణాలపై కీలకమైన పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో ఉన్న సాన్నిహిత్యం వల్ల భారత అణు, అంతరిక్ష కార్యక్రమాలను రూపొందించడానికి అవసరమైన ప్రభుత్వ సహకారాన్ని తీసుకోగలిగారు. భాభా బ్రహ్మచారి. పెళ్లెందుకు చేసుకోలేదని చనువున్న వారెవరైనా అడిగితే ఆయన చిరునవ్వు నవ్వేవారు. ‘‘భౌతికశాస్త్రంలోని సృజనాత్మకతతో నా వివాహం బాల్యంలోనే జరిగిపోయింది’’ అనేవారు. అణుశక్తి రంగంలో అపారమైన, అమూల్యమైన సేవలను అందించారు హోమీ భాభా. ముంబైలోని మలబార్ హిల్స్‌లో ఉన్న ఆయన స్వగృహం మెహరంగిర్ను ఇటీవలి వేలంలో ఎన్.సి.పి.ఎ. (నేషనల్ సెంటర్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్) సంస్థ రూ. 372 కోట్లకు దక్కించుకుంది. - భావిక -
ఉద్యోగాలు
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, హైదరాబాద్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సైంటిఫిక్ ఆఫీసర్(ఇ) సైంటిఫిక్ ఆఫీసర్(డి) అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. దరఖాస్తులు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూన్ 25 వెబ్సైట్: www.tifr.res.in ఆర్జీయూకేటీలో నాన్‌టీచింగ్ ఫ్యాకల్టీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, హైదరాబాద్ కింది నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సూపరింటెండెంట్, ఆఫీస్ అసిస్టెంట్ కమ్ ప్రోగ్రామర్/సీనియర్ అసిస్టెంట్, సెక్రటరీ కమ్ స్టెనో, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంటెంట్, వర్క్స్ ఇన్స్పెక్టర్(సివిల్, ఎలక్ట్రికల్), లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రరీ అసిస్టెంట్, ఐటీ మేనేజర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్/నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్, ఐటీ ప్రోగ్రామర్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్, వర్క్‌షాప్ ఫోర్‌మెన్, టెక్నికల్ ఆఫీసర్స్, ల్యాబ్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆఫీసర్(హౌజ్ కీపింగ్ అండ్ పబ్లిక్ హెల్త్), హాస్టల్ అండ్ మెస్ కేర్‌టేకర్, స్పోర్ట్స్ ఆఫీసర్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్. అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 3 వెబ్సైట్: www.rgukt.in జేఎన్టీయూహెచ్సీఈహెచ్, హైదరాబాద్ జేఎన్టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజ నీరింగ్, హైదరాబాద్ అడహక్ పద్ధతిలో లెక్చరర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంజనీరింగ్ విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జికల్. ఇతర విభాగాలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, ఎంబీఏ అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. దరఖాస్తు: వెబ్సైట్లో సూచించిన నమూనాలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూన్ 18 వెబ్సైట్: www.jntuhceh.ac.in ఎల్ఐసీలో రూరల్ కెరీర్ ఏజెంట్స్ భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) రూరల్ కెరీర్ ఏజెంట్ల నియామకానికి గ్రామీణ ప్రాంత అభ్యర్థుల (జనాభా 5000 కంటే తక్కువ) నుంచి దరఖాస్తులు కోరుతోంది. రూరల్ కెరీర్ ఏజెంట్ ప్రయోజనాలు: కమిషన్‌తో పాటు స్టయిఫెండ్ లభిస్తుంది. అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణత. వయసు: కనీసం 18 ఏళ్లు ఉండాలి దరఖాస్తులు: సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయంలో లభిస్తాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 7 మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడొచ్చు. ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లైయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో పర్మినెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్డ్ విభాగాల్లోని ఉద్యోగాల్లో నియమిస్తారు. విభాగాలు: అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్ అర్హతలు: ఫ్లైయింగ్ బ్రాంచ్: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఇంటర్ ఎంిపీసీ చదివి ఉండాలి. వయసు: 19 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. టెక్నికల్ బ్రాంచ్(ఏరోనాటికల్): ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉండాలి. వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/బీకామ్ లేదా 50% మార్కులతో ఏదైనా పీజీ ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూన్ 7 వెబ్సైట్: www.careerairforce.nic.in -
తాగునీటికి ‘విస్తరణ’ శాపం
రాయదుర్గం,న్యూస్‌లైన్: ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు ఏర్పాటు చేయతలపెట్టిన పైప్‌లైన్ నిర్మాణ పనులకు రోడ్డు విస్తరణ పనుల జాప్యం శాపంగా మారింది. వాటర్‌వర్క్స్‌శాఖ గచ్చిబౌలి డివిజన్ పరిధిలో తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు ఏడాది క్రితం రూ.4 కోట్లతో గౌలిదొడ్డి శివారులోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్ఆర్) స్థలం వద్ద ఉన్న ప్రధాన రోడ్డు నుంచి భారీ పైప్‌లైన్ పనులను చేపట్టాలని తలపెట్టారు. అనంతరం పైప్‌లను కూడా ఏడాది క్రితమే టీఐఎఫ్ఆర్ నుంచి గౌలిదొడ్డి వరకు రోడ్డుకు ఇరువైపులా తెచ్చి ఉంచారు. కానీ ఈ లోగా నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి గోపన్‌పల్లి ఎన్టీఆర్‌కాలనీలోని ఐటీ జోన్‌ను కలుపుతూ ఉన్న రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. మొదటివిడతలో ఎన్టీఆర్కాలనీ నుంచి గోపన్‌పల్లి తాండ కూడలి వరకున్న రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తిచేశారు. అనంతరం గోపన్‌పల్లితాండ కూడలి నుంచి గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాల వరకున్న రోడ్డును 120 ఫీట్లు విస్తరించి మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. దీంతో పైప్‌లైన్ పనులకు రోడ్డు విస్తరణ అడ్డంకిగా మారింది. శాఖల మధ్య సమన్వయ లోపమే ప్రధానం: మంచినీటి పైప్‌లైన్, రోడ్డు విస్తరణ, విద్యుత్తు స్తంభాల తొలగింపు జరగాలంటే జీహెచ్ఎంసీ వాటర్‌వర్క్స్, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్‌శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. కానీ మూడు శాఖల మధ్య సమన్వయలోపమే అన్ని పనులకు శాపంగా మారిం ది. ఏడాదిక్రితం పైపులను రోడ్డు పక్కనవేసి రోడ్లు భవనాల శాఖ గ్రీన్‌సిగ్నల్ కోసం వాటర్‌వర్క్స్ అధికారులు ఎదురుచూస్తున్నారు. కాగా రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలన్నా విద్యుత్‌శాఖ అధికారులు రోడ్డుపక్కన వేసిన స్తంభాలను తొలగించి కొత్తగా వేసే రోడ్డు శివారున వేయాల్సిన పనులు ప్రస్తుతం పూర్తి కావొచ్చాయి. త్వరగా రోడ్డు పనులను చేపట్టి పైప్‌లైన్ పనులు పూర్తిచేస్తే నీటి సరఫరా మెరుగుపడుతుంది. -
పరిశోధన కోర్సుల్లో మేటి.. టీఐఎఫ్ఆర్
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్ఆర్) బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సెన్సైస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్స్ ఎడ్యుకేషన్, వైల్డ్ లైఫ్ బయాలజీ అండ్ కన్జర్వేషన్ సబ్జెక్టుల్లో.. సబ్జెక్టును బట్టి ఎమ్మెస్సీ, పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను అందిస్తుంది. జనవరి-2014 నుంచి ప్రారంభమయ్యే కోర్సుల్లో ప్రవేశం కోసం గ్రాడ్యుయేట్ స్కూల్ ఎగ్జామ్ (జీఎస్ఈ) నిర్వహించనుంది. వివరాలు.. జీఎస్ఈ-2014 ద్వారా అందిస్తోన్న కోర్సులు: మ్యాథమెటిక్స్‌లో పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- పీహెచ్డీ; ఫిజిక్స్ లో పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- పీహెచ్డీ; కెమిస్ట్రీలో పీహెచ్డీ; బయాలజీలో పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ - పీహెచ్డీ, ఎమ్మెస్సీ; సైన్స్ ఎడ్యుకేషన్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్; కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సెన్సైస్‌లో పీహెచ్డీ. అర్హతలు: పీహెచ్డీ మ్యాథమెటిక్స్: ముంబై క్యాంపస్: సంబంధిత సబ్జెక్టుతో ఎంఎస్సీ/ బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంఏ/బీఏ/బీఎస్సీ ఉత్తీర్ణత. బెంగళూరు కేంద్రం: సంబంధిత సబ్జెక్టుతో ఎంఏ/ ఎంఎస్సీ/ఎంటెక్ ఉత్తీర్ణత. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్డీ మ్యాథమెటిక్స్: బెంగళూరు కేంద్రం: సంబంధిత సబ్జెక్టుతో బీఏ/బీఎస్సీ/బీఈ /బీటెక్ ఉత్తీర్ణత. ఎంఎస్సీ విద్యార్థులు అర్హులు కాదు. పీహెచ్డీ ఫిజిక్స్: ఎంఎస్సీ(ఫిజిక్స్)/బీటెక్(ఇంజనీరింగ్ ఫిజిక్స్) ఉత్తీర్ణత. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్డీ ఫిజిక్స్: బీఎస్సీ/బీఈ/ఎంఈ/ ఎంటెక్ లేదా తత్సమానం. పీహెచ్డీ కెమిస్ట్రీ: ఎంఎస్సీ/బీఈ/బీటెక్/ఎంటెక్ /బీఫార్మ్/ ఎంఫార్మ్ ఉత్తీర్ణత. కెమిస్ట్రీలో అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉన్న బీఎస్సీ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. టీసీఐఎస్- హైదరాబాద్‌లో ప్రవేశాలకు ఎంఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బయాలజీలో ఉత్తీర్ణత. పీహెచ్డీ బయాలజీ: మాస్టర్స్ ఇన్ బేసిక్ సైన్స్ లేదా బ్యాచిలర్స్ ఇన్ అప్లైడ్ సైన్స్ ఉత్తీర్ణత. టీఐఎఫ్ఆర్ సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సెన్సైస్ (టీసీఐఎస్) - హైదరాబాద్‌లో ప్రవేశాలకు ఎంఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బయాలజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ/ఎంఎస్సీ బయాలజీ: బ్యాచిలర్స్ ఇన్ బేసిక్ సైన్స్ ఉత్తీర్ణత. ఎంఎస్సీ వైల్డ్‌లైఫ్ బయాలజీ అండ్ కన్జర్వేషన్: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు జూలై 1, 2014 నాటికి 35 ఏళ్ల కంటే తక్కువ వయసు. పీహెచ్డీ కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సెన్సైస్: కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణత. కోర్సుల వ్యవధి: పీహెచ్డీ: ఐదేళ్లు; ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ - పీహెచ్డీ: ఆరేళ్లు; ఎంఎస్సీ: మూడేళ్లు. ఎంపిక విధానం: సైన్స్ ఎడ్యుకేషన్ మినహాయించి మిగిలిన సబ్జెక్టులకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. మరెన్నో: టీఐఎఫ్ఆర్ క్యాంపస్‌లు, కేంద్రాల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ స్కూల్ ఎగ్జామ్‌తోపాటు దేశవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ విద్యా సంస్థల్లో బయాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఈ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ బయాలజీ అండ్ ఇంటర్‌డిసిప్లినరీ లైఫ్ సెన్సైస్ (జేజీఈఈబీఐఎల్ఎస్)గా వ్యవహరిస్తారు. జేజీఈఈబీఐఎల్ఎస్తో ప్రవేశం కల్పిస్తున్నవి: ఐఐఎస్ఈఆర్ క్యాంపస్‌లు- భోపాల్; కోల్‌కతా; మొహాలీ; పుణె; తిరువనంతపురం; సీసీఎంబీ - హైదరాబాద్; సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ - హైదరాబాద్; నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ - మనేసర్; నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సెన్సైస్ - బెంగళూరు; నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ- న్యూఢిల్లీ; ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ బయాలజీ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ - బెంగళూరు; నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్-పుణె; డిపార్ట్మెంట్ ఆఫ్ బయలాజికల్ సెన్సైస్, టీఐఎఫ్ఆర్ - ముంబై. ప్రవేశం ఇలా: జేజీఈఈబీఐఎల్ఎస్ స్కోర్ ఆధారంగా ఆయా ఇన్స్టిట్యూట్లు సొంత ప్రవేశ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసుకుంటాయి. ఇందుకోసం విద్యార్థులు చేరాలనుకుంటున్న ఇన్స్టిట్యూట్కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ముఖ్య తేదీలు:దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 20, 2013 ప్రవేశ పరీక్ష: డిసెంబర్ 8, 2013 ఫలితాల ప్రకటన: జనవరి 15, 2014 వెబ్సైట్: univ.tifr.res.in కోర్సులు - అందిస్తున్న కేంద్రాలు మ్యాథమెటిక్స్ (పీహెచ్డీ): స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్, టీఐఎఫ్ఆర్- ముంబై; సెంటర్ ఫర్ అప్లికబుల్ మ్యాథమెటిక్స్- బెంగళూరు మ్యాథమెటిక్స్ (ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ): సెంటర్ ఫర్ అప్లికబుల్ మ్యాథమెటిక్స్ - బెంగళూరు. పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ - పీహెచ్డీ (ఫిజిక్స్): టీఐఎఫ్ఆర్ - ముంబై; నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్- పుణె; టీఐఎఫ్ఆర్ సెంటర్ ఫర్ ఇంటర్‌డిసిప్లినరీ సెన్సైస్- హైదరాబాద్; ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియొరెటికల్ సెన్సైస్ - బెంగళూరు. పీహెచ్డీ (కెమిస్ట్రీ): టీఐఎఫ్ఆర్- ముంబై; టీఐఎఫ్ఆర్ సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సెన్సైస్ - హైదరాబాద్ పీహెచ్డీ(బయాలజీ): టీఐఎఫ్ఆర్-ముంబై; నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సెన్సైస్- బెంగళూరు; టీఐఎఫ్ఆర్-హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- పీహెచ్డీ(బయాలజీ): టీఐఎఫ్ఆర్- ముంబై; నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సెన్సైస్ - బెంగళూరు ఎంఎస్సీ (వైల్డ్‌లైఫ్ బయాలజీ అండ్ కన్జర్వేషన్): నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సెన్సైస్- బెంగళూరు. పీహెచ్డీ (కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సెన్సైస్): టీఐఎఫ్ఆర్ - ముంబై. పీహెచ్డీ (సైన్స్ ఎడ్యుకేషన్): హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్బీసీఎస్ఈ) - ముంబై.