భారతీయ విద్యానిలయాలు వెలవెల! | Thousands of Indian education! | Sakshi
Sakshi News home page

భారతీయ విద్యానిలయాలు వెలవెల!

Published Thu, Oct 2 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

భారతీయ విద్యానిలయాలు వెలవెల!

భారతీయ విద్యానిలయాలు వెలవెల!

 నాణ్యమైన విద్య అందుతుందంటే చాలు.. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లేందుకు యువత సిద్ధపడుతున్న పరిస్థితులు ఇప్పటివి! కుటుంబ ఆదాయాల్లో పెరుగుదల, రుణాల లభ్యత, అందుబాటులో ఉపకారవేతనాలు.. ఇలా వివిధ అవకాశాలు విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువులకు ద్వారాలు తెరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యకు సంబంధించి ఏ విశ్వవిద్యాలయాలు అత్యున్నతమైనవో తెలుసుకోవడంతో పాటు విద్యా వ్యవస్థకు  సంబంధించి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రపంచ ర్యాంకింగ్స్ దోహదపడుతున్నాయి.. బ్రిటన్‌కు చెందిన విద్య, కెరీర్ సలహా సంస్థ క్వాక్వెరెల్లీ సైమండ్స్ (క్యూఎస్).. తాజాగా ప్రపంచ  విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.

 కొలమానాలు
  క్వాక్వెరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) ప్రపంచ విశ్వవిద్యాలయాల జాబితా తయారీకి ఆరు అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. అవి.. 1. విద్యా సంబంధ ఖ్యాతి, 2. యాజమాన్య కీర్తి, 3. విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి, 4. అంతర్జాతీయ ఫ్యాకల్టీ, 5. అంతర్జాతీయ విద్యార్థులు, 6. ఫ్యాకల్టీ- ప్రశంసలతో కూడిన వ్యక్తిగత వివరణ. ర్యాంకింగ్స్‌లో టాప్-200లో ఏ ఒక్క భారతీయ విద్యాసంస్థకూ స్థానం లభించకపోవడం గమనార్హం.
 
 ర్యాంకు సంస్థ దేశం
 1    మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
     టెక్నాలజీ    యూఎస్
 2    యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్    యూకే
 2    ఇంపీరియల్ కాలేజీ లండన్    యూకే
 4    హార్వర్డ్ యూనివర్సిటీ    యూఎస్
 5    యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్    యూకే
 
 భారత్‌లో
 ప్రపంచ ర్యాంకు    సంస్థ    ఆసియా ర్యాంకు
 222    ఐఐటీ బాంబే    41
 235    ఐఐటీ ఢిల్లీ    38
 300    ఐఐటీ కాన్పూర్    52
 322    ఐఐటీ మద్రాస్    53
 324    ఐఐటీ ఖరగ్‌పూర్    60
 421-430    యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ    81
 461-470    ఐఐటీ రూర్కీ    70
 551-600    ఐఐటీ గౌహతి    95
  పొరుగు దేశం చైనాకు సైతం టాప్ 100లో మూడు ర్యాంకులు దక్కాయి.
 
 నెం.1 మిట్
 అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్).. ప్రపంచ విశ్వవిద్యాలయాల జాబితాలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. 2012 నుంచి జాబితాలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 1861, ఏప్రిల్ 10న ఏర్పాటైన దగ్గరి నుంచి విద్యా నాణ్యత, పరిశోధనల పరంగా విశ్వవిద్యాలయం ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ‘మైండ్ అండ్ హ్యాండ్’ నినాదంతో 1,030 మంది ప్రొఫెసర్లు, 779 మంది ఇతర బోధనా సిబ్బందితో నిత్యనూతనంగా, సామాజిక దృక్పథంతో కోర్సులను అందిస్తోంది. 2013-14లో వర్సిటీలోని విద్యార్థుల సంఖ్య 11,301. పరిశోధనల కోణంలో చూస్తే వర్సిటీ అనేక ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఇంజనీరింగ్ ప్రాక్టికల్ మైక్రోవేవ్ రాడార్, హైస్పీడ్ ఫొటోగ్రఫీ వంటి ఆవిష్కరణలు వెలుగుచూశాయి.
 
 వివిధ అంశాల్లో విశ్వవిద్యాలయం స్కోర్
 (మొత్తం 100కు)
     అంశం    స్కోర్
     విద్యా సంబంధ ఖ్యాతి    100
     యాజమాన్య కీర్తి    100
     విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి    100
     అంతర్జాతీయ ఫ్యాకల్టీ    99.80
     అంతర్జాతీయ విద్యార్థులు    95.60
     ఫ్యాకల్టీ- సైటేషన్‌‌స    100
 
 భారత్‌లో నెం.1-ఐఐటీ బాంబే
 క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో గతేడాది 233 స్థానంలో నిలిచిన ఐఐటీ బాంబే ఈసారి 222వ ర్యాంకు సాధించింది. భారత్ పరంగా చూస్తే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఐఐటీ 1958లో ఏర్పాటైంది. ఉత్తమ బోధనా సిబ్బంది, విద్యాసేవలను అందించడంలో నవ్యత, పరిశోధన ప్రాజెక్టులు ఇలా వివిధ అంశాల్లో ముందుంటూ దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా గుర్తింపు సాధించింది.
 
 వివిధ అంశాల్లో విశ్వవిద్యాలయం స్కోర్
     అంశం    స్కోర్
     విద్యా సంబంధ ఖ్యాతి    66
     యాజమాన్య కీర్తి    92.50
     విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి    28.80
     అంతర్జాతీయ ఫ్యాకల్టీ    4.60
     అంతర్జాతీయ విద్యార్థులు    1.60
     ఫ్యాకల్టీ- సైటేషన్‌‌స    44.30
 
 ‘‘క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలో 222వ స్థానం, దేశంలో మొదటి స్థానం పొందినందుకు ఆనందించాల్సిన సమయమిది. విద్యా సంబంధ ఖ్యాతి (అఛ్చిఛ్ఛీఝజీఛి ఖ్ఛఞఠ్ట్చ్టజీౌ)లో 160 వ ర్యాంకు, యాజమాన్య కీర్తి లో 60వ ర్యాంకు సాధించాం. ఇంజనీరింగ్, టెక్నాలజీ ఫ్యాకల్టీ విభాగంలో ఐఐటీ బాంబే 53వ ర్యాంకు సాధించడం
 గర్వకారణం’’
 - రష్మీ ఉదయ్‌కుమార్,
 ఏపీఐవో, ఐఐటీ బాంబే.
 
 
 అగ్రరాజ్యాలదే ఆధిపత్యం  క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో
 అగ్రరాజ్యాల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. గతంలో మాదిరి ఇవి ఈసారి కూడా ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నాయి. టాప్ 1, 4, 7, 8, 9, 10 స్థానాలు అమెరికా ఖాతాలో చేరగా, 2, 5 స్థానాలు యూకేకు దఖలుపడ్డాయి. ఇతర ర్యాంకుల్లోనూ ఈ రెండు దేశాలకు చెందిన యూనివర్సిటీలే ఆధిపత్యం ప్రదర్శించాయి. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, కెమిస్ట్రీ, బయలాజికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, లింగ్విస్టిక్స్ తదితర సబ్జెక్టుల పరంగా కేటాయించిన ర్యాంకుల్లోనూ అగ్రరాజ్యాల హవా స్పష్టమైంది.
 
 సత్తా చాటిన చిన్న దేశాలు
 జనంలో ఘనంగా ఉన్న భారత్ తీవ్ర నిరాశకు గురిచేయగా; చిన్న దేశాలు సైతం ఉత్తమ ర్యాంకులు సాధించాయి. స్విట్జర్లాండ్‌లోని స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 12వ స్థానం కైవసం చేసుకుంది. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, మెక్‌గిల్ యూనివర్సిటీలకు వరుసగా 20, 21 స్థానాలు దక్కాయి. సింగపూర్, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియాలు సైతం చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించాయి.
 
 బోధనా సిబ్బంది, మౌలిక వసతులు, నిధులు..
 వీటిలో లోపాలే మనకు శాపాలు కనీస సౌకర్యాలు లేకున్నా, మెరుగైన విద్యను అందించే విద్యావిధానం మనది. మేధో సంపత్తిలో భారతీయులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. విద్యా సంస్థల విషయంలో అగ్ర రాజ్యాలతో ఇక్కడి వ్యవస్థను పోల్చడం సరికాదు. వందల ఏళ్ల కిందట రూపుదిద్దుకున్న క్యాంపస్‌లలో అన్ని విధాలా అభివృద్ధి జరిగే ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా వంటి దేశాల విశ్వవిద్యాలయాలలో మౌలికవసతులు, నిపుణులైన సిబ్బంది, ప్రయోగశాలలు, నిధులు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ర్యాంకింగ్ నిర్ధరణలో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. ఇంటర్నేషనల్ జర్నల్స్‌లో పబ్లికేషన్స్‌ను పరిశీలిస్తే ఉదాహరణకు జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలో 1000 మందికి పైగా ఫ్యాకల్టీ ఉంటారు.
 
 ఇక్కడ 70-80 మంది ఉంటారు. ఈ రెండింట్లో పబ్లికేషన్స్‌ను పరిశీలిస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. మన దేశంలో సరైన ఫ్యాక ల్టీ, మౌలిక వసతులు, నిధులు ఈ మూడింటిలోనూ లోపాలే మన విద్యా వ్యవస్థకు శాపాలని చెప్పొచ్చు. చైనా విద్యాసంస్థలు ముందు వరుసలో ఉండటానికి కారణం అక్కడ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యమే. 2000కు ముందు అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు ఆ దేశం నుంచి ఒకరు లేదా ఇద్దరు ప్రాతినిధ్యం వహించేవారు. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏ సదస్సు జరిగినా చైనా నుంచి 15-20 మంది వరకు హాజరవుతున్నారు. పరిశోధన-అభివృద్ధి విషయంలో విద్యాలయాలు పూర్తిగా ప్రభుత్వ నిధులపైనే ఆధారపడాలి. ప్రైవేటు భాగస్వామ్యంతో పరిశోధనలు చేసే అవకాశం ఇక్కడ లేదు. కార్పొరేట్ సంస్థలు.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)ను విద్యాసంస్థలకు చేరువచేస్తే కొంత వెసులుబాటు దొరుకుతుంది. విద్యాలయాలకు సరైన వనరులు ఉండి, స్వేచ్ఛ ఇచ్చి, కొత్తఆలోచనలను పలు విభాగాలు సంయుక్తంగా పంచుకునే అవకాశం ఉంటే ఉన్నతంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి.
 - డాక్టర్ కృష్ణన్ సుందర రాజన్,
 అసోసియేట్ ప్రొఫెసర్, ఐఐఐటీ-హైదరాబాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement