నాణ్యమైన విద్యకు చిరునామా వెల్స్ యూనివర్సిటీ | wells university is best university for education | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యకు చిరునామా వెల్స్ యూనివర్సిటీ

Published Sat, May 3 2014 11:49 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

wells university is best university for education

చెన్నై:నాణ్యమైన విద్యకు చిరునామాగా వెల్స్ యూనివర్సిటీ నిలుస్తోంది. వెల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న వెల్స్ గ్రూప్ విద్యాసంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా పేరుపొందాయి. నాణ్యమైన విద్యతోపాటు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగి చెన్నై నగరంలోనే ప్రముఖమైనవిగా నిలిచాయి. వెల్స్‌ను 1992లో డాక్టర్ ఇషారి కె.గణేష్ తన తండ్రి, మాజీ ఉప మంత్రి ఇషారి వేలన్ జ్ఞాపకార్థం నెలకొల్పారు. ఒక కళాశాలతో ఆరంభమై.. 2008 నాటికి 15 ఉన్నత విద్యాసంస్థలు, 15 వేల మంది విద్యార్థుల స్థాయికి విస్తరించింది. ఇంజనీరింగ్, డెంటిస్ట్రీ, పారామెడిసిన్, ఆర్ట్స్, సైన్స్, హోటల్ మేనేజ్‌మెంట్, మారిటైమ్ స్టడీస్, మేనేజ్‌మెంట్ స్టడీస్ వంటి విభిన్న కోర్సులను అందించే స్థాయికి చేరింది. వెల్స్ యూనివర్సిటీ(విస్టాస్)ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టంలోని సెక్షన్ మూడు కింద నెలకొల్పడం జరిగింది. విస్టాస్ (వెల్స్ యూనివర్సిటీగా ప్రసిద్ధి) చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో, పల్లవరం రైల్వేస్టేషన్‌కు సమీపంలో నెలకొల్పబడింది.
 
 

వెల్స్ యూనివర్సిటీ మల్లీ డిసిప్లినరీ యూనివర్సిటీ. ప్రస్తుత అవసరాలకు తగిన విభిన్నమైన, సరికొత్త కోర్సులను ఈ యూనివర్సిటీ విద్యార్థులకు అందజేస్తోంది. ఈ యూనివర్సిటీ 22 అండర్‌గ్రాడ్యుయేట్, 34 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను, ఎనిమిది అంశాల్లో డిప్లొమా కోర్సులు, ఇంకా పలు సర్టిఫికేట్ కోర్సులను అందిస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో కూడిన లాబోరేటరీలు వర్సిటీ ప్రత్యేకత. హాస్టల్ సదుపాయం కూడా ఉంది. 2012-15కు సంబంధించి యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్‌కు ఎన్‌బీఏ గుర్తింపు లభించింది. ఇక స్కూల్ ఆఫ్ మారిటైమ్ స్టడీస్.. ఐఎస్‌ఓ, క్రిసిల్ రేటింగ్‌లను పొందింది. అంతేగాక 2011 సంవత్సరానికిగాను ఉత్తమ మారిటైమ్ శిక్షణ సంస్థ కింద దీనికి ‘సముంద్ర ముంధన్ అవార్డు’ కూడా లభించింది. నేటి పోటీప్రపంచంలో విద్యార్థులు రాణించేలా చక్కని శిక్షణ అందిస్తూ మేటి విద్యాసంస్థగా వెల్స్ యూనివర్సిటీ నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement