గజ్వేల్, న్యూస్‌లైన్: మీ దగ్గర కేసీఆర్ పోటీ చేస్తుండంట గదా....రాజకీయం ఎట్లుంది బై...
రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో పెళ్లి కోసం ఆభరణాలు కొనేందుకు వెళ్లిన గజ్వేల్ వాసితో షాపు యజమాని ఆరా..
మీది గజ్వేలా? అంతా మీ నియోజకవర్గం గురించే మాట్లాడుకుంటుండ్రు పరిస్థితి ఎట్లుంది...
గజ్వేల్‌కు చెందిన బట్టల వ్యాపారితో ప్రముఖ వ్యాపారవేత్త ఆరా..
గజ్వేల్ అసెంబ్లీ స్థానం....తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న నియోజకవర్గం. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేయడం, కాంగ్రెస్, టీడీపీలు సైతం పోటీలో ఉండటంతో సహజంగానే ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి మళ్లింది. ఎన్నికల సంగ్రామంలో ఇక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా అదే స్థాయిలో ఆసక్తి రేకితస్తున్నాయి. ఇక్కడేం జరుగుతోంది అనే విషయాన్ని రోజూ తెలుసుకోవడానికి వివిధవర్గాలకు చెందిన ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్న ఈ ప్రాంతవాసులతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీల బలబలాలపై ఆరా తీస్తూ వివిధ రకాలు అంచనాలు, చర్చలు కొనసాగిస్తున్నారు.
దూతల సంచారం...
నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో నిత్యం ఆయా పార్టీల దూతలు సంచరిస్తున్నారు. రోజువారీ పరిణామాలపై వారు ఆరా తీస్తూ అధిష్టానాలకు నివేదికలను అందజేస్తున్నారు. అన్ని పార్టీలకు చెందిన బృందాలు గ్రామాల వారీగా సర్వే జరుపుతున్నాయి. సర్వే చేస్తున్నట్లు కాకుండా జనంలో కలిసిపోయి తమదైన శైలిలో రోజువారీ పరిస్థితులను ఆరా తీస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన అంశాలను పార్టీ ఆధిష్టానాలకు చేరవేస్తున్నాయి. ఈ నివేదికల ఆధారంగా ఆయా పార్టీల నేతలు తమ కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ప్రభుత్వ నిఘా విభాగాలు సైతం ఈ నియోజకవర్గంపై సీరియస్‌గా దృష్టి సారించాయి. ప్రతి పార్టీ సమావేశం, అభ్యర్థుల కదలికలు ఇలా ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా గట్టి నిఘా పెట్టాయి.
ఏం జరుగుతోంది...?
Published Fri, Apr 18 2014 12:32 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement