తెలంగాణను ముంచిండ్రు
- కాంగ్రెస్, టీడీపీపై మండిపడిన కేసీఆర్
- డీఎస్, షబ్బీర్ చెల్లని రూపాయలు
- నీళ్ల మంత్రిగా ప్రాజెక్టులు పట్టని సుదర్శన్‌రెడ్డి
- నిజాంసాగర్, షుగర్ ఫ్యాక్టరీలకు పూర్వవైభవం తెస్తాం
- బీడీ కార్మికులకు నెలకు రూ.1000 భృతి
- విద్యార్హతలు లేకున్నా ఆటోడ్రైవర్లకు లెసైన్సులు
- ఇందూరును అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతా
- జిల్లాలో టీఆర్‌ఎస్ అధినేత సుడిగాలి పర్యటన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణను నిండా ముంచింది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలేనని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. 40 ఏళ్లు కాంగ్రెస్, 18 సంవత్సరాలు టీడీపీ పాలించి తెలంగాణను అణగదొక్కాయ ని, పూర్తిగా భ్రష్టుపట్టించాయని పేర్కొ న్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీకి ఓటేస్తే వెంకయ్యబాబు, చంద్రబాబుకు వేసినట్లేనని అన్నారు. మరోసారి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలుచోట్ల మాట్లాడుతూ ప్రధానంగా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు డి.శ్రీనివాస్, షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు.
నిజామాబాద్ అర్బన్‌లో రెండుసార్లు ఓడిపోయిన డి.శ్రీనివాస్ రూరల్‌లో ఎలా గెలుస్తారనుకుంటున్నారని ప్రశ్నించారు. కామారె డ్డి, ఎల్లారెడ్డిలో ఓటమి పాలైన షబ్బీర్ అలీ ప్రజల కోసం చేసిందేమీ లేదని, ఈసారి కూడ ఆయన ఓడిపోవడం ఖాయమన్నారు.
డీఎస్, షబ్బీర్ అలీ ఇద్దరు కూడా చెల్లని రూపాయలన్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా జిల్లాకు చేసింది శూన్యమన్నారు. ప్రాజెక్టులను ఆయన పట్టించుకోలేదని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక 10 లక్షల ఎకరాల కు సాగునీరందిస్తామన్నారు.
నిజాం షుగర్స్‌కు, నిజాంసాగర్‌కు పూర్వవైభవం
నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిట్టనిలువునా అమ్ముకున్న చం ద్రబాబుకు జైలుశిక్ష పడటం, చక్కెర ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకురావడం ఖాయమని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంత చెప్పినా వినకుండా ఫ్యాక్టరీని అమ్మిన బాబు రూ. 380 కోట్ల నష్టం చేకూర్చారని మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ ఫ్యాక్టరీని చక్కదిద్దుకుంటా మ న్నారు. ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించడంతోపాటు, బోధన్‌లో చెరుకు వంగడాల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నైజాముల కాలంలో కళకళ లాడిన నిజాం సా గర్ ప్రాజెక్టును ఆధునీకరిస్తామన్నారు.
ఇందూరు జిల్లా రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తామన్నా రు. కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తరలించి, సింగూ రు ప్రాజెక్టును జిల్లాకు అంకితం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తానని చెప్పారు. కౌలాస్‌నాలా సామర్థ్యం పెంచుతామన్నారు.
ప్రాణహిత, లెండి తదితర పెండిం గ్ ప్రాజెక్టులను పూర్తి చేసి వ్యవసాయరంగానికి పూర్వవైభవం తెస్తామని హామీ ఇచ్చారు. మోతెలో పసుపుబోర్డును ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.
విద్యార్హతలు లేకున్నా ఆటోడ్రైవర్లకు డ్రైవింగ్ లెసైన్సులు ఇస్తామని, బీడీ కార్మికులందరికీ రూ.1000 భృతి కల్పిస్తామని ప్రకటించారు. ఇందూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.
బలహీనవర్గాలు గౌరవంగా బ్రతకాలి
గతంలో పరిపాలన సాగించిన కాంగ్రెస్, టీడీపీలు ఒక్క గదితో డబ్బాల్లాంటి ఇళ్లను నిర్మించి బలహీనవర్గాలను అవమానపర్చారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎ మ్మెల్యేలు, ఎంపీలు ఆ ఇళ్లలో సంసారాలు చేస్తారా? అని ప్రశ్నించారు.
బలహీనవర్గాల ప్రజలు గౌరవంగా బ్రతికేలా చూస్తామని, వారి కోసం రెండు పడక గదు లు, మరుగుదొడ్డి, స్నానపు గదులతో 125 గజాలలో రూ. మూడు లక్షల వ్యయంతో పక్కా ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. రైతులకు రూ. లక్ష మేరకు పంట రుణాల ను మాఫీ చేస్తామన్నారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుతామన్నారు.
వితంతువులు, వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500ల ఫించ ను ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మైనార్టీలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమ లు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.
టీఆర్ ఎస్ గెలుపు ఖాయమై పోయిందని, జిల్లాలో రెండు లోక్‌సభ, తొమ్మి ది అసెంబ్లీ స్థానాలలో విజయం ఖాయమన్నారు. ఈ స భలలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఎంపీ అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, ఎమ్మెల్యే అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, పోచారం శ్రీనివాసరెడ్డి, పల్లె గంగారెడ్డి, గంప గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహ్మద్ షకీల్, హన్మంత్ సింధేతదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌కు ప్రజలే హైకమాండ్
టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలే హైకమాండ్‌గా ఉంటారని, కాంగ్రెస్‌లాగా చిన్న సంతకానికి కూడా ఢిల్లీ నేతల ఆజ్ఞలు, ఆదేశాలు ఉండవని టీఆర్‌ఎస్ నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నా రు. గురువారం జిల్లాలోని పలు ప్రాంతాలలో జరిగిన సభలలో ఆమె ప్రసంగించారు. 14 ఏళ్ల ఉద్యమంలో టీఆర్‌ఎస్ నిబద్ధతో ప్రజల పక్షాన నిలిచిందన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి ప్రభుత్వం మనదే కావాలని ఆకాంక్షించారు. ఇన్ని రోజులు కో రుకుని ఉద్యమం నడిపింది స్వయంపాలన కోసమేనని స్పష్టం చేశారు. 60 ఏళ్ల తరువా త తెలంగాణకు స్వతంత్రం వచ్చిందన్నారు. కొత్త రాష్ట్రంతోపాటు వరుసగా ఎన్నికలు వచ్చాయన్నారు. పరిస్థితులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయనే దుర్బుద్ధితో ఆంధ్ర సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారన్నారు.