ఏపీ పెన్షనర్స్ ఫోరం నేతలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగులు, పిం ఛనుదారులు నిత్యం వేధింపుల పాల య్యారని, రాష్ట్ర విభజనకు మొట్టమొదటగా అంగీకారాన్ని తెలిపిన ఘనతా ఆయనదేనని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ ఫోరం ఒక ప్రకటనలో తెలిపింది. ఫోరం నిర్వాహక అధ్యక్షుడు బి.వి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఆర్.వేదప్రసాద్, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర సహాధ్యక్షు డు ఎస్.సత్యనారాయణ తదితరులు ఈ ప్రకటనలో బాబు హయాంలో ఉద్యోగులు, పింఛనుదారులు అనుభవించిన కష్టాలను, వారి పట్ల బాబు ప్రదర్శించిన నిరంకుశ వైఖరిని వివరించారు. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చునేందుకైనా సిద్ధమే గానీ, పింఛనుదారులకు ఇవ్వాల్సిన ఎనిమిది విడతల డీఆర్‌ను చెల్లించే ప్రసక్తే లేదని మొండికేసిన ఘనత బాబుదేనని వారు గుర్తు చేశారు.
పదవీకాలం ముగుస్తున్న సమయంలో వేతన సవరణ సంఘాన్ని (పీఆర్‌సీ) నియమించాల్సి ఉన్నా, ఆ విషయమై ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారని పేర్కొన్నారు. వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైరవుతున్నా, ఆ ఖాళీలను భర్తీ చేయరాదంటూ ఉత్తర్వులు జారీచేసి, మూడేళ్లకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను రద్దుచేసి, నిరుద్యోగుల ఆశలను నీరుగార్చారని విమర్శించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్లే, కొత్త రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానని చెబుతున్న బాబు, తన హయాంలో సీమాంధ్ర ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడం వల్లనే అక్కడి ప్రజలు ఉద్యోగావకాశాలను, విద్యావకాశాలను మరో పదేళ్ల వరకు కోల్పోవలసిన పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ముందుకు వచ్చి, ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించారని, అధికారంలోకి రాగా నే మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చి, ఆ వెంటనే పీఆర్‌సీ ఇస్తానని చెప్పి వాగ్దానాన్ని నిలుపుకున్నారని గుర్తు చేశారు. పింఛనుదారుల సమస్యల పరిష్కారానికి కమిటీని నియమిస్తూ, అందులో ఏపీ పెన్షనర్స్ ఫోరానికి సభ్యత్వం కల్పించారని తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డిని, టీఎన్జీవోస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సుధాకర్‌ను ఏపీపీఎస్పీ సభ్యులుగా నియమించి, ఉద్యోగుల పట్ల వైఎస్ తన ఆదరాన్ని చాటుకున్నారని గుర్తు చేశారు. అధికారంలో ఉండగా ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబించిన చంద్రబాబును బలపరిస్తే ఉద్యోగులు, పింఛనుదారుల బతుకులు బానిస బతుకులుగా మారటం తథ్యమన్నారు.
చంద్రబాబు అంటే భయమే
తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఉద్యోగుల్లోను, పెన్షనర్లలోను అభద్రతా భావం పెరిగిపోతుంది. చంద్రబాబు ప్రభుత్వం పెన్షనర్లకు కరువు భత్యం కూడా నిలుపుదల చేసింది. అందుకే బాబు పాలన అంటే ఉద్యోగులు, పెన్షనర్లలో ఇప్పటికీ భయాందోళనలు కొనసాగుతున్నాయి. సహకార, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించింది కూడా ఆయనే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఏదో ఒకటి కట్ చేస్తారనే భయం ఉద్యోగులు, పెన్షనర్లలో ఇప్పటికీ బాగా ఉంది. బాబు పాలనలో ఉద్యోగాల్లేక నిరుద్యోగం పెరిగిపోయింది. ఆ రోజులు గుర్తు చేసుకుంటేనే భయంగా ఉంటుంది. వైఎస్ పాలనలో ఉద్యోగులు,పెన్షనర్లు ఎలాంటి అభద్రతా లేకుండా విధులు నిర్వహించగలిగారు. ఉద్యోగుల సంక్షేమానికి కూడా వైఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది
- పి.వి.రమణయ్య, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు
బాబు పాలన.. ఓ పీడకల
ఔట్‌సోర్సింగ్ విధానం ప్రవేశపెట్టి ప్రభుత్వ శాఖలలో నూతన నియామకాలు నిషేధించాడు. దీంతో సంవత్సరాల తరబడి పనిచేసినా ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. బాబు ఉపాధ్యాయులకు అప్రెంటీస్ విధానం ప్రవేశపెడితే దివంగత ముఖ్యమంత్రి అప్రెంటీస్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్ అందచేశాడు. చీటికిమాటికి టీడీపీ కార్యకర్తలను ఉద్యోగులపై ఉసిగొలిపి సమాజంలో ఉద్యోగులు అంటే విలువ లేకుండా చేసేవారు. బాబు పాలన ఉద్యోగులకు ఓ పీడకలగా చెప్పుకోవచ్చు.
- రమేష్‌కుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు (ఖమ్మం)
బాబు హయాంలో వేధింపులు
Published Sat, Apr 26 2014 3:08 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM
Advertisement