నిరాశ పరచిన బాలయ్య రోడ్ షో | balakrishna road show flap | Sakshi
Sakshi News home page

నిరాశ పరచిన బాలయ్య రోడ్ షో

Published Tue, Apr 29 2014 2:05 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

నిరాశ పరచిన బాలయ్య రోడ్ షో - Sakshi

నిరాశ పరచిన బాలయ్య రోడ్ షో

అనంతపురం టౌన్/ఆత్మకూరు/ కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్ : సినీనటుడు, హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలోని రోడ్ షో ఆ పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచింది.  నగర శివారులోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసినబహిరంగ సభలో  ఆశించిన స్థాయిలో ప్రజలు కనిపించకపోవడంతో  బాలయ్యకు చిర్రెత్తింది. నేరుగా వెళ్లిపోవాలంటూ ఆదేశించడంతో బాలయ్య కాన్వాయ్ ఆగకుండా వెళ్లిపోయింది. ఆత్మకూరులో ఆయన మాట్లాడుతూ ఏమి చెప్పాలో తెలియక తడపడ్డారు.  ఈ  ప్రాంతంలో హాంద్రీనీవా కాలువ పనులను తన తండ్రి  ఎన్టీఆర్‌ప్రారంభించారని అన్నారు. అయితే అవి శిలాఫలకాలకే పరిమితమయ్యాన్న విషయం తెలియక ఆయన చెప్పిన డైలాగులకు ప్రజలు నవ్వుకోవడం కనిపించింది. టీడీపీ నాయకులు అందించిన డబ్బు తీసుకోని పార్టీ కార్యకర్తలు మద్యం సేవించి చిందులు వేశారు.
 
 కళ్యాణదుర్గంలో జరిగిన రోడ్ షో గందరగోళంగా మారింది. ప్రచార రథంలో మీసాలు మెలేస్తూ మాట్లాడడం తప్ప, ఆయన చెప్పేది ఒక ముక్క ప్రజలకు అర్థం కాలేదు. పక్కనున్న నాయకులు పేర్లను అందించగా కాంగ్రెస్ నాయకులను విమర్శించారు. పట్టణంలో టీడీపీ కార్యకర్తలు రోడ్లపైనే మద్యం తాగడంతో స్థానికులు అసౌకర్యానికి గు రయ్యారు.  మండలంలోని శిబావి, గోళ్ళ, పాతచెరువు, బోరంపల్లి, ఒంటిమిద్ది మీదుగా  బాలకృష్ణ కళ్యాణదుర్గం చేరుకున్నారు.   ఏ ఒక్క గ్రా మంలో కూడా జనం లేకపోవడంతో  ప్రచార రథం వేగంగా వెళ్లిపోయిం ది. ఒంటిమిద్ది గ్రామ శివార్లలో ప్రైవేట్ పాఠశాలలో బాలకృష్ణకు విందు ఏర్పాటు చేశారు.  అక్కడ ఆయన కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement