సత్తెన్న ఏమైపోనాడో! | botsa satyanarayana Congress candidate | Sakshi
Sakshi News home page

సత్తెన్న ఏమైపోనాడో!

Published Tue, Apr 8 2014 3:51 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

సత్తెన్న ఏమైపోనాడో! - Sakshi

సత్తెన్న ఏమైపోనాడో!

రాంబాబుకి మున్సిపల్ ఎన్నికల కిక్ ఇంకా దిగలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తన రిక్షా కట్టా డు. ఎన్నికలు అయిపోవడంతో రిక్షాను రోజంతా మార్కెట్‌లో తిప్పితే రూ. 200 వచ్చింది. సాయంత్రం రిక్షాను కో ట పక్కనే నిలిపి, పక్కనే ఉన్న బార్ వద్దకు వెళ్లాడు. జేబులోంచి వంద రూపాయలు తీసి మందు అడిగాడు. మందు తాగిన వెంటనే తన అభిమాన నేత బొత్స సత్యనారాయణ గుర్తుకొచ్చారు. జిల్లాలో తనలాంటి మందుబాబులు అభి మానించే సత్తెన్న బతుకు ఇలా అయిపోతుందని కలలో కూడా ఊహిం చని రాంబాబు ఆయన్ను చూడాలనిపించి తిన్నగా బొత్స ఇంటివైపు నడక ప్రారంభించాడు. రాంబా బు తూలుతూ సత్తిబాబు ఇంటికి వెళ్లి చుట్టూ చూశాడు. సత్తిబాబు ఇంటి వద్ద నలుగురు సెక్యూరిటీ గార్డులు తప్ప మరె వరూలేరు. దీంతో బాధను ఆపుకోలేక ఇంటి ఎదురుగా కూర్చొని ఏడుపు ప్రారంభించాడు. దీన్ని గమనించి న సూరిబాబు వెంటనే తన రిక్షాను అక్కడే నిలిపి రాం బాబు వద్దకు వెళ్లాడు.
 
 సూరిబాబు: ఒరే.. రాంబాబా... ఇక్కడికెందుకొచ్చావు..రా..
 (దీనికి రాంబాబు సమాధానం చెప్పకుండా ఏడుస్తూ.. కూర్చున్నాడు.)
 సూరిబాబు: ఒరేయ్... నిన్నేరా...మాట్లాడవేరా..
 రాంబాబు: యేటి మాట్లాడమంటావురా... ఇలాటి పరిత్తితి వత్తాదని కళ్ళోనైనా అనుకోనేదు...
 సూరిబాబు : ఏటైందేటేస్... చెప్పరాదేట్రా... ఎందుకేడుత్తాన్నావు...?
 రాంబాబు : మా సత్తెన్న పరితితి సూతుంతే ఏడుపు ఆగుతందికాదు... ఏ ఎన్నికలు జరిగినా అన్న ఇంటి సుట్టూ జనాలు ఏలలో ఉండేవోరు... ఇప్పుడు మచ్చుకి ఒక్కడైనా నేడు...  
 సూరిబాబు : అయితే నీకేటయింది. నువ్వెందుకు ఏడుతున్నావు..?
 రాంబాబు : మరి నేనుకాపోతే యెవుడేడుత్తాడేస్... పొద్దల్లా కట్టపడ్డాక పొద్దోయి ఏ సందుకెల్నా బాందీ నీలు దొరుకుతన్నాయంతే అది సత్తెన్న దయేగదరా... మరి అలాటి మహనుబావిడి పరిత్తితి ఇలా అయిపోతే ఏడుపురాక సంతోసమొత్తాదేటి?
 సూరిబాబు: మన సత్తెన్నెకి ఏటైంద్రా... బాగునేవున్నాడు కదా...
 రాంబాబు: ఏటి బాగుండేస్... ఆ ఇల్లు సూడు ఎట్టాబోసుపోందో... ఇన్నాళ్లు ఎలాటి ఎలచ్చన్లు జరిగినా.. సత్తెన్న ఇంటిదగ్ర ఎంతో హడావుడి ఉండేది. ఇప్పుడి  ఏటీనేదు...
 సూరిబాబు : నిజమేన్రా... సత్తిబాబుగోరు పరిత్తితి ఊహిత్తేనే భయమేత్తాంది...
 రాంబాబు : ఎగసేకలు ఆపేస్... 
 సూరిబాబు : ఎగసేకలంతేవేటస్...
 రాంబాబు : మరికాపోతేట్రా... మొన్న మునిసిపాల్టి ఎలచ్చన్లు జరిగియా.. ఏడన్నా సత్తెన్న కనబడ్డాడేటి? కనేసం పేరేనా ఇనబడ్డాదేటి?
 సూరిబాబు : నిజమేన్రా...  ...
 రాంబాబు : నాను కాంగ్రేసు అబ్బెర్థికే రిచ్చాకట్నాను... రిచ్చామైకులో కోల్గట్ల యీరబద్రసోమి కోస్మే సెప్పునారు... సత్తెన్నపేరే తనసనేదు. యీరబద్రసోమి కూడా నన్నుసూసి ఓటెయొండని, కాంగ్రెసు పార్టీని సూడొద్దని సెప్పినాడు... 
 సూరిబాబు : అంతే సత్తిబాబు, కాంగ్రేసు పేర్లే వద్దన్నారా..?
 రాంబాబు : డెరైట్టుగా అలగన్నెదు... అలగని సత్తెన్నపేరు మచ్చుకైనా తనచనేదు...
 సూరిబాబు : యీరబద్రసోమికి ఎమ్మెల్చి ఇచ్చిందే సత్తెన్నకదా... అలాటి యెత్తిపేరే తనచనేదా...
 రాంబాబు : అవునేస్... సూరిగే నువ్వొవిరికి మున్చిపాల్టీ ఎలచ్చన్లలలో రిచ్చాకట్టావ్...
 సూరిబాబు : నాను ఇండిపెండ్నెంట్  అబ్బెర్థికి కట్టాన్రా... ఆయనగోరు ఇంతకి ముందు కాంగ్రెస్ అబ్బెర్థ్దే... పార్టీ పేర్తో పోటీసేత్తే ఓడిపోతాడని ఇండిపెండ్నెంట్‌గా దిగినాడు...
 రాంబాబు : మరి ఆయనగోరు గెలిత్తే ఏ పార్టీలోకెల్తారు...?
 సూరిబాబు : ఆయనగోరు యీరబద్రసోమి కేండేటు... గెలిత్తే ఆయనెటుసెపితే అటెల్తాడు...
 రాంబాబు : అదేట్రా... మరి కాంగ్రెస్ తర్పున పోటీసెయ్యొచ్చుకదా...
 సూరిబాబు : ఓరి పిచ్చి రాంబాబా... మన రాస్ట్రాన్ని ఇడదీసింది కాంగ్రేస్సేగదా అంద్కే.. ఇండిపెండ్నేంట్‌గా యీరబద్రసోమి దించినాడు. ఆలు గెలిత్తే మల్లీ యీరబద్రసోమికాడికే వత్తారు...
 రాంబాబు : అద్గది రాజకీయమంతే... మరి మన సత్తెన్నపేరెందుకు సెప్పడం నేదు....
 సూరిబాబు : తెలుగోళ్లకి రెండు రాట్టాలుంతే తప్పేటని సత్తెన్న అన్నాడు కదా... అందుకే సత్తెన్న మీద పెజలు కోపంగా ఉన్నారు. అందుకే సత్తెన్న పేరు సోమి ఎక్కడా సెప్పడంనేదు. 
 రాంబాబు : యీరబద్రసోమి సెప్పకపోయినా కాంగ్రెస్ అబ్బెర్థులైనా సెప్పల్గదేటేస్... ఆలు కూడా ఎందుకు సెప్పడంనేదు... 
 సూరిబాబు : ఓరి ఎర్రోడా... ఇప్పుడికే కాంగ్రేసోళ్లకి ఓడిపోతామనే భయం పట్టుకుంది. ఇలాంటప్పుడు సత్తెన్నపేరుసెప్తే డిపాజిట్టు కూడా రాదురా...
 రాంబాబు : బలేటోడ్రా యీరబద్రసోమి సత్తెన్నపేరునేకుండా సెక్రం తిప్పుతండన్నమాట...
 సూరిబాబు ః అవున్రా... ఓడలు బళ్లు, బళ్లువాడలవడం అంతే ఇదేన్రా...  
 - న్యూస్‌లైన్, విజయనగరం పూల్‌బాగ్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement