కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల విధుల్లో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఎన్నికల నియమావళి మేరకు విధులు నిర్వర్తించాలని కలెక్టర్ అహ్మద్ బాబు సూచించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సెక్టోరల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 రోజుల్లోనే మున్సిపల్, జిల్లా, మండల పరిషత్, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అవిర్భావం జరగనుందని, ఎన్నికలు, పరీక్షలు, కొత్త రాష్ట్రం ఏర్పాటు ఒకేసారి రావడంతో పనిఒత్తిడి పెరుగుతుందని అన్నారు. ఇలాంటి పనులు భవిష్యత్తులో కూడా రాకపోవచ్చని చెప్పారు. అంకితభావంతో పని చేయాలన్నారు ఈ దఫా సెక్టోరల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారం కల్పిస్తున్నామని, అందరూ ఎంపీడీవోల వద్ద శుక్రవారం రిపోర్టు చేయాలని సూచించారు. అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, విధులపై వివరించారు.
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, ర్యాంపులు, ఓటింగ్ కంపార్ట్‌మెంట్, విద్యుత్, మరుగుదొడ్లు, ఇంటర్‌నెట్ సౌకర్యం పరిశీలించాలన్నారు. చట్టపరమైన చర్యలు చేపట్టే అంశాలపై తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పాకెట్ డైరీలో నేరానికి సంబంధించిన వివరాలు, సెక్షన్ రూల్, ఆ నేరానికి శిక్ష వంటి అంశాలను ప్రచురించినట్లు తెలిపారు. ఈవీఎంల వినియో గం, ఓటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. సమస్యలు, ఫిర్యాదులు ఉంటే కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
రూ.1.70 కోట్ల నగదు పట్టివేత
ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటివరకు 1.70 కోట్ల నగదు పట్టుకున్నామని, 3 వేలకుపైగా కేసులు నమోదు చేశామని కలెక్టర్ వివరించా రు. డబ్బు రవాణా, చీప్ లిక్కర్, బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. అనంతరం జేసీ లక్ష్మీకాంతం మాట్లాడుతూ.. జిల్లాకు మరో పది మంది పరిశీలకులు వస్తున్నట్లు తెలిపారు. నలుగురు వ్యయ పరిశీ లకులుగా, ఆరుగురు సాధారణ పరిశీలకులుగా ఉంటారని తెలిపారు. ప్రతి సెక్టోరల్ అధికారి పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఉంటాయని పేర్కొన్నారు. వాటి పరిధిలో చేపట్టాల్సిన ప నులపై వివరించారు.
అనధికార వాహనాల వినియోగం, కులమతాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం, ఉద్యోగ ని ర్వహణకు భంగం కలిగించడం, అభ్యర్థి సామగ్రి ముద్రణ, ప్రచురణకర్త పేరు ముద్రించకపోవడం, మరణాయుధాలు కలిగి ఉండడం, ఓటర్లను తరలించడం వంటివి వివరించారు. సెక్టోరల్ అధికారులు ఆయా సెక్టర్‌కు సంబంధించి మ్యాపులు, పోలింగ్ కేంద్రాలు, మధ్య దూరం మ్యాప్‌లో ఉన్నాయన్నారు. లిక్క ర్ దుకాణాల్లో గతేడాది అమ్మకాల వివరాలు సేకరించాలన్నారు. ఓటింగ్‌కు ముందు పోలింగ్ కేంద్రంలో మాక్ పో లింగ్ నిర్వహించాలన్నారు. రిపోర్టింగ్ సిస్టమ్ అంశాలపై నివేదిక సమర్పించాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో అనితాగ్రేస్, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.
ఒత్తిడికి లోనుకావద్దు..
Published Fri, Mar 28 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM
Advertisement