‘డాన్ బోస్కో’కు చేరిన ఈవీఎంలు | 'Don Bosco' reach EVMs | Sakshi
Sakshi News home page

‘డాన్ బోస్కో’కు చేరిన ఈవీఎంలు

Published Thu, Apr 10 2014 3:58 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

'Don Bosco' reach EVMs

నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడడంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల ఎన్నికల ఈవీఎంలను బుధవారం జిల్లా కేంద్రం సాగర్‌రోడ్‌లో ఉన్న డాన్‌బోస్కో కళాశాలకు చేరుకున్నాయి. అన్ని ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు.

 

గట్టి నిఘా ఏర్పాటు చేసి ఈవీఎంలను అక్కడికి చేర్చారు. దాదాపు 40 రోజుల పాటు అభ్యర్థుల భవిష్యత్ ఈవీఎంలలోనే ఉంటుండడంతో అక్కడ అధికార యంత్రాంగం అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, నల్లగొండ, కోదాడ మున్సిపాలిటీలతో పా టు హుజూర్‌నగర్, దేవరకొండ నగర పంచాయతీలలోని ఈవీఎంలను ఇక్కడికి తరలించారు. మున్సిపల్ కమిషనర్ జి. వేణుగోపాల్‌రెడ్డి, డీఈ గయాసొద్దీన్‌లు ఈవీ ఎంల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్‌రూంల వద్ద గట్టీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement