
ఆన్‌లైన్ మీడియా చానల్ ప్రారంభించిన ఈసీ
న్యూఢిల్లీ: ఓటు హక్కు, పోలింగ్ విధానం తదితర అంశాలలో ఓటర్లకు చైతన్యం కలిగించే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఇంటర్నెట్ ఆధారిత ‘‘ఓటర్ ఎడ్యుకేషన్ చానల్’’ను ప్రారంభించింది. తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ చానల్ లింకును ఈసీ ఏర్పాటు చేసింది. దీనిని యూ ట్యూబ్‌లో కూడా వీక్షించవచ్చు. ఈ చానల్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 10,400 హిట్స్ వచ్చాయి. ప్రముఖ వ్యక్తుల సందేశాలతో కూడిన వీడియోలను ఇందులో పొందుపరిచారు.
ప్రధాన ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ సందేశంతో ప్రారంభమయ్యే ఈ వీడియోల్లో.. క్రికెటర్ ధోనీ, షట్లర్ సైనా నెహ్వాల్, బాక్సర్ మేరీ కోమ్ లాంటి క్రీడాకారులు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, నటుడు ఆమిర్ ఖాన్ వంటి ప్రముఖుల సందేశాలు కూడా ఉన్నాయి. త్వరలోనే ఈ చానల్‌లో మరిన్ని వీడియో క్లిప్పిం గులు అందుబాటులో ఉంచుతామని ఈసీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.