ఎలక్షన్ వాచ్ | election watch | Sakshi
Sakshi News home page

ఎలక్షన్ వాచ్

Published Thu, Mar 27 2014 2:50 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

ఎలక్షన్ వాచ్ - Sakshi

ఎలక్షన్ వాచ్

ఎన్నికల ‘హింస’లో మరణిస్తే 20 లక్షలు
 
 న్యూఢిల్లీ: ఎన్నికల అధికారులు విధి నిర్వహణలో సహజ మరణం పొందితే వారి వారసులకు కనిష్టంగా రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని(ఈసీ) బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అధికారులు మెరుపుదాడి, మందుపాతర, బాంబు పేలుళ్ల వంటి హింసాత్మక సంఘటనలో చనిపోతే కనిష్టంగా రూ. 20 లక్షలు చెల్లించాలని పేర్కొంది. ఎన్నికల అధికారి విధి నిర్వహణలో చేతులు, కాళ్లు, దృష్టి తదితరాలను కోల్పోయి శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ. 5 లక్షల కనీస పరిహారం ఇవ్వాలని పేర్కొంది. హింస, ఉగ్రవాద దాడిలో అంగవైకల్యానికి గురైతే కనీస పరిహారంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. పరిహారాన్ని పెంచాలని డిమాండ్లు రావడంతో ఈసీ పరిహారాన్ని పెంచింది. కాగా, వచ్చే ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ సంబంధ ఇన్‌పుట్ల కొనుగోళ్లు, పంపిణీకి అనుమతివ్వాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై రాష్ట్రాల్లోని ఎన్నికల ప్రధాన అధికారులు నిర్ణయం తీసుకోవచ్చని ఈసీ తెలిపింది.
 
 
 పోలింగ్ రోజున సెలవు: కేంద్రం
 
 న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు జరగబోయే ప్రాంతాల పరిధిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయూలూ పోలింగ్ రోజున మూసి ఉంటాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఒక ఉత్తర్వులో తెలిపింది. తొమ్మిది విడతలుగా జరగనున్న లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 7 నుంచీ ప్రారంభం కానున్నారుు. లోక్‌సభతో పాటే ఆంధ్రప్రదేశ్ మరికొన్ని ఇతర రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నారుు. ఆంధ్రప్రదేశ్‌లో మే 7, 11 తేదీల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నారుు. ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సదరు నియోజకవర్గంలోని ఓటర్లకు మాత్రమే ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తారు.

 ఎన్నికల వ్యయం రూ.5 వేల కోట్లు!

 న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం రూ.5 వేల కోట్లకుపైగా సొమ్మును భారత ప్రభుత్వం వెచ్చించనుంది. అంటే ఒక్కో లోక్‌సభ స్థానానికి రూ. 10 కోట్ల చొప్పున వ్యయం కానుంది. 4 రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం ఖజానా నుంచి మరో రూ.వెయ్యి కోట్లనూ వెచ్చించాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ బుధవారమిక్కడ ఓ కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడించారు. పెద్ద రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి గరిష్టంగా చేసే వ్యయాన్ని రూ.40 లక్షల నుంచి రూ.70 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ అభ్యర్థి ఈ ఎన్నికల్లో రూ.వంద కోట్లకుపైగా వెచ్చించేందుకు సిద్ధమయ్యారన్నార
 
 500 అఫిడవిట్లు  ః ఈ-ఫెలింగ్

 న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం తొలిసారి ప్రవేశపెట్టిన ఈ-ఫైలింగ్ విధానానికి మంచి స్పందన వస్తోంది. ఈ ఎలక్ట్రానిక్ విధానం ద్వారా రాష్ట్రాల ఎన్నికల సంస్థలకు చెందిన వెబ్‌సైట్లలో ఇప్పటివరకు 500 మందికిపైగా అభ్యర్థులు అఫిడవిట్లను దాఖలు చేశారని ఈసీ వర్గాలు చెప్పాయి. 102 మంది ఆన్‌లైన్‌లో ఆస్తుల చిట్టాను దాఖలు చేయడం ప్రారంభించారని, 38 మంది పూర్తిస్థాయిలో అఫిడవిట్లు వేశారని తెలిపాయి.
 
 జార్ఖండ్‌లో ఎన్నికల  ‘రన్నర్లు’

 
రాంచీ: నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉన్న జార్ఖండ్‌లో లోక్‌సభ ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం ‘రన్నర్ల’ను రంగంలోకి దింపనుంది. దారులు సరిగ్గా లేని ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లలో వీరిని నియమించనుంది. కమ్యూనికేషన్ల పరిభాషలో ఒక చోటు నుంచి మరో చోటుకు కాలినడకన లేదా వాహనాల్లో సమాచారాన్ని చేరవేసే వారిని రన్నర్లు అంటారు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లు విఫలమైన సందర్భాల్లో, ఏదైనా సమాచారాన్ని పంపాల్సి వస్తే, వీరు దగ్గర్లోని పోలింగ్ అధికారులు, సిబ్బంది, పోలీసులకు వద్దకు వెళ్లి సమాచారం చేరవేస్తారు. జార్ఖండ్‌లో మొత్తం 24 జిల్లాలు ఉండగా, 20 జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం ఉంది. కేంద్రం చేసిన సర్వేలో దేశవ్యాప్తంగా 33 జిల్లాలను నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా గుర్తించగా అందులో 13 జార్ఖండ్‌లోనివే.     
 
 వాయవ్య ముంబై నుంచి రాఖీ

 ముంబై: బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ తాను వాయవ్య ముంబై స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ముంైబె లో మహిళలకు భద్రతను పునద్ధరించేందుకే బరిలోకి దిగుతున్నానని బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా అని అడగ్గా, ‘ఒక పార్టీ తనకు టికెట్ ఇస్తానని చెప్పింది. ఆ పార్టీ పేరేంటో త్వరలో చెబుతా’ అని బదులిచ్చారు. సామాన్యుడి సమస్యల పరిష్కారమే తన లక్ష్యమన్నారు.
 
 ఒకే పేరుతో 8 మంది... ఓటు ఎవరికి?

 
చండీగఢ్: హర్యానా జనహిత కాంగ్రెస్ అధ్యక్షుడు కులదీప్ బిష్ణోయ్‌కు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆయన హిసార్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. చిత్రమేమిటంటే ఇదే నియోజకవర్గం నుంచి కులదీప్ పేరుతో మరో ఏడుగురు పోటీ చేస్తున్నారు. మొత్తం 41 మందితో పొటీ... పైగా అందులో ఏడుగురు తన పేరుతోనే ఉండడంతో కులదీప్ బిష్ణోయ్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బిష్ణోయ్ అజయ్‌చౌతాలాపై గెలిచారు. ఈసారి చిత్రమైన పోటీతో బిష్ణోయ్ గెలుస్తారో లేదో చూడాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement