కలవని మనసులు
ఏలూరు, న్యూస్‌లైన్ : ఏలూరు నియోజకవర్గ టీడీపీలో అంతర్గత ంగా సాగుతున్న ఆధిపత్య పోరు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బడేటి కోటరామారావు (బుజ్జి), మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మధ్య సఖ్యత లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు విస్తుపోతున్నాయి. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న అంబికా కృష్ణను పక్కనపెట్టిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు బుజ్జికి పగ్గాలు అప్పగించారు. ఆయనకు సీటు కేటాయింపు విషయంలో చివరి నిమిషం వరకు ఊగిసలాట కొనసాగింది. ఇదే సందర్భంలో ఏలూరు సీటు ఆశించిన అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధినేత హామీ ఇచ్చినా ఆయన వర్గీయులకు నమ్మకం కుదరటం లేదు. అంబికా కృష్ణ పైకి సంతృప్తికరంగా ఉన్నట్టు కనిపిస్తున్నా అవసరం ఉన్నంతకాలం ఉపయోగించుకుని చివరకు కరివేపాకులా తీసిపారేసే అధినేత వైఖరి ఆయనను ఆవేదనకు గురి చేస్తోందని అంబికా వర్గీయులు చెబుతున్నారు. దీంతో ఉత్సాహంగా పనిచేయలేక.. బడేటి బుజ్జితో అంబికా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
నగరపాలక సంస్థ ఎన్నికల నుంచీ ఇదే తంతు
నగరపాలక సంస్థ ఎన్నికల నాటినుంచే అంబికా కృష్ణ, బడేటి బుజ్జి మధ్య సయోధ్య కొరవడింది. కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపి క వ్యవహారమంతా బడేటి బుజ్జి నడిపించడం అప్పట్లో అంబికా కృష్ణను, ఆయన అనుచరులను ఆవేదనకు గురి చేసింది. అంబికా వర్గీయులకు కార్పొరేటర్ సీట్లు ఇవ్వకుం డా బడేటి అడ్డుపడ్డారు. వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తానని మభ్యపెట్టారు. దీంతో నగరపాలక ఎన్నికల్లోనూ అంబికా కృష్ణ మొక్కుబడిగా ప్రచారంలో పాల్గొని పని అయిందని పించారు. అప్పట్లో అంబికా, బడేటి కలసి పట్టుమని పది డివిజన్లలో కూడా ప్రచారం చేయలేదు. ప్రస్తుత ఎన్నికల్లోనూ అంబికా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. బడేటి నామినేషన్ వేసే రోజున ఆయనతో వచ్చిన అంబికా ఆ తర్వాత నుంచి ప్రచారంలో పాల్గొన్న సందర్భమే లేదు. ఇద్దరిమధ్యా నెలకొన్న వర్గపోరే ఇందుకు కారణమైందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నారుు. ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగా వ్యవహరిస్తుండటంతో శ్రేణుల్లో గుబులు రేగుతోంది. ఇలాంటి పరిస్థితుల కారణం గా ఈసారి ఎన్నికల్లోనూ టీడీపీ చిత్తు గా ఓడిపోవడం ఖాయమన్న భయాం దోళన వారిలో వ్యక్తమవుతోంది.
శ్రేణుల మధ్యా వైరమే
అంబికా కృష్ణ, బడేటి బుజ్జి వర్గీయుల మధ్య కూడా వైరం సాగుతోంది. పైకిమాత్రం రెండువర్గాల వారు కలిసిపోరుునట్టు చెప్పుకుంటున్నా ప్రచారంలో మాత్రం క్రియూశీలకంగా ఉండటం లే దు. బడేటి బుజ్జి ఏరోజు, ఎక్కడ ప్రచా రం చేస్తున్నారో తమకు తెలియటం లేదని తమ్ముళ్లు వాపోతున్నారు. అక్కడక్కడా కొందరు ప్రచారంలో పాల్గొం టున్నా మధ్యలోనే వెళ్లిపోతున్నారు. పాత తరం నాయకులకు సముచిత స్థానం లభించకపోవడంతో వారంతా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.
ఆ హామీలు మరిచారా.. బాబూ
ఏలూరు నగరాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులిస్తామని 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగర ప్రజలకు హామీ ఇచ్చారు. ఆచరణలో రూ.20 కోట్లు కూడా కేటాయించలేదు. ఇటీవల ఏలూరులో రోడ్ షో నిర్వహిం చిన చంద్రబాబు నగరాన్ని రానున్న పదేళ్లలో ప్రజలు ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పత్రికల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జనం ముక్కున వేలేసుకున్నారు. ఏనాడూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోని చంద్రబాబు వైఖరిని గుర్తు చేసుకంటూ.. మరోసారి బాబు మాటల్ని నమ్మకూడదనే నిశ్చయూనికి వచ్చారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేరకపోవడంతో ఆ పార్టీ నేతలు కొత్తగా ఇస్తున్న హామీలను సైతం ప్రజలు పట్టించుకోవడం లేదు.
ఆళ్ల నాని దూకుడు
ఇదిలావుండగా, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆళ్ల నాని పక్కా ప్రణాళికతో ప్రచారం చేయడంతోపాటు వైఎస్సార్ సీపీ శ్రేణులన్నీ ఏకతాటిపై నడుస్తున్నారుు. ఆయన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది.