సామాజిక మంత్రం..ఆర్థిక తంత్రం
సామాజిక మంత్రం..ఆర్థిక తంత్రం
Published Fri, Apr 25 2014 12:18 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
సాక్షి, ఏలూరు : ఓట్ల కోసం.. సీట్ల కోసం తెలుగుదేశం పార్టీ తొక్కని అడ్డదారి లేదు. చేయని కుట్ర లేదు. పదవి కోసం ఆ పార్టీ అభ్యర్థులు దేనికైనా తెగిస్తున్నారు. జిల్లాలో తమ పార్టీకి ప్రజాదరణ లేదని గ్రహించి వక్రమార్గాలను అనుసరిస్తున్నారు. నేరుగా ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థిస్తే ప్రయోజనం ఉండదని తెలిసి తెరవెనుక రాజకీయం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక మంత్రాంగం చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. కులపెద్దలు, సంఘాలతో రాత్రివేళ మంతనాలు సాగిస్తున్నారు. తమకు లొంగని వారిని బెదిరిస్తున్నారు.
ప్రచారంలో వెనుకబాటుజిల్లాలోని 15 నియోజకవర్గాల్లో టీడీపీ డబ్బు లేదా బలగంతో ఓట్లు కొల్లగొట్టాలని.. లేదంటే కులం పేరు చెప్పి లబ్ధి పొందాలని చూస్తోంది. ఆ పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీచేస్తున్న వ్యక్తులు సొంత సామాజిక వర్గం లోనే తమ ప్రాభవాన్ని కోల్పోయారు. అధినేత రెండు కళ్ల సిద్ధాంతం, సమైక్యాంధ్ర ఉద్యమంలో కప్పదాటు వ్యవహారం, బీజేపీతో పొత్తు టీడీపీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీంతో ప్రచారంలో సైతం వెనుకబడిపోయారు. పలు నియోజకవర్గాల్లో స్థానికేతరులకు సీట్లుఇవ్వడంతో అక్కడి ప్రజలు వారిని ఆదరించడం లేదు. దాంతో ప్రచారానికి వెళ్లడం అనవసరమని భావించి తెరవెనుక రాజకీయూలు నడుపుతున్నారు.
ప్రలోభాలు.. బెదిరింపులు
ఈ పరిస్థితుల్లో పార్టీని గట్టెక్కించలేకపోయినా కనీసం గౌరవప్రదమైన ఓట్లు సంపాదించాలని టీడీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. కచ్చితంగా తమకు ఫలా నా నియోజకవర్గంలో గెలుపు ఖాయమనే నిర్ధారణకు రాలేని టీడీపీ నేతలు కుల రాజకీయాలకు తెరదీస్తున్నారు. అభ్యర్థులు తమ సామాజిక వర్గం పెద్దలను కలుస్తున్నారు. వారి ఆశీస్సులు అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపిస్తే అది చేస్తాం ఇదిచేస్తాం అంటూ ప్రలోభపెడుతున్నారు. ఈసారి గెలవకపోతే ఎప్పుడూ గెలవలేమనే సెంటిమెం ట్‌తో కొట్టాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నం ఫలించకపోతే బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో తీసుకున్న అప్పులు వెంటనే తిరిగిచ్చేయాల్సి వస్తుందని, కొత్తగా ఒక్క రూపాయి కూడా సాయం చేయమని గ్రామాల్లో కొందరు పెద్దలు సామాన్యుల్ని బెదిరి స్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమ కులపోడిని కాదని వేరే వాడికి ఓటేస్తే కులం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నట్లు సమాచారం.
విష సంస్కృతికి ఆజ్యం
అభ్యర్థులు ఇతర సామాజిక వర్గాల వారికి పదవులు ఎరవేస్తున్నారు.సామాజిక చిచ్చులు పెడుతున్నారు. టీడీపీ కుట్రలను జనం అసహ్యించుకుంటున్నారు. ఇన్నాళ్లూ లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా అంటూ దుయ్యబడుతున్నారు. బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగేది లేదని స్పష్టం చేస్తున్నారు. విష సంస్కృతితో కుట్రలు కుతంత్రాలతో టీడీపీ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
Advertisement