తిరుగుపోట్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సార్వత్రిక ఎన్నికల పోటాపోటీ ముఖచిత్రం ఆవి ష్కృతమైంది. నామినేషన్ల ఘట్టం ముగియటంతో ఎక్కడెక్కడ ఎవరెవరు తలపడుతున్నారో తేలిపోయింది. జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలకు 34 మంది పోటీలో మిగిలారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో చెరి స మంగా 17 మంది పోటీలో ఉన్నారు. జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో 168 మంది అభ్యర్థులు అమీతుమీకి సిద్ధమయ్యారు. అత్యధికంగా రామగుండం నియోజకవర్గంలో 27 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
అతి తక్కువగా మంథని, హుజూరాబాద్‌లో తొమ్మిది మంది చొప్పున బరిలో ఉ న్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అన్ని స్థానాల్లో పోటీ పడుతున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ, టీడీపీ చెరో ఆరు స్థానాల్లో బరిలో నిలి చింది. తొలిసారిగా వైఎస్సార్‌సీపీ పదకొండు అసెంబ్లీ స్థానాల్లో తలపడుతోం ది. మంథని, రామగుండం మినహా అన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు పోటీలో ఉ న్నారు.
అన్ని సెగ్మెంట్లలో మేమున్నాం.. అన్నట్లుగా స్వతంత్య్ర అభ్యర్థులు సై తం హడలెత్తిస్తున్నారు. అసెంబ్లీ స్థానాల్లో 60 మంది ఇండిపెండెంట్లు, లోక్‌సభ స్థానాల్లో 11 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. నోటాతో పాటు 15మందికి మించి అభ్యర్థులు పోటీపడుతున్న నియోజకవర్గాల్లో పోలింగ్ ని ర్వహణకు రెండు ఈవీఎంలు వాడాల్సి ఉంటుంది.కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ ఎన్నికలతో పాటు చొప్పదండి,రామగుండంలో ఈ పరిస్థితి అనివార్యమైంది.
బుజ్జగింపులు ఫలించక పోవటంతో నాలుగు సెగ్మెంట్లలో తిరుగుబాటు అభ్యర్థులు ప్రధాన అభ్యర్థులకు పక్కలో బల్లెంలా మారారు. కోరుట్లలో కాంగ్రెస్ రెబెల్‌గా మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు కుమారుడు నర్సింగరావు, మంథనిలో టీఆర్‌ఎస్ రెబెల్‌గా సునీల్‌రెడ్డి పోటీకి నిలిచారు.
కోరుట్లలో టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి కొమ్‌రెడ్డి రాములు, బీజేపీ అభ్యర్థి సురభి భూంరావు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సంతోష్‌రెడ్డితోపాటు జువ్వాడి బరిలో ఉండటంతో పంచముఖ పోటీ నెలకొంది.
మంథనిలో మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్‌బాబు, టీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్ట మధు, రెబెల్ అభ్యర్థి సునీల్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి కర్రు నాగయ్యల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది.
రామగుండంలో రెండు పార్టీలకు తిరుగుపోటు తప్పలేదు. కాంగ్రెస్ రెబెల్‌గా కౌశిక హరి, టీఆర్‌ఎస్ రెబెల్‌గా కోరుకంటి చందర్ పోటీలో నిలిచారు. దీంతో రామగుండంలో బహుముఖ పోటీ అనివార్యమైంది.
మానకొండూరులో టీడీపీ-బీజేపీ పొత్తు చిత్తయింది. సర్దుబాటులో ఈ సీటు టీడీపీకి అప్పగించినప్పటికీ.. బీజేపీ తరఫున ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ గడ్డం నాగరాజు రెబెల్‌గా పోటీకి నిలిచారు.
నామినేషన్ల సమయంలో జరిగిన పొరపాటుతో హుస్నాబాద్‌లో మిత్రపక్షాలు పోటీకి దూరమయ్యాయి. అక్కడ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ తరఫున సతీష్‌బాబు, వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి తలపడుతున్నారు.
కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు పొన్నం ప్రభాక ర్, డాక్టర్ వివేక్ కాంగ్రెస్ తరఫున మరోసారి పోటీకి దిగారు. టీఆర్‌ఎస్ అ భ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, బీజేపీ నుంచి మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు,వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మీసాల రాజిరెడ్డి పొన్నంతో తలపడుతున్నారు.పెద్దపల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్, టీడీపీ అభ్యర్థి డాక్టర్ శరత్ తొలిసారి ఎన్నికలు ఎదుర్కుంటున్నారు. వివేక్‌తో త్రిముఖ పోటీ అయింది.