విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈనెల 7వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం తగ్గింది. పలుమార్లు వేసిన గణాంకాల మేరకు తుది పోలింగ్ శాతాన్ని ఎలక్షన్ సెల్ శనివారం ప్రకటించింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 79.55 పోలింగ్ శాతం నమో దైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇటీవల ప్రకటించిన మొత్తం ఓటర్లు, పోలైన ఓటరు సంఖ్యల్లో ఎలాంటి మార్పులు లేకపోయినా మొత్తం పోలైన ఓటర్ల సంఖ్యలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎస్.కోట, పార్వతీపురం నియోజకవర్గాల్లో స్వల్ప మార్పులు జరిగా రుు. కాగా జిల్లావ్యాప్తంగా మొత్తం 13,67,778 ఓట్లు పోలైనట్టు తెలిపా రు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం.
కురుపాం 75.41
పార్వతీపురం 74.47
సాలూరు 76.73
బొబ్బిలి 79.07
చీపురుపల్లి 80.97
గజపతినగరం 85.24
నెల్లిమర్ల 87.69
విజయనగరం 71.28
ఎస్. కోట 85.08
సార్వత్రిక ఎన్నికల్లో 79.55 పోలింగ్
Published Sun, May 11 2014 1:31 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement