మగ్గాలే ఉరి పగ్గాలు | Governement fails to help Handloom workers | Sakshi
Sakshi News home page

మగ్గాలే ఉరి పగ్గాలు

Published Sun, Mar 23 2014 3:13 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

Governement fails to help Handloom workers

*బాబుదంతా చావుల జమానా...
* నేతన్నను ఆదుకున్న రాజన్న
* అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను నేసిన నైపుణ్యం. ఔరా అనిపించే అద్భుత పనితనం...
* ప్రపంచానికి నేత వస్త్రాన్ని పరిచయం చేసిన ఘనమైన నేపథ్యం... ఇదంతా గతం

 
జన పథం: ఒకనాడు సిరులు కొల్చిన నేల అది...చీని చీనాంబరాలు నేసిన కౌశలం వారిది... కానీ తళతళలాడే జరీ అంచులా కళకళలాడాల్సిన బతుకులు సడీచప్పుడు లేని మగ్గాల్లా దిగాలుగా ఉన్నాయి. పరిహారమడిగితే పరిహాసమాడిన పాలకుడొకరు... చేనేత ఊసే ఎత్తని పాలకుడు మరొకరు. ఇలా సర్కారు నిర్లక్ష్యంతో నూలుపోగులు...ఆకలికేకలు వేస్తున్నాయి...ఆ ఘోష ఆగ్రహంగా మారుతోంది...ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది నేతన్నలు రానున్న ఎన్నికల్లో ఓటు ఝలిపించనున్నారు. తమ ఉసురు పట్టని పాలకుల భరతం పట్టనున్నారు. పార్టీలు, నాయకుల భవితవ్యం తేల్చడానికి రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర షోషించనున్నారు.
 
 (బొల్గం శ్రీనివాస్, కరీంనగర్): అందరికీ కట్టు బట్టలిచ్చే చేనేత కార్మికుల కడగండ్లను తీర్చడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. రాష్ట్రంలో 3.58 లక్షల చేనేత కార్మికులు ఉన్నారు. పరోక్షంగా, అనుబంధ రంగాలపై వుూడు లక్షల కుటుంబాలు చేనేతపై ఆధారపడ్డాయి. వెరసి 6.58 లక్షల కుటుంబాల్లో సువూరు 33 లక్షల వుంది ఉంటారని అంచనా. చేనేతను వదిలి ఇతర రంగాల్లోకి వెళ్లిన వురో 30 లక్షల వుందితో కలిపితే ఆ సంఖ్య 63 లక్షల వరకు ఉంటుంది.

                                                                                                                                                                                            చేనేతపై ఆధారపడిన వారిని పాలక పార్టీలు వునుషులుగా పరిగణించడంలేదనే ఆవేదన వ్యక్తం అవుతోంది. కనీసం 30 లక్షల వుంది ఓటర్లనైనా ఎన్నికలప్పుడైనా రాజకీయు పార్టీలు గుర్తించడం లేదనే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుుడి తొమ్మిదేళ్ల పాలనలో చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు మొదలైతే పట్టించుకున్న పాపాన పోలేదు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యూక రూ.327 కోట్ల మేరకు చేనేత రుణాల వూఫీకి వుంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండు లక్షల వుంది చేనేత కార్మికులకు మేలు జరిగే సాహసోపేత నిర్ణయూన్ని అమలు చేయూల్సినదశలో ఆయన హఠాన్మరణం చెందారు. కె.రోశయ్య సీఎం అవ్వగానే ఆ పథకంలో కోత కోసేశారు. రూ.148 కోట్లతో 67 వేల వుందికి వూత్రమే అవులు చేసి వైఎస్ ఆదేశాల ఆశయూలపై నీళ్లు చల్లారు. కిరణ్‌కువూర్‌రెడ్డి సర్కారైతే చేనేత గురించి పట్టించుకోనేలేదు.
 
 వైఎస్ పాలనలో సుఖసంతోషాలు

 చంద్రబాబు సీఎంగా ఉండగా 2003-04లో ఆప్కో టర్నోవర్ రూ.85.85 కోట్లు వూత్రమే ఉంది. వైఎస్ సీఎంగా ఉండగా 2007-08 నాటికి ఆ మొత్తం 119.23 కోట్లకు పెరగడాన్ని బట్టే నేత కార్మికులు తయూరు చేసిన వస్త్రాలకు గిరాకీ పెరిగేలా చేశారని స్పష్టం అవుతోంది. ప్రభుత్వ శాఖలన్నీ ఆప్కో ద్వారానే వస్త్రాల్ని కొనుగోలు చేయూలన్న వైఎస్ ప్రభుత్వ ఆదేశాల పుణ్యవూ అని ఆ ఏడాది రూ.47 కోట్ల విలువైన వస్త్రాల కొనుగోళ్లు జరిగారుు. ఆ తర్వాత ఏడాది రూ.92 కోట్ల మేరకు పెరిగింది.
 
 చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రారంభమైన చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణ చర్యలతోబాటు పలు పథకాల్ని వైఎస్ సర్కారే అవులు చేసింది. 1997 ఏప్రిల్ తర్వాత ఆత్మహత్యలకు పాల్పడిన 215 వుంది కుటుంబాలకు రూ.1.5 లక్షల చొప్పున వైఎస్ ఉండగానే నష్టపరిహారం అందింది. వీరితోబాటు 114 కుటుంబాలను ప్రత్యేక కేసులుగా పరిగణించి సీఎం సహాయు నిధి నుంచి రూ. 25 వేలు చొప్పున సాయుం అందించారు. చేనేత కార్మికులకు ప్రత్యేకంగా వృద్ధాప్య పింఛన్ వ యుసు  65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకే తగ్గించిందీ.. రూ.75 ఉన్న పింఛన్ రూ.200లకు పెంచిందీ వైఎస్ సర్కారే కావడం గవునార్హం.
 
 పరిహారం కోసమే ఆత్మహత్యలన్న చంద్రబాబు
 చంద్రబాబు పాలనలో రుణవూఫీ గురించిగానీ, ఆత్మహత్యల నివారణకు చర్యలుగానీ తీసుకోకపోగా అధిక వడ్డీలకే రుణాలు వసూలు జరిగింది. ప్రభుత్వం నుంచి పరిహారం కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే వ్యాఖ్యలు కూడా వుుఖ్యవుంత్రి హోదాలోనే చంద్రబాబు చేశారు. వైఎస్ పాలనలో రెండు లక్షలకుపైగా కార్మికులకు ఉపయోగపడేలా పావలా వడ్డీకే చేనేత రుణాలు ఇచ్చేలా చేశారు. దేశంలోనే తొలిసారిగా పోచంపల్లిలో హ్యాండ్‌లూం పార్కును ప్రారంభించారు. హ్యాండ్ లూం పార్కుల కోసం భూవుుల్ని కూడా కేటారుుంచారు. చిలప నూలుపై 9.5 శాతవుున్న ఎక్సైజ్ డ్యూటీ తగ్గించేలా చేశారు. చేనేతకు అధిక ప్రాధాన్యతను ఆచరణలో చూపించారు. చేనేత కార్మికుల సంక్షేవుం కోసం త్రిఫ్ట్ ఫండ్ స్కీంను అవులు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చేనేతపై చంద్రబాబు హామీల జల్లు కురిపిస్తుంటే నేత కార్మికులు గతంలో వైఎస్ పథకాల వల్ల జరిగిన ‘మేళ్ల’ను నెవురవేసుకుంటూ.. వైఎస్ జగన్‌మోహనరెడ్డి హామీల వల్ల లాభాలపై చర్చించుకుంటున్నారు.
 
 నేడంతా అచేతనం...
 బతుకంతా దుర్భరం. రాత్రీపగలు తేడా లేకుండా కష్టపడ్డా పట్టెడన్నం దొరకని దైన్యం. రెక్కలు ముక్కలు చేసుకున్నా కూలి రేటు గిట్టని విషాదం. అప్పులతో నూలు పోగులు చిక్కుముళ్లుపడుతున్నాయి. సాంచాల సప్పుడు వినిపించే చోట చావుడప్పు మోగుతోంది. ఆత్మహత్యలు, ఆకలి చావులతో తెల్లారుతోంది. చంద్రబాబు విస్మరించిన చేనేతల కన్నీళ్లను తుడిచేందుకు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఓ యజ్ఞమే చేశారు. బడ్జెట్‌ను పెంచారు..రుణమాఫీ చేశారు. స్పెషల్ ప్యాకేజీలతో వస్త్ర పరిశ్రమకు పునర్జన్మనిచ్చారు. ఉత్పత్తులకు గిరాకీ పెంచేలా చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలకు అండగా నిలిచారు. పింఛన్ పెంచి ఆపద్భాంధవుడయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మూడున్నర లక్షలకుపైగా ఉన్న  చేనేతన్నలు ఓటెత్తి తమ జీవితాలను బాగుచేసే నేతలను ఎన్నుకోవాల్సిన సమయమిది.
 
 ‘‘చేనేతల కోసం ఆలోచించిన వ్యక్తులు  వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీరామారావు మాత్రమే.  ఎన్టీఆర్ జనతాస్కీం ద్వారా చేనేతలను ఆదుకునే ప్రయత్నం చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ స్కీమ్‌ను ఎత్తివేశారు. వైఎస్సార్ సీఎం అయిన తరువాత చేనేతల సంక్షేమం కోసం ఆర్టిజన్ క్రెడిట్ కార్డులు కలిగిన ప్రతి  కార్మికునికి బ్యాంకుల్లో పావలావడ్డీకే రుణాలు ఇప్పించారు.  ఆయన మరణం తరువాత ఈ పథకాన్ని ప్రభుత్వం గాలికొదిలేసింది. ’’
 -2012 ఫిబ్రవరి 12న ధర్మవరం ‘చేనేత దీక్ష’లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 
 సాయం కోసం చేతులు ‘సాంచాల’
 ఎన్నికలచ్చినప్పుడల్లా నాయుకులు ఏదేదో చేస్తవుని చెబుతుంటరు. కానీ ప్రభుత్వమిచ్చే రాయితీలు.. రుణాలు, కరెంట్ సబ్సిడీలతో ఆసావుులు లాభపడ్తరు. అందుకే వూ బతుకులిట్లే ఉంటున్నయి. నాలాంటోళ్లు ఇక్కడ 30 వేల మందున్నరు. మా తాతలు, బాపులు నేసె మగ్గాల మీద పని చేసిండ్రు.. ఇప్పుడు మేం సాంచాలు (పవర్‌లూం) నడుపుతూ బట్టనేస్తున్నం..  బట్టకు పొట్టకు సరిపోయేంత కూలీ మాత్రం అచ్చుడ్లేదు. నా భార్య బీడీలు చేస్తది. వూకు ఇద్దరు బిడ్డలు.
 
 ధరలన్నీ ఫిరమాయే. కరెంటు పోరుునా... ఒక్క రోజు పని సాత కాకపోయినా కూలీల కోత పడుడే.   ప్రభుత్వం నేరుగా కార్మికులకే ప్రయోజనం కలిగేలా పథకాలు రూపొందించాలె. కూలీ పెరగాలె. ఆరోగ్య బీవూ ఉండాలె. కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలె. సబ్సిడీపై రెండు జతల సాంచాలు, షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటారుుంచాలి.  మార్కెటింగ్ సంస్థ  ఏర్పాటు చేయాలె. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు చేనేత రుణాలు వూఫీ చేసిండు. వురవుగ్గాల కార్మికులకు సొసైటీల్లేవు. అందుకే మా అప్పులు మాత్రం తీరలే.          
 - వేముల సంపత్ (సాంచాల కార్మికుడు)
 న్యూస్‌లైన్, సిరిసిల్ల

 
 ‘నేత’ంటే ఇలా..
 సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్థికసాయం అందించారు. మొత్తం 125కుటుంబాలకు రూ.లక్షన్నర చొప్పున సాయం చేశారు. 1997 నుంచి ఆత్మహత్యలకు పాల్పడ్డ నేతన్నలకు ఈ ప్యాకేజీ వర్తింపజేశారు. ఇందులో కార్మికుడి అప్పుల సర్దుబాటుకు రూ.యాభైవేలు, కుటుంబ జీవనోపాధికి మరో రూ.లక్ష అందించారు. మరో 120 కుటుంబాలకు రూ.25వేల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చారు.
*    12వేల మంది నేత కార్మికులకు అంత్యోదయ అన్న యోజన పథకం(ఏఏవై) కార్డులు అందించారు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి నెలనెలా 35కిలోల బియ్యం అందుతున్నాయి.
*     చేనేత కార్మికుల ఆర్యోగ సమస్యల దృష్ట్యా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన వైఎస్ 50వేల మందికి ప్రతినెలా రూ.200 పింఛన్ ఇచ్చారు.
 *    2004లో రూ.32కోట్లు ఉన్న ఆప్కో టర్నోవర్‌ను రూ.250కోట్లుగా మార్చి ఆదుకున్నది వైఎస్సే.
*     పెరిగిన చిలపనూలు ధరల వల్ల కార్మికులు ఇబ్బంది పడుతుంటే వైఎస్ పదిశాతం సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారు.
*     వైఎస్ హయాంలో 2008 నాటికి వలసలు తగ్గాయి. ఆదాయం లేకపోవడంతో మహారాష్ట్రకు వెళ్లే బస్సులు రద్దయ్యాయి.
*     సిరిసిల్ల మహిళలను చైతన్యవంతులను చేసి 1,480 సంఘాలు ఏర్పాటు చేసి ప్రతి మహిళకు రూ.50వేల రుణం అందించారు. ఒక్క సిరిసిల్లలోనే రూ.74కోట్ల పావలావడ్డీ రుణం అందించడంతో మైక్రోఫైనాన్స్ వేధింపులు తగ్గాయి.
*     చేనేత కార్మికుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ శిబిరం ఏర్పాటు చేసి 84మంది వైద్యులతో వైద్య సేవలు అందించారు.
*     ఇళ్లు లేని పేద చేనేత కార్మికులకు సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి, మండెపల్లి, సారంపల్లి గ్రామాల్లో 4,800 కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.
*    సిరిసిల్ల పట్టణ తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కరీంనగర్ ఎల్‌ఎండీ నుంచి నీరందించేందుకు రూ.36.50కోట్ల పథకాన్ని గ్రాంటు రూపంలో మంజూరు చేశారు.
*     నేతన్నల సంక్షేమం కోసం రూ.రెండు కోట్ల కార్పస్‌ఫండ్‌ను మంజూరు చేశారు.
*     జనశ్రీ బీమాలో కార్మికుల ప్రీమియంను రూ.80నుంచి రూ.40కి తగ్గించి మిగతా రూ.40 ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేసి లక్షన్నరమంది కార్మికులకు ఆరోగ్య ధీమా కల్పించారు.
*     నేత కార్మికులు ప్రైవేటు రుణాల బారిన పడకుండా ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టి పావలావడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేశారు.
*    రాష్ట్ర వ్యాప్తంగా 77వేలకు పైగా ఉన్న పవర్‌లూంలకు 2004-05 నుంచి 2008-09 నాటికే రూ.29.55 కోట్ల విద్యుత్ సబ్సిడీ నిధులు విడుదల చేశారు.     
 - మారడి మల్లికార్జున్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement