బీజేపీ, టీడీపీలకు ముస్లింలు ఓట్లేయొద్దు | However, the Muslims, who otleyoddu | Sakshi
Sakshi News home page

బీజేపీ, టీడీపీలకు ముస్లింలు ఓట్లేయొద్దు

Published Mon, Mar 24 2014 5:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

బీజేపీ, టీడీపీలకు ముస్లింలు ఓట్లేయొద్దు - Sakshi

బీజేపీ, టీడీపీలకు ముస్లింలు ఓట్లేయొద్దు

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ
 

 నల్లగొండ , బీజేపీకి జెండా.. ఎజెండా లేదని కేవలం ముస్లింలను అణచివేయడం లక్ష్యంగా పెట్టుకుని హిందుత్వ రాజ్యం కోసం ప్రయత్నిస్తున్నదని, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ఆదివారం రాత్రి నల్లగొండలో జరిగిన ఎంఐఎం కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.


మహాత్మాగాంధీ పేరు చెప్పలేని బీజేపీ నాయకులు మన దేశానికి ఎలా ప్రధానమంత్రి అవుతారని ప్రశ్నించారు. దేశాభివృద్ధి గురించి పట్టించుకోకుండా ప్రధాని పదవి కోసం వేలాడడం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు  సెక్యులరిజం పేరుతో బీజేపీకి ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తాడు. బీజేపీ, టీడీపీలకు ముస్లింలు ఓట్లు వేయవద్దని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రపంచంలోనే ఒక పెద్ద చీటర్ అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఏపార్టీ కూడా ముస్లిం అభ్యర్థిని గెలిపించలేదని విమర్శించారు.  
 
దళిత, ముస్లింలు ఏకం కావాలి: అసదుద్దీన్
 
జహీరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ దొరల పాలనను అడ్డుకునేందుకు దళిత, ముస్లింలు ఏకం కావాల్సిన అవసరం ఉందని మజ్లిస్‌పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవెసీ పిలుపునిచ్చారు. ఆదివా రం రాత్రి జహీరాబాద్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ సెక్యులరిజం పేరుతో కాంగ్రెస్ మైనార్టీలను మోసం చేస్తోందన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు తమ సత్తాను చాటాలన్నారు.  ఉత్తరప్రదేశ్‌లో మాయవతి చేసిన ప్రయోగం మూలంగానే మనం అంతా ఏకమై విజయకేతనం ఎగరేయాలన్నారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను నిలువరించాలని, నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని కాకుండా చూడాలన్నారు.  అన్నదమ్ములైన తమపై అప్పటి సీఎం కిరణ్ కేసులు పెట్టించి వేధించాడని, ఇప్పుడు అతడి పరిస్థితి ఏమైంది.. చివరకు చెప్పుల గుర్తు వచ్చిందని ఎద్దేవా చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement