జగ్గారెడ్డి ఎన్నికల ప్రచార సీడీలో పవన్ | jaggareddy campaign banner for pavan kalyan | Sakshi
Sakshi News home page

జగ్గారెడ్డి ఎన్నికల ప్రచార సీడీలో పవన్

Published Sat, Apr 19 2014 2:44 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

జగ్గారెడ్డి ఎన్నికల ప్రచార సీడీలో పవన్ - Sakshi

జగ్గారెడ్డి ఎన్నికల ప్రచార సీడీలో పవన్

30సెకన్లు కనిపించడంతో కంగుతిన్న వీక్షకులు

 సంగారెడ్డి,   ‘కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో’ నినాదంతో జనసేన పార్టీని స్థాపించిన నటుడు పవన్ కల్యాణ్ చిత్రాన్ని సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి టి.జగ్గారెడ్డి తన ప్రచారంలో వాడుకుంటున్నారు. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్న పవన్ చిత్రాలను జగ్గారెడ్డి తన ఎన్నికల ప్రచారం కోసం రూపొందించిన వీడియోలో క్లిప్పింగ్‌లో చోటు కల్పిం చడం చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ స్థాపించే దృశ్యాలను అందులో పొందుపరిచారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డిలో ప్రదర్శించిన వీడియో సీడీలో సుమారు 30 సెకన్ల నిడివిలో పవన్ దృశ్యాలు కన్పించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement