t.jaggareddy
-
జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో ఉండొద్దా?
సాక్షి, హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్టు ఏ డాదిన్నరగా కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి మండిపడ్డారు. తాను బీఆర్ఎస్లోకి వెళ్తున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్ధమన్నారు. తనకు రాజకీయ శీల పరీక్షలు అవసరం లేదని.. తన రాజకీయ ప్రయాణం రాహుల్గాందీతోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్లో జగ్గారెడ్డి మీడి యాతో మాట్లాడారు. ‘నేను పార్టీ మారుతున్నానని ప్రచారం చేయడం కొందరికి ఆనందం కలిగిస్తోంది. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దా? నా వ్యక్తిత్వంపై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు? సోషల్ మీడియాలో ప్రచారానికి ఎవరు, ఎన్ని డబ్బులు ఇస్తున్నారు? నేను కన్నెర్ర చేస్తే ఈ దుష్ప్రచారం చేస్తున్న వారు ఉంటారా?’అని పేర్కొన్నారు. దుష్ప్రచారం టీడీపీ కల్చర్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే నడిరోడ్డుపై బట్టలు విప్పి నిలబెడతానని జగ్గారెడ్డి హె చ్చరించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచా రం చేయడం తెలుగుదే శం పార్టీ సంస్కృతి అ ని, అక్కడి నుంచే ఇది కాంగ్రెస్‌లోకి వచ్చిదని వ్యాఖ్యానించారు. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమం, సమావేశంలో పాల్గొంటున్నానని.. అయినా అబద్ధపు ప్రచారం చేస్తుండటం బాధ కలిగిస్తుందన్నారు. ఇప్పటికైనా ఆ మూర్ఖులు, దద్దమ్మలు తప్పుడు ప్రచారం మానేయాలన్నారు. రాహుల్‌ను సంగారెడ్డికి రమ్మంటా.. సంగారెడ్డి మీదుగా రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర వెళితే సంతోషపడ్డానని, ఆర్థిక ఇబ్బందులు న్నా యాత్రను విజయవంతం చేశానని జగ్గారెడ్డి చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌పై తిరగబడిన మొదటి నాయకుడిని తానేనని.. 2018 ఎన్నికల సమయంలో తనపై కేసులు పెట్టి, జైలుకు పంపారని, అయినా కొట్లాడి గెలిచానని వివరించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు తనకు రాహుల్‌గాంధీ 20నిమిషాల పాటు ప్రత్యేకంగా సమయం ఇచ్చారని, పార్టీ విషయాలన్నింటినీ ఆయనకు వివరించానని, దీనికి త్వరలో ఫలితం ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు. రాహుల్‌తో సంగారెడ్డిలో త్వరలోనే ఓ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. -
రబ్బరు బుల్లెట్లకు కూడా ఒప్పుకోలేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంపై సోనియా గాంధీ చాలా సానుకూలంగా ఉండేవారని, ఉద్యమం ఎంతటి తీవ్ర రూపం దాల్చినా బలప్రయోగం చేయవద్దని, కనీసం రబ్బరు బుల్లెట్లు కూడా ఉద్యమకారులపై ప్రయోగించకూడదని ఆమె కచ్చితమైన ఆదేశాలిచ్చారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి చెప్పారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డికి సోనియా గాంధీ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. సమైక్య రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలే తప్ప అణచివేతలు వద్దని ఆదేశించారన్నారు. వైఎస్ దిగ్రేట్.. కాగా, తనకు విమానం ఎక్కడం ఇష్టం ఉండదని, అయినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆదేశాలతో ఒకసారి ఎక్కానని జగ్గారెడ్డి చెప్పారు. ఏ విషయాన్నయినా ఫాలోఅప్ చేయడంలో వైఎస్ దిగ్రేట్ అని, ఆయన సీఎం అవడానికి ఎంత కష్టపడ్డారో, అయ్యాక కూడా అంతే కష్టపడ్డారని చెప్పారు. వైఎస్ తనకు అప్పగించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేయడం చాలా సంతోషానిచ్చేదని అన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో అలాంటి నాయకులు ఇప్పుడు లేకపోవడం దురదృష్టకరమని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని, ఉమ్మడి రాష్ట్రంలోనే తనకు మంత్రిపదవి ఆఫర్ చేసినా వద్దన్నానని చెప్పారు. కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి వస్తుందని, అందరూ కలసి పనిచేయాలని ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ తమకు దిశానిర్దేశం చేశారన్నారు. సీఎల్పీ కార్యాలయానికి మంత్రి వేముల ఆదివారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ సభ్యులు సభలోకి వెళ్లకపోవడంతో శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. లాబీల్లో నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని తీసుకుని ఆయన సీఎల్పీకి వచ్చారు. ఆ సమయంలో సీఎల్పీ నేత భట్టి, శ్రీధర్, వీరయ్యలు అక్కడే ఉన్నారు. దీంతో సభకు వచ్చి అసెంబ్లీ సమావేశాలు సజావుగా నడిచేందుకు సహకరించాలని ప్రశాంత్‌రెడ్డి వారిని కోరారు. శనివారం కేటీఆర్ మాట్లాడిన సందర్భంగా తమను జంతువులతో పోల్చడం బాధ కలిగించిందని, ఈ విషయంలో స్పీకర్‌ను కలుస్తామని చెప్పారు. కానీ, ప్రశాంత్‌రెడ్డి సర్దిచెప్పి వారిని సభలోపలికి తీసుకెళ్లడం గమనార్హం. -
జగ్గారెడ్డి ఎన్నికల ప్రచార సీడీలో పవన్
30సెకన్లు కనిపించడంతో కంగుతిన్న వీక్షకులు సంగారెడ్డి, ‘కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో’ నినాదంతో జనసేన పార్టీని స్థాపించిన నటుడు పవన్ కల్యాణ్ చిత్రాన్ని సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి టి.జగ్గారెడ్డి తన ప్రచారంలో వాడుకుంటున్నారు. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్న పవన్ చిత్రాలను జగ్గారెడ్డి తన ఎన్నికల ప్రచారం కోసం రూపొందించిన వీడియోలో క్లిప్పింగ్‌లో చోటు కల్పిం చడం చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ స్థాపించే దృశ్యాలను అందులో పొందుపరిచారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డిలో ప్రదర్శించిన వీడియో సీడీలో సుమారు 30 సెకన్ల నిడివిలో పవన్ దృశ్యాలు కన్పించాయి.