జూనియర్ ఎన్టీఆర్ ఏం చెబుతారు? | Junior NTR will address a press conference tomorrow | Sakshi
Sakshi News home page

జూనియర్ ఎన్టీఆర్ ఏం చెబుతారు?

Published Wed, Apr 23 2014 6:57 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

జూనియర్ ఎన్టీఆర్ ఏం చెబుతారు? - Sakshi

జూనియర్ ఎన్టీఆర్ ఏం చెబుతారు?

హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో తనపై వస్తున్న ఊహాగానాలపై తెరదించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సన్నద్దమవుతున్నారు. తనపై మీడియాలో వస్తున్న కథనాలపై వివరణ ఇవ్వాలని చిన్న ఎన్టీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయన గురువారం మీడియా ముందుకు రానున్నారు. ఈమేరకు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. రేపు స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఆయన వివరణ ఇస్తారని వెల్లడించింది.

టీడీపీ ఎన్నికల ప్రచారానికి ఎందువల్ల దూరంగా ఉండవలసి వచ్చిందో ఆయన వివరించే అవకాశముందని భావిస్తున్నారు. తన తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీకి దూరవడానికి దారి తీసిన పరిస్థితుల గురించి జూనియర్ వెల్లడించనున్నారని అంటున్నారు. అయితే ఎవరికి వారు పార్టీ తరపున ప్రచారం చేయాలని, బొట్టు పెట్టి పిలవబోమంటూ జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై నందమూరి బాలకృష్ణ పరోక్షంగా విసుర్లు విసిరారు.

ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రచారానికి ఆహ్వానించడం విశేషం. ఈ పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement