'బిజెపి-టీడీపీ పొత్తు అనైతికం'
చంద్రబాబు బిజెపి పొత్తుపై వామపక్షాలు భగ్గుమంటున్నాయి. శుక్రవారం సీపీఎం రాష్ట్ర నేత రాఘవులు పొత్తును తీవ్రంగా విమర్శించారు. శనివారం సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుదాకర్ రెడ్డి కూడా ఈ పొత్తు అనైతికం అన్నారు.
ఈ పొత్తు చారిత్రిక తప్పిదం అని రాఘువులు విమర్శిస్తే, టీడీపీ, బీజేపీల పొత్తు అనైతికమే కాదు, అత్యంత ప్రమాదకరమైనది కూడా అని సురవరం సుధాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వీరితో సినీనటుడు పవన్ కల్యాణ్ చేతులు కలపడం అనైతికమని ఆయన మండిపడ్డారు. పాలెం ఘటనపై మండిపడ్డ చంద్రబాబు జేసీ సోదరులకు టిక్కెట్లు ఎలా ఇచ్చారని విమర్శించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చిన పవన్‌కు దేశవ్యాప్తంగా బీజేపీ-టీడీపీ నేతల అవినీతి కనిపించలేదా అని సురవరం ప్రశ్నించారు.