మెజారిటీ దిశగా ఎన్డీయే కూటమి? | nda alliance to get clear majority, say national channels | Sakshi
Sakshi News home page

మెజారిటీ దిశగా ఎన్డీయే కూటమి?

Published Mon, May 12 2014 7:24 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

nda alliance to get clear majority, say national channels

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. తొమ్మిది విడతలుగా సుదీర్ఘంగా జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈనెల 16వ తేదీ శుక్రవారం నాడు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సుమారు 289 స్థానాలు గెలుచుకోవచ్చని న్యూస్ ఎక్స్ ఛానల్ తన ఎగ్జిట్ పోల్స్లో వెల్లడించింది. యూపీఏ కూటమి అత్యంత కష్టమ్మీద 101 స్థానాలు గెలుచుకోవచ్చని, అయితే ఇతరులు మాత్రం 153 స్థానాల్లో గెలుస్తారని తెలిపింది. అంటే, ప్రాంతీయ పార్టీలు ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో తగినన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

సీఎన్ఎన్ ఐబీఎన్, ఇండియా టీవీ, టైమ్స్ నౌ లాంటి ఛానళ్లు కూడా ఎన్డీయే కూటమికి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన మెజారిటీ లభిస్తుందనే చెబుతున్నాయి. లోక్సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే కనీసం 272 స్థానాలు అవసరం అవుతాయి. ఆ సంఖ్యను బీజేపీ కూటమి సులభంగా సాధించగలదని సర్వేలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల మీద ఎన్నికల కమిషన్ విధించిన సమయం కూడా అయిపోయింది. దాంతో ప్రతి ఛానల్.. తన సర్వే ఫలితాలను వెల్లడించడం మొదలుపెట్టింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ ఇప్పటికీ తన హవా నిలబెట్టుకుంటుందనే జాతీయ వార్తా ఛానళ్లు అంటున్నాయి.

కూటమి న్యూస్ ఎక్స్ ఎన్డీటీవీ జీ న్యూస్ ఆజ్ తక్ ఇండియా టీవీ ఏబీపీ ఛానల్
ఎన్డీయే 289 283 299 298 315 278
యూపీఏ 101 99 112 93 80 93
ఇతరులు 153 169 132 152 148 172

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement