clear majority
-
Madhya Pradesh: ‘పాంచ్’ పంచ్.. ఐదోసారి అధికారం దిశగా బీజేపీ
భోపాల్: మధ్యప్రదేశ్‌లో స్పష్టమైన మెజార్టీతో అధికారం దిశగా బీజేపీ పయనిస్తోంది. 230 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో కాషాయ పార్టీ 160పైగా నియోజకవర్గాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు పర్యాయాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేక మరో వ్యక్తిని పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని చేస్తుందా అన్నది చూడాలి. నాలుగుసార్లు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌కి ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొదటిసారిగా 2005లో మొదటి సారిగా సీఎం అయ్యారు. ఆ తర్వాత 2008లో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో మరోసారి గెలిచి బీజేపీ శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మూడోసారి సీఎంగా చేసింది. 2018 ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 109 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినప్పటికీ 114 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2020లో ఆ పార్టీ సీనియర్ జ్యోతిరాదిత్య సింధియా సహా 22 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం పడిపోయింది. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం చౌహాన్ బంపర్ మెజార్టీ మధ్యప్రదేశ్ 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకెళ్తున్నారు. తన నియోజకవర్గం బుధ్నిలో 1,04,974 భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మొత్తం 1,64,951 ఓట్లు వచ్చాయి. -
వారిని ప్రజలు పట్టించుకోలేదు.. సీఎం గెహ్లాట్ ధీమా!
జైపూర్: రాజస్థాన్‌లో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు తమ ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, మతం కార్డు వాడేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అయితే రాష్ట్ర ప్రజలు వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. ‘ప్రచారంలో వారు ఎలాంటి రెచ్చగొట్టే భాష ఉపయోగించారో అందరూ చూశారు. మతం కార్డు వాడేందుకు ప్రయత్నించారు. కానీ ప్రజలు వారిని తిరస్కరించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని పొందబోతోంది’ అని గెహ్లాట్ అన్నారు. ‘ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కానీ రాజస్థాన్ ప్రజలు వాటిని పట్టించుకోలేదు’ అన్నారాయన. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని, తమపై ఎటువంటి వ్యతిరేకత లేదని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 199 స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. ప్రజలు తమ తీర్పును ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు అనంతరం పార్టీ భవితవ్యం తేలనుంది. -
మెజారిటీ దిశగా ఎన్డీయే కూటమి?
కూటమి న్యూస్ ఎక్స్ ఎన్డీటీవీ జీ న్యూస్ ఆజ్ తక్ ఇండియా టీవీ ఏబీపీ ఛానల్ ఎన్డీయే 289 283 299 298 315 278 యూపీఏ 101 99 112 93 80 93 ఇతరులు 153 169 132 152 148 172 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. తొమ్మిది విడతలుగా సుదీర్ఘంగా జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈనెల 16వ తేదీ శుక్రవారం నాడు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సుమారు 289 స్థానాలు గెలుచుకోవచ్చని న్యూస్ ఎక్స్ ఛానల్ తన ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. యూపీఏ కూటమి అత్యంత కష్టమ్మీద 101 స్థానాలు గెలుచుకోవచ్చని, అయితే ఇతరులు మాత్రం 153 స్థానాల్లో గెలుస్తారని తెలిపింది. అంటే, ప్రాంతీయ పార్టీలు ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో తగినన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సీఎన్ఎన్ ఐబీఎన్, ఇండియా టీవీ, టైమ్స్ నౌ లాంటి ఛానళ్లు కూడా ఎన్డీయే కూటమికి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన మెజారిటీ లభిస్తుందనే చెబుతున్నాయి. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే కనీసం 272 స్థానాలు అవసరం అవుతాయి. ఆ సంఖ్యను బీజేపీ కూటమి సులభంగా సాధించగలదని సర్వేలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల మీద ఎన్నికల కమిషన్ విధించిన సమయం కూడా అయిపోయింది. దాంతో ప్రతి ఛానల్.. తన సర్వే ఫలితాలను వెల్లడించడం మొదలుపెట్టింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ ఇప్పటికీ తన హవా నిలబెట్టుకుంటుందనే జాతీయ వార్తా ఛానళ్లు అంటున్నాయి.