ఇందూరు, న్యూస్‌లైన్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది. జాబితాపై సోమవారం అర్ధరాత్రి వరకు అధికారులు కసరత్తు చేశారు. పరిషత్ స్థానాలకు ఎంతమంది బరిలో ఉన్నారు. పార్టీల వారీగా మంగళవారం అధికారులు అధికారికంగా జాబితా వెళ్లడించనున్నారు. జిల్లాలోని 36 జెడ్పీటీసీ స్థానాలకు 497 నామినేషన్‌లు వచ్చాయి. వీటిలో పరిశీలనలో 10 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో ముగ్గురు కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోగా, ఇద్దరికి అవకాశం కల్పించారు. మిగతా ఎనిమిది మంది నామినేషన్‌లను పరిగణలోకి తీ సుకోలేదు.
మూడు, నాలు గు రోజుల వ్యవధిలో 150 మంది అభ్యర్థులు వేసిన నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. మొత్తం 36 జెడ్పీటీసీ స్థానాలకు 195 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మిగిలిన 142 నామినేషన్‌లు ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థులు రెండు నుంచి మూడు సెట్ల నామినేషన్‌లను వేసినవేనని, వాటిని లెక్కలోకి తీసుకోలేదని అధికారులు చెప్పారు. సోమవారం సాయంత్రానికల్లా పోటీలోని అభ్యర్థుల తుది జాబితాను తయారు చేయాల్సిన అధికారులు పనిభారంతో వెల్లడించలేక పోయారు. ఎంపీటీసీలకు సంబంధించి 583 స్థానాలకు 4,752 నామినేషన్‌లు రాగా, ఇందులో దాదాపు 2,316 మంది బరిలో ఉన్నట్లు తెలిసింది.
మంగళవారం మధ్యాహ్నంకల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోటీ అభ్యర్థుల తుది జాబితాతో పాటు వారికి కేటాయించిన గుర్తుల వివరాలను గ్రామ, మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు.
జెడ్పీటీసీ బరిలోఅభ్యర్థులు 195
Published Tue, Mar 25 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM
Advertisement
Advertisement