నామినేషన్ల జోరు | Nominations files heavly | Sakshi
Sakshi News home page

నామినేషన్ల జోరు

Published Fri, Apr 18 2014 3:28 AM | Last Updated on Sat, Oct 20 2018 6:07 PM

Nominations files heavly

 సాక్షి, నెల్లూరు : వచ్చే నెల 7న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గురువారం ఒక్కరోజే 10 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే నెల్లూరు పార్లమెంట్‌కు 4, తిరుపతి పార్లమెంట్‌కు 3 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపుగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు చివరి గడువు ఒక్కరోజు అదీ 19వ తేదీ మాత్రమే.
 
 నెల్లూరు పార్లమెంట్‌కు..
 నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున కె.గోపినాథ్, బహుజన సమాజ్‌పార్టీ నుంచి పి.రవి, స్వతంత్ర అభ్యర్థిగా మేడా మల్లారెడ్డి తమ నామినేషన్ల పత్రాలను కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌కు గురువారం అందజేశారు.
 
 తిరుపతి పార్లమెంట్‌కు...
 కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ చింతా మోహన్, సీపీఎం తరపున కె.సుబ్రమణ్యం, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా సూర్యనారాయణ నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ రేఖారాణికి నామినేషన్ల పత్రాలు అందజేశారు.
 
 నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి...
 వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ గురువారం రెండోసారి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కాం గ్రెస్ నుంచి ఆనం చెంచుసుబ్బారెడ్డి, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ముక్తి అబ్దుల్ రెహమాన్, స్వతం త్ర అభ్యర్థులుగా అరవ కిరణ్‌కుమార్, మహ్మద్ జియాఉల్‌హక్, కల్లూరు రాజశేఖర్‌రెడ్డి నగర పాలకసంస్థ కార్యాలయం లో ఎన్నికల అధికారి, తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ విజయచందర్‌కు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు.
 
 నెల్లూరురూరల్ అసెంబ్లీ స్థానానికి...
 సీపీఎం అభ్యర్థిగా మాదాల వెంకటేశ్వర్లు, స్వతంత్ర అభ్యర్థిగా ఎం.నరేంద్రరెడ్డి, వైఎస్సార్‌సీపీ డమ్మీ అభ్యర్థిగా బి.పురుషోత్తం, ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి పార్టీ నుంచి బక్కా ఉదయ్‌కుమార్, బహుజన సమాజ్‌పార్టీ నుంచి వాకాటి శ్రీనివాసులు, స్వతంత్ర అభ్యర్థిగా తిరుపతి విజయ్‌కుమార్ తమ నామినేషన్లను ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారి, నెల్లూరు ఆర్డీఓ సుబ్రమణ్యేశ్వరరెడ్డికి అందజేశారు.
 
 గూడూరు అసెంబ్లీ స్థానానికి...
 వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పాశం సునీల్‌కుమార్, డమ్మీ అభ్యర్థులుగా ఆయన సతీమణి సంధ్యారాణి, కుమారుడు సురేష్‌కుమార్, జై సమైక్యాంధ్రపార్టీ నుంచి దందోలు చక్రధర్, సీపీఎం తరపున నెల్లూరు యాదగిరి, బహుజన సమాజ్‌పార్టీ నుంచి బందిలి చినవెంకయ్య, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మిందా బాలకోటయ్య తమ నామినేషన్లను గూడూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసరావుకు అందజేశారు.
 
 సూళ్లూరుపేట అసెంబ్లీకి...
 వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కిలివేటి సం జీవయ్య, సీపీఎం నుంచి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ, స్వతంత్ర అభ్యర్థిగా పాకం వెంకటస్వామి తమ నామినేషన్లను నాయుడుపేట ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారి, నాయుడుపేట ఆర్డీఓ ఎంవీ రమణకు అందజేశారు.
 
 కావలి అసెంబ్లీ స్థానానికి...
 కాంగ్రెస్ పార్టీ నుంచి చింతాల వెంకట్రావ్ రెండోసారి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా పగడాల నిరంజన్, బొడ్డు దుర్గాప్రసాద్(మాల మహానాడు), పరుసు మదన్, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి చిన్ని రాజగోపాల్ తమ నామినేషన్లను కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారి, కావలి ఆర్డీఓ వెంకటరమణారెడ్డికి అందజేశారు.
 
 సర్వేపల్లి అసెంబ్లీ స్థానానికి...
 కాంగ్రెస్ తరపున కనిమెల పట్టాభిరామయ్య, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి కాకుమాని ప్రమీల, స్వతంత్ర అభ్యర్థిగా ఈపూరు ఆదిశేషయ్య తమ నామినేషన్లను వెంకటాచలం తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, తెలుగుగంగ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున్‌కు అందజేశారు.
 
 వెంకటగిరి అసెంబ్లీ స్థానానికి...
 కాంగ్రెస్ తరపున నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వి.ఆర్ముగం, రాజ్యాధికారపార్టీ నుంచి ఎం.నరసింహులయాదవ్, స్వతంత్ర అభ్యర్థిగా చీకవోలు ప్రకాశరావు తమ నామినేషన్లను వెంకటగిరి తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ చంద్రమౌళికి అందజేశారు.
 
 ఉదయగిరి అసెంబ్లీ స్థానానికి...
 వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, బహుజన సమాజ్‌పార్టీ నుంచి కె.సుధాకర్ ఉదయగిరి తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, డ్వామా పీడీ గౌతమికి తమ నామినేషన్లు అందజేశారు.
 
 కోవూరు అసెంబ్లీ స్థానానికి...
 సీపీఎం అభ్యర్థిగా వెంకమరాజు, బహుజన సమాజ్‌పార్టీ నుంచి చాట్ల శ్రీనివాసులు తమ నామినేషన్లను కోవూరు తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ జితేంద్రకు అందజేశారు.
 
 ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి...
 జై సమైక్యాంధ్ర పార్టీ తరపున వల్లూరు విజయభాస్కర్‌రెడ్డి, తెలుగుదేశం తరపున గూటూరు మురళీకన్నబాబు రెండోసారి తమ నామినేషన్‌ను దాఖలు చేశారు. వీరు ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారి, ఆత్మకూరు ఆర్డీఓ కోదండరామిరెడ్డికి  నామినేషన్ పత్రాలు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement