నామినేషన్ల జోరు | nominations increased for Lok sabha elections | Sakshi
Sakshi News home page

నామినేషన్ల జోరు

Published Tue, Apr 8 2014 3:26 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

nominations increased for   Lok sabha elections

 ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం 26 నామినేషన్లు దాఖల య్యాయి. ఖమ్మం పార్లమెంట్‌కు నాలుగు, అసెంబ్లీ స్థానాలకు 22 నామినేషన్లు వేశారు. మధిర రెండు, పినపాక మూడు, ఇల్లెందు రెండు, పాలేరు నాలుగు,  కొత్తగూడెం నాలు గు,  వైరా, భద్రాచలం, సత్తుపల్లిలో ఒక్కొక్క టి చొప్పున దాఖలయ్యాయి. అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

 పార్లమెంట్ అభ్యర్థులు..
 ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అభ్యర్థిగా గోకినపల్లి వెంకటేశ్వరరావు, బీఎస్పీ అభ్యర్థిగా దొడ్డా రాంబాబుయాదవ్, పోలవరం వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర అభ్యర్థులుగా కనకం తిరుమలరావు, కందుల రాములు నామినేషన్‌లు వేశారు.

 అసెంబ్లీ అభ్యర్థులు వీరే....
 జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు తొమ్మిదింటిలో నామినేషన్లు వేశారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థి గుగులోత్ చంద్ర, వైరాస్థానానికి లోక్‌సత్తా అభ్యర్థిగా తేజావత్ నర్సింహారావు, సత్లుపల్లికి స్వతంత్ర అభ్యర్థిగా లింగాల రవికుమార్, కొత్తగూడెం సెగ్మెంట్‌కు పిరమిడ్‌పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గునిపాటి సుధాకర్, బీజేపీ అభ్యర్థిగా మహ్మద్ అబ్దుల్‌మజిద్, స్వతంత్ర అభ్యర్థులుగా అరుద్ర సత్యనారాయణ, నమోజు గోవిందాచారి, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థిగా పోతినేని సుదర్శన్ (రెండోసారి), స్వతంత్ర అభ్యర్థిగా మోతే మల్లయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అభ్యర్థిగా మలీదు నాగేశ్వరరావు, బీఎస్పీ నుంచి చైతన్య చేకూరి, ఇల్లెందు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బోగ నందకిశోర్, బాణోత్ రవీంద్రనాయక్, పినపాక పిరమిడ్ పార్టీఆఫ్ ఇండియా అభ్యర్థిగా భూక్యా చిట్టిబాబు, స్వతంత్ర అభ్యర్థిగా ముక్తి సత్యం, బీఎస్పీ అభ్యర్థిగా చిన్న భద్రయ్య, మధిర నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా దారేల్లి అశోక్, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బొమ్మెర రామ్మూర్తి, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి లోక్‌సత్తా అభ్యర్థిగా రవిమారుత్, స్వతంత్ర అభ్యర్థులుగా ఎస్‌కే బడేసాహేబ్, అక్కిరాల వెంకటేశ్వర్లు, బీఎస్పీ అభ్యర్థిగా అబ్దుల్‌కరీం షేక్‌లు నామినేషన్‌లు దాఖలు చేశారు.

 రేపు చివరి తేదీ...
 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు బుధవారం నాటికి ముగుస్తుంది. ఆరోజు సాయంత్రం 3 గంటల వరకే ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. 10న నామినేషన్ల స్క్రూటినీ, 12వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. కానీ కొన్ని పార్టీలు ఇంకా అభ్యర్థుల జాబితాను ప్రకటించకపోవడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకవేళ తొందరపడి నామినేషన్ వేస్తే పార్టీ బీఫాం రాకుంటే ఇబ్బందుల్లో పడతామేమోనని ఆలోచిస్తున్నారు. నేడు అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాలు ప్రకటించే అవకాశం ఉంది.

 ‘తొమ్మిది’ సెంట్‌మెంట్..!
 అభ్యర్థిత్వం ఖరారైనప్పటికీ సిట్టింగ్ అభ్యర్థులు కొందరు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. 9 సంఖ్య కలిసి వస్తుందనే నానుడి ఉండడంతో అందరూ ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు.

 నామినేషన్ల స్వీకరణకు 9వ తేదీ చివరిది కావడంతో అదే రోజు అన్ని పార్టీల ప్రధాన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వేచి చూస్తున్నారు. 9 సంఖ్య కలిసి వస్తుందని, ఆరోజు నామినేషన్ దాఖలు చేస్తే విజయం వరిస్తుందనే ఆశలో అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement