కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ గురువారం పూర్తయింది. నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల అధికారులు, నిబంధనలకు అనుగుణంగా ఉన్న నామినేషన్లను స్వీకరించి.. లోపాలున్న వాటిని తిరస్కరించారు. లోక్‌సభ పరిధిలో నాలుగు, అసెంబ్లీ పరిధిలో 39 నామినేషన్లు తిరస్కరణకుగురయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికాలేదు. మెదక్ లోక్‌సభ స్థానానికి 15 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు వస్తే .. పరిశీలనలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి సైతం 15 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు రాగా, ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు 190 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా..పరిశీలన అనంతరం 151 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించిన అధికారులు, వివిధ కారణాలతో 39 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకోడానికి ఈ నెల 12 వరకు గడువు మిగిలి ఉంది.
అభ్యర్థిత్వం ఖరారు ముగిసిన నామినేషన్ల పరిశీలన
Published Fri, Apr 11 2014 12:01 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement