nominations rejected
-
దురదృష్టం అంటే ఈమెదే.. కూటమికి కూడా!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కూటమికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఖజురహో అభ్యర్థి మీరా యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎన్నికల కమిషన్‌కు అవసరమైన పత్రాలను సమర్పించకపోవడంతో 'సిగ్నేచర్ మిస్సింగ్' అభ్యర్థి పోటీ నుండి నిష్క్రమించడానికి దారితీసింది. రాష్ట్రంలోని నివారి అసెంబ్లీ స్థానం నుంచి 2008లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై ఒకసారి గెలిచిన మీరా యాదవ్.. తర్వాత ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ఖజురహో లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తొలుత మనోజ్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత ఈ సీటును మీరా యాదవ్‌కు ఇచ్చింది. దీంతో ఆఖరి రోజున గురువారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అయితే శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఈమె నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే ఆమె పత్రాలను రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించారని మీరా యాదవ్ భర్త, ఉత్తర ప్రదేశ్‌నుంచి రెండుసార్లు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అయిన దీప్ నారాయణ్ యాదవ్ చెప్పారు. తర్వాత రోజు సవరించిన ఓటరు జాబితాను సమర్పించకపోవడంతో పాటు ఒక చోట అభ్యర్థి సంతకం లేదని అధికారులు చెప్పారని ఆయన వివరించారు. దీనిపై అవసరమైతే హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. కాగా ఈ ఖజురహో స్థానంలో బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్, ప్రస్తుత ఎంపీ వీడీ శర్మను పోటీకి దింపింది. 2019 ఎన్నికలలో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 4.92 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. మీరా యాదవ్ నామినేషన్‌ను తిరస్కరించడం "ప్రజాస్వామ్య హత్య"గా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. -
మా నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్ర
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడితో పాటే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కూడా తారస్థాయికి చేరుతోంది. తమ నామినేషన్లను ఏదోలా చెల్లకుండా చేసేందుకు బసవరాజ్ బొమ్మై సర్కారు భారీ కుట్రకు తెర తీస్తోందని పీసీసీ చీఫ్ శివకుమార్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థుల నామినేషన్లలో ఏదో ఒక లోపాన్ని వెతకాలని, అలాగే బీజేపీ నామినేషన్లలో ఏమైనా తప్పులుంటే సరి చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్లందరి మీదా ఎంతగానో ఒత్తిడి తెస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు స్వయానా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వారికి ఫోన్లు వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం రంగంలోకి దిగి దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీఎంఓ కాల్ డీటైల్స్ తెప్పించుకుని పరిశీలించాలని సూచించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి అంతూ పొంతూ లేకుండా పోతోందంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ కుట్రకు సంబంధించి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయి. వాటిని సరిచేయాల్సిందిగా సీఎంఓ నుంచి ఆర్ఓకు ఫోన్ వెళ్లింది. ఇక నా నామినేషన్‌ను ఏదోలా తిరస్కరింపజేసేందుకు బీజేపీ తరఫున పెద్ద టీమే రంగంలోకి దిగింది. నా పరిస్థితే ఇలా ఉంటే ఇతర సాధారణ అభ్యర్థుల సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. -
45..నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, సూర్యాపేట: హుజూర్నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన తంతు పూర్తయింది. హోరాహోరీగా జరిగిన నామినేషన్ల పర్వంలో పలు కారణాలతో 45మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. 31మంది అభ్యర్థుల నామినేషన్లను అంగీకరించారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో సీపీఎం అభ్యర్థికి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు నామినేషన్‌ను తిరస్కరణకు గురైంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, బీఎల్ఎఫ్ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. గురువారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎంత మంది అభ్యర్థులు ఉపపోరు బరిలో ఉండనున్నారో తేలనుంది. మిగిలింది.. 31మంది అభ్యర్థులు.. ఉప ఎన్నికలో బరికి 76మంది అభ్యర్థులు మొత్తం 119నామినేషన్ సెట్లు వేశారు. ఇందులో ఒక్కొక్కరు నాలుగు సెట్ల చొప్పున ఏడుగురు, ఐదుగురు మూడు సెట్లు, 12మంది రెండు సెట్ల చొప్పున, మిగతా అభ్యర్థులు ఒక్కో సెట్ నామినేషన్ వేశారు. అఫిడవిట్ సరిగా నింపలేదని, సంతకాలు చేయలేదని, కావాల్సిన పత్రాలు జత చేయలేదని, ఇలా పలు కారణాలతో 45మంది అభ్యర్థుల నామినేష్లు తిరస్కరించారు. అన్ని సరిగా ఉండడంతో 31మంది అభ్యర్థుల నామినేషన్లకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రయ్య ఆమోదం తెలిపారు. ప్రధాన రా జకీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డి, బీజేపీ నుంచి డాక్టర్ కోట రామారావు, టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సై దిరెడ్డి, బీఎల్ఎఫ్ అభ్యర్థి మేడి రమణ, తెలం గాణ ఇంటిపార్టీ మద్దతుతో బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి, తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థి సాం బశివరావుగౌడ్ నామినేషన్లు అంగీకరించారు. ఇండిపెండెంట్లు.. ఇతర పార్టీలు.. ఇండిపెండెంట్లు ఇతర పార్టీల వారీగా చిలువేరు శ్రీకాంత్, మేఖల రఘుమారెడ్డి, మారం వెంకట్‌రెడ్డి, వంగపల్లి కిరణ్, నందిపాటి జానయ్య, మేకల వెంకన్న, అజ్మీరా మహేష్, శాంతిదసరాం నాయక్, భూక్యా కృష్ణానాయక్, సపావత్ సుమన్, అలదాసు సుధాకర్, కొప్పుల ప్రతాప్‌రెడ్డి, రేఖల సైదులు, గుగులోతు శంకర్, ఆరెపు వివేకానంద, తంగిళ్ల జనార్దన్, బండారు నాగరాజు, జాజుల భాస్కర్, వీసం రాములు, పి.క్రాంతికుమార్, పాండుగౌడ్, రాయల సుమన్, ఎం. సుదర్శన్, నందిపాటి వినోద్‌కుమార్‌ల నామినేషన్లు ఆమోదం పొందిన ట్లు సమాచారం. అలాగే సర్పంచ్ల ఫోరం నుంచి నామినేషన్ వేసిన వారిలో నాగర్‌కర్నూల్ జిల్లా తండ్రికల్ సర్పంచ్ తాళ్ల పాండుగౌడ్ నామినేషన్ ఒక్కటే ఆమోదం పొందింది. నామినేషన్లు తిరస్కరించిన వారిలో.. రాజకీయ పార్టీల వారీగా చూస్తే సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు నామినేషన్ తిరస్కరించారు. దీంతో శేఖర్‌రావుతో పాటు ఆ పార్టీ నాయకులు నామినేషన్ కేంద్రం వద్ద ధర్నా చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఎన్నికల పరిశీలకులు సచింద్రప్రతాప్‌సింగ్ రావడంతో.. తిరస్కరణకు గురై అభ్యంతరం చెప్పిన అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లు మరో సారి పరిశీలించాలని ఎన్నికల అధికారులకు చెప్పారు. పలు కారణాలతో చివరకు శేఖర్‌రావు నామినేషన్ తిరస్కరించారు. బలమైన ఇండిపెండెంట్లపై నజర్.. నామినేషన్లు ఆమోదం పొందిన వారిలో బలమైన అభ్యర్థులు ఎవరని ప్రధాన పార్టీలు ఆరా తీస్తున్నాయి. వారిని తమ వైపునకు తిప్పుకుంటే కొన్నైనా ఓట్లు రాలుతాయని ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే వారికి వచ్చిన ఓట్లు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉందని.. లెక్కలు వేస్తున్నారు. వారి మద్దతు తమకుంటే గెలుపునకు కొంతైనా దోహదం అవుతుందని అభ్యర్థులు వారిపై నజర్ పెట్టించారు. ఉప బరి ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుండడంతో ఎవరు గెలిచినా మెజార్టీ అంత ఎక్కువ ఉండదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇండిపెండెంట్లు ఈ ఎన్నికల్లో కీలకమయ్యారు. -
హుజూర్‌నగర్‌లో పలు నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, సూర్యాపేట: హుజూర్నగర్ ఉప ఎన్నికకు దాఖలు చేసిన పలువురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అభ్యర్థి వివరాలకు సంబంధించి సరైన పత్రాలను పొందుపరచలేదని అధికారులు వాటిని తిరస్కరించారు. వీరిలో సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు, తెలంగాణ ఇంటిపార్టీ అభ్యర్థి సాంబశివగౌడ్, స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీ నరసమ్మ, వికలాంగుడు గిద్ద రాజేష్, ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన లింగిడి వెంకటేశ్వర్లులకు చెందిన నామినేషన్ పత్రాలు చెల్లుబాటు కాలేదు. ఉప ఎన్నికకు సోమవారంతోనే నామినేషన్ల గడువు ముగిసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం నాడు నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించారు. వీటిలో సరైన దృవ పత్రాలు పొందుపరచని కారణంగా కొన్నింటిని తిరస్కరించారు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పోటీకి తమను అనుమతించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉప ఎన్నికల్లో నామినేషన్ స్క్రూటిని లో మొత్తం 76 నామినేషన్స్ స్క్రూటిని చేశారు. ఇందులో 45 నామినేషన్స్ స్క్రూటిని లో తిరస్కరించగా.. 31 నామినేషన్ అంగీకరించారు. కాగా మొత్తం 119 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. చదవండి: హోరెత్తిన హుజూర్నగర్ -
బరిలో 165 మంది
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల బరిలో 165 మంది అభ్యర్థులు మిగిలారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. పార్లమెంటు నియోజకవర్గం ఉప సంహరణ బరిలో నిలిచింది ఏలూరు పార్లమెంటు 2 10 నర్సాపురం పార్లమెంటు 2 15 మొత్తం 4 25 (అసెంబ్లీ నియోజకవర్గాల్లో) నియోజకవర్గం ఉప సంహరణ బరిలో నిలిచింది కొవ్వూరు 3 11 నిడదవోలు 1 10 ఆచంట 2 13 పాలకొల్లు 1 13 నర్సాపురం 1 14 భీమవరం 2 13 ఉండి 2 10 తణుకు 3 12 తాడేపల్లిగూడెం 2 13 ఉంగుటూరు 0 8 దెందులూరు 1 12 ఏలూరు 1 8 గోపాలపురం 0 7 పోలవరం 2 11 చింతలపూడి 1 10 మొత్తం 22 165 -
34 నామినేషన్ల తిరస్కరణ
హుజూరాబాద్: ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం హుజూరాబాద్ శాసనసభకు పోటీ చేసేందుకు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బోయపాటి చెన్నయ్యతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. బీ–ఫాం, సరైన అఫిడవిట్ వివరాలను అందించని వారి నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారంగా నామినేషన్ పత్రాలను సమర్పించిన వారి అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసినట్లు చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 27 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, అందులో 9 మంది నామినేషన్లు తిరస్కరించామన్నారు. ట్రెయినీ కలెక్టర్ రాజార్షిషా, తహసీల్దార్ హరికృష్ణ, ఆర్ఐ రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామగుండంలో ఐదు.. గోదావరిఖని(రామగుండం): రామగుండం ఎమ్మెల్యే స్థానానికి వచ్చిన ఐదు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా 22 మంది నామినేషన్లు సమర్పించారు. ఈనెల 19 నామినేషన్లకు చివరి తేదీ కాగా.. 22 మంది 40 నామినేషన్ సెట్లను వేశారు. అయితే ఈ నామినేషన్ల పరిశీలనలో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీఎల్ఎఫ్ కూటమి నుంచి సీపీఐఎం రెండో అభ్యర్థిగా వేసిన వేల్పుల కుమారస్వామి నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఆపూరి అనసూర్య, జైమహాభారత్ పార్టీ అభ్యర్థి తిరునగరి భవాని, లోక్తాంత్రిక్ సర్వజన సమ్మేళన్ పార్టీ అభ్యర్థి గూడూరి సుజాత, ఇండిపెండెంట్ అభ్యర్థి దుర్గం కుమార్ నామినేషన్లను తిరస్కరించారు. జనరల్ ఎలక్షన్స్ అబ్జర్వర్ చంద్రకాంత్లక్ష్మణ్రావు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి నర్సింహామూర్తి, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హన్మంతరావు పరిశీలించారు. ఉపసంహరించుకుంటే డబ్బులు చెల్లిస్తాం అసెంబ్లీ ఎన్నికల్లో 22 నామినేషన్లు రాగా.. అందులో ఐదు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యా రిటర్నింగ్ అధికారి నర్సింహామూర్తి అన్నారు. వీటిలో మూడింటికి అఫిడవిట్ సంతకాలు లేవని, మరోదాంట్లో పది మంది సభ్యుల పేర్లు ఉండాల్సి ఉండగా.. తొమ్మిది మంది సంతకాలే ఉన్నాయన్నారు. మరో అభ్యర్థి అఫిడవిట్ పూర్తిగా నింపలేదని అన్నారు. ఈనెల 22న సాయంత్రం 3 గంటల్లోగా నామినేషన్లు ఉపసంహరించుకునే అభ్యర్థులకు డిపాజిట్ డబ్బులు చెల్లిస్తామన్నారు. మంథనిలో పది.. మంథని: మంథని ఆర్టీవో కార్యాలయంలో మంగళవారం నామినేషన్ల పరిశీలనలో పది మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి 20 మంది అభ్యర్థులు 35 నామినేషన్లు వేశారు. ఎన్నికల నియమావళిలో భాగంగా వివిధ కారణాలతో పది మంది అభ్యర్థులకు చెందిన నామినేనష్లు తిరస్కరణకు గురి కాగా.. మరో పది మంది అభ్యర్థుల నామినేషన్లు అనుమతించారు. అనుమతించినవారిలో పుట్ట మధు(టీఆర్ఎస్), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(కాంగ్రెస్), ఇటుకల మహేశ్(బీఎస్పీ), రేండ్ల సనత్‌కుమార్(బీజేపీ), మేడి కుమారస్వామి(ఎన్సీపీ), పోలం రాజేందర్(బీఎల్ఫీ), తాటి నాగరాజు(ఎస్పీబీ), బూడిద తిరుపతి(టీపీఎస్), బొమ్మ బాపు(స్వతంత్ర), చల్లా లక్ష్మణ్(స్వతంత్ర) ఉన్నారు. కోరుట్లలో ఒకటి మెట్పల్లి(కోరుట్ల): కోరుట్ల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దాఖలైన ఒకరి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రిటర్నింగ్ అధికారి గౌతమ్ పాల్గొని అభ్యర్థుల నామినేషన్ల పత్రాలను పరిశీలించారు. ఎన్నికల్లో మొత్తం 16మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. వీరిలో తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సతీమణి సరోజ నామినేషన్‌ను తిరస్కరించారు. టీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన ఆమె బీ–ఫాం సమర్పించని కారణంగా దానిని తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. ఆమోదం పొందిన మిగి లిన 15మందిలో 8మంది స్వతంత్రులున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం వరకు గడువుండడంతో.. వీరిలో ఎంతమంది బరిలో ఉంటారన్నది చర్చనీయాంశమైంది. సిరిసిల్లలో ఒకటి.. సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. మంగళవారం నామినేషన్ల పరిశీలనలో ఒక నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి.శ్రీనివాస్‌రావు తెలిపారు. అర్వరాజు కృష్ణంరావు న్యూ ఇండియా పార్టీ నుం చి పోటీ చేశారని, నామినేషన్ పత్రాల్లో తప్పులు దొర్లడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేం దర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ఆవునూరి రమాకాంత్రా వు, టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ తరఫున సెస్ చైర్మ న్ దోర్నాల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఏడు.. వేములవాడ: వేములవాడ అసెంబ్లీ స్థానానికి ఈనెల 19 వరకు 23 మంది నామినేషన్లను దాఖలు చేశారు. ఏడు నామినేషన్లను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి ఖీమ్యానాయక్ తెలిపారు. ఆది వనజ(కాంగ్రెస్), ప్రతాప మార్తాండతేజ(బీజేపీ), చలిమెడ రాజేశ్వర్‌రావు(టీఆర్ఎస్), మ్యాకల ఉదయ్‌కుమార్(సమాజ్‌వాది పార్టీ), కొండ దినేష్(ఇండిపెండెంట్), గోగుల రమేశ్(సోషన్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా), గంట ఇస్తారి(ఇండిపెండెంట్) పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. చొప్పదండి నియోజకవర్గంలో ఒకటి.. గంగాధర(చొప్పదండి): చొప్పదండి నియోజకవర్గ శాసనసభ స్థానానికి 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. మంగళవారం దరఖాస్తుల పరిశీలనలో ఒకటి తిరస్కరణకు గురయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్ వేసిన స్వామి ఫాం ఏ, బీ సకాలంలో సమర్పించకపోవడంతో తిరస్కరించారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
* సాంకేతిక కారణాలతో పలు నామినేషన్లు తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాఖలైన పలు నామినేషన్లను పరిశీలన సమయంలో అధికారులు వివిధ సాంకేతిక కారణాలతో తిరస్కరించారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన గురువారం పూర్తయింది. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. కాగా, అసెంబ్లీ స్థానాలకు 3,415, పార్లమెంట్ స్థానాలకు 457 నామినేషన్లు దాఖలయ్యాయి. తిరస్కరణకు గురైన అభ్యర్థుల్లో స్వతంత్రులతోపాటు, పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు కూడా ఉన్నారు. వారిలో పార్టీల రెబెల్ అభ్యర్థులు అధికంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థి దేవిశెట్టి శ్రీనివాసరావు, రంగారెడ్డి జల్లా మేడ్చెల్‌లో వైసీపీ అభ్యర్థి కుసుమకుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల వైసీపీ అభ్యర్థి అతికూర్ రెహవూన్, నల్లగొండ జిల్లా వైసీపీ అభ్యర్థులు ఇరుగు సునీల్‌కుమార్(నల్లగొండ), గూడూరు జైపాల్‌రెడ్డి(భువనగిరి)ల నామినేషన్లను తిరస్కరించారు. కాగా, మహబూబాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి సీతారాం నాయక్ కాకతీయ యుూనివర్సిటీలో ప్రాఫెసర్‌గా పనిచేస్తున్నారని, ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని అధికారులు పేర్కొని, ఆయన నామినేషన్‌పై నిర్ణయం తీసుకోలేదు. కాగా, శుక్రవారం సాయంత్రంలోగా దీనికి సబంధించిన లేఖ సమర్పించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయనను ఆదేశించినట్టు సమాచారం. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి దాఖలైనవాటిలో రాష్ట్రీయ అహింస మంచ్ అభ్యర్థి ప్రేమ్‌చంద్ మునాట్, ఆల్ ఇండియా మైనారిటీస్ ఫ్రంట్ అభ్యర్థి షేక్‌బాజి, సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి నాగలక్ష్మి, రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి పి.శోభాయాదవ్ల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. జిల్లాల వారీగా అసెంబ్లీకి దాఖలైన నామినేషన్లు ఆదిలాబాద్(254), నిజామాబాద్(205), కరీంనగర్(372), మెదక్(228), రంగారెడ్డి(548), హైదరాబాద్ (584), మహబూబ్‌నగర్(293), నల్లగొండ(406), వరంగల్(264), ఖమ్మం(261). పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తిరస్కరణకు గురైన నామినేషన్ల సంఖ్య ఆదిలాబాద్-4, పెద్దపల్లి-2, కరీంనగర్-2, జహీరాబాద్-2, మెదక్-2, సికింద్రాబాద్-4, చేవెళ్ల-4, మహబూబ్‌నగర్-1, నాగర్ కర్నూల్-1, నల్లగొండ-2, భువనగిరి-1, వరంగల్-2, మహబూబాబాద్-3. -
అభ్యర్థిత్వం ఖరారు ముగిసిన నామినేషన్ల పరిశీలన
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ గురువారం పూర్తయింది. నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల అధికారులు, నిబంధనలకు అనుగుణంగా ఉన్న నామినేషన్లను స్వీకరించి.. లోపాలున్న వాటిని తిరస్కరించారు. లోక్‌సభ పరిధిలో నాలుగు, అసెంబ్లీ పరిధిలో 39 నామినేషన్లు తిరస్కరణకుగురయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికాలేదు. మెదక్ లోక్‌సభ స్థానానికి 15 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు వస్తే .. పరిశీలనలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి సైతం 15 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు రాగా, ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు 190 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా..పరిశీలన అనంతరం 151 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించిన అధికారులు, వివిధ కారణాలతో 39 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకోడానికి ఈ నెల 12 వరకు గడువు మిగిలి ఉంది. -
ఇద్దరు ఎన్డీయే అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ
టెలికం శాఖ మాజీ మంత్రి రాజాపై పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. నీలగిరి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్.గురుమూర్తి తన నామినేషన్ పత్రంతో పాటు సరైన సమయంలో బీఫారం సమర్పించకపోవడంతో రిటర్నింగ్ అధికారి పి.శంకర్ ఆయన నామినేషన్ తిరస్కరించారు. అయితే, అప్పీలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయనకు అధికారులు సూచించినట్లు సమాచారం. అలాగే, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీనుంచి పోటీచేస్తున్న రాణి ఎప్పుడో 1986లో జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రం సమర్పించడంతో తాజా పత్రం తేవాలని ఆమె నామినేషన్ పెండింగులో పెట్టారు. ఇక చిదంబరం స్థానంలో బీజేపీ కూటమిలోని పార్టీ పీఎంకే అభ్యర్థి మణిరత్నం తన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే పదిమంది సంతకాలు జత చేయకపోవడంతో ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. అయితే, ఆయనకు డమ్మీగా నామినేషన్ వేసిన ఆయన భార్య సుధ పత్రాలు మాత్రం సరిగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది.