సాక్షి, సూర్యాపేట: హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు దాఖలు చేసిన పలువురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అభ్యర్థి వివరాలకు సంబంధించి సరైన పత్రాలను పొందుపరచలేదని అధికారులు వాటిని తిరస్కరించారు. వీరిలో సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు, తెలంగాణ ఇంటిపార్టీ అభ్యర్థి సాంబశివగౌడ్, స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీ నరసమ్మ, వికలాంగుడు గిద్ద రాజేష్, ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన లింగిడి వెంకటేశ్వర్లులకు చెందిన నామినేషన్ పత్రాలు చెల్లుబాటు కాలేదు.
ఉప ఎన్నికకు సోమవారంతోనే నామినేషన్ల గడువు ముగిసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం నాడు నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించారు. వీటిలో సరైన దృవ పత్రాలు పొందుపరచని కారణంగా కొన్నింటిని తిరస్కరించారు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పోటీకి తమను అనుమతించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉప ఎన్నికల్లో నామినేషన్ స్క్రూటిని లో మొత్తం 76 నామినేషన్స్ స్క్రూటిని చేశారు. ఇందులో 45 నామినేషన్స్ స్క్రూటిని లో తిరస్కరించగా.. 31 నామినేషన్ అంగీకరించారు. కాగా మొత్తం 119 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే.
చదవండి: హోరెత్తిన హుజూర్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment