రాయికల్/పెద్దపల్లి/గోదావరిఖని, న్యూస్‌లైన్: కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించి సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 21న జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా ఒకే రోజు ఏకం గా నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. జగిత్యాల, కోరు ట్ల, ధర్మపురి, పెద్దపల్లి నియోజకవర్గాల్లో ఏ కధాటిగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
అంతకుముందు రోజు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, బెల్లంపల్లి సభల్లో పాల్గొనున్న కేసీఆర్ .. ఆ తర్వాత గోదావరిఖనిలో నిర్వహించే సభకు హాజరవుతారని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ఉద్యమానికి పురిటగడ్డగా పేరొందిన కరీంనగర్ జిల్లాలో అధిక సంఖ్యలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఆయన ఎక్కడా లేనివిధంగా జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించడం విశేషం.
21న కేసీఆర్ సుడిగాలి పర్యటన
Published Sat, Apr 19 2014 2:48 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement
Advertisement