23న జిల్లాలో షర్మిల పర్యటన | on23 sharmila Tour in district | Sakshi
Sakshi News home page

23న జిల్లాలో షర్మిల పర్యటన

Published Sun, Apr 20 2014 11:52 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

23న జిల్లాలో షర్మిల పర్యటన - Sakshi

23న జిల్లాలో షర్మిల పర్యటన

 
 కల్లూరు, ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాలలో రోడ్‌షో, సభలు
 
 సాక్షి, కర్నూలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 23వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ హరికృష్ణ   తెలిపారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కల్లూరు, ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాలలో పర్యటిస్తారన్నారు.
 
  23న హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు కర్నూలుకు చేరుకుంటారని.. అనంతరం కల్లూరులో రోడ్‌షో నిర్వహించి జనభేరి సభలో పాల్గొంటారన్నారు. సాయంత్రం 4 గంటలకు ఆత్మకూరులో రోడ్‌షో చేపట్టి.. రాత్రి 7 గంటలకు నంద్యాల చేరుకుంటారన్నారు. అక్కడ రోడ్‌షో అనంతరం జనభేరి సభలో ప్రజనుద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement