సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈ సమావేశం జరిగింది.
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ మంత్రి డీకే అరుణ, విఠల్‌రావు, వంశీచంద్‌రెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జిల్లా నేతలందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని పీసీసీ బాధ్యులు నొక్కి చెప్పినట్లు సమాచారం. ఎలాంటి విభేదాలకు తావు లేకుండా పనిచేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుస్తారనే అభిప్రాయాన్ని పార్టీ ముఖ్య నేతలు వ్యక్తం చేశారు.
గూపు తగాదాలు ఏవైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం. షాద్‌నగర్ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి పార్టీ వీడనున్నారనే వార్తలపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ లోక్‌సభ పోటీ చేస్తే సహకరిస్తానంటూ మాజీ ఎంపీ విఠల్‌రావు సూత్రప్రాయంగా అభిప్రాయం వెల్లడించినట్లు సమాచారం.
నేడు జిల్లాకు జైరాం రమేశ్: రాష్ట్ర విభజన ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి జైరాం రమేశ్ బుధవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఉదయం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడతారు. అనంతరం పట్టణ శివారులోని ఓ ఫంక్షన్ హా ల్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మున్సిపల్, స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల్లో కేడర్‌కు దిశా నిర్దేశం చేసేందుకు జైరాంజిల్లా పర్యటనకు వస్తున్నట్లు కొత్వాల్ వెల్లడించారు.
ప్లీజ్.. గ్రూపులొద్దు..!
Published Wed, Mar 19 2014 2:53 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement