‘స్థానిక’ సమరంలో తొలివిడత ఎన్నికలకు పార్టీలు రెడీ అవుతున్నాయి. ప్రచార అంకానికి శుక్రవారం సాయంత్రం తెరపడడంతో ఇక ప్రలోభాల ఘట్టానికి తెరలేపాయి. సామ,దాన, ప్రయోగాలతో ఓటర్లను తిప్పుకునే మంత్రాంగంలో పడ్డాయి. బంధుగణాన్ని, అనుయాయులను అందుకు పురమాయించి లెక్కలు కట్టుకుంటున్నాయి. మరో వైపు అధికారులు పోలింగ్ నిర్వహణకు తమ ఏర్పాట్లు పూర్తి చేసుకునే పనిలో పడ్డారు.
సాక్షి, మహబూబ్‌నగర్, జెడ్పీ సెంటర్ : జిల్లాలో తొలి విడతగా ఈ నెల 6న జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది.నాగరుకర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని 35 మండలాల్లో ఆదివారం పోలింగ్ జరుగనుండటంతో... ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవటానికి అభ్యర్థులు రంగంలోనికి దిగారు.
మద్యం బా టిళ్లు,డబ్బు సంచులతో శనివారం రాత్రి నుంచి ఓటర్లను కలిసేందు కు తగిన వ్యూహంతో అంతర్గత ప్రచారం చేపట్టారు.గుట్టు చప్పుడుగా పని కానిచ్చేందుకు పార్టీ స్థానిక నాయకులతో పాటు,అభ్యర్థుల బంధు వర్గాలు పంపకాల వ్య వహారంపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే అభ్యర్థులు ఎన్నికల ప్రచార కా ర్యక్రమంలో భాగంగా కుల దేవతల ఆలయాల నిర్మాణాలు, శశ్మానవాటికలు ఏర్పాటు వంటి పై పలు గ్రామాల్లో ఓటర్లకు హామీలు ఇవ్వడంతో పాటు అయ్యే తాయిలాలు లెక్కించి అడ్వాన్సులు ముట్ట జెప్పినట్టు ప్రచారంలో ఉంది. ఓటర్ల నాడిని బట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం.ఓటుకు రూ.300 నుంచి రూ. 500 వరకు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. గద్వాల నియోజక వర్గం పరిధిలో ఈ లాంటి ప్రలోభాలు భారీగా కొనసాగుతున్నాయి.
-35 జెడ్పీటీసీ స్థానాలకు 141మంది
నాగరుకర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగరుకర్నూల్,అచ్చంపేట, కొల్లాపూర్,కల్వకుర్తి,వనపర్తి, గద్వాల,అలంపూర్ అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 35 మండలాల్లో 6న ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 35 జెడ్పీటీసీ స్థానాలకు వివిధ పార్టీల నుంచి 141 మంది అభ్యర్థులు తమ అదృష్టాలను పరీక్షించుకుంటున్నారు. నాగరుకర్నూల్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా..టీడీపీ రెండు మండలాల్లోని జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులను పోటీలో నిలిపింది.మిగతా నాగరుకర్నూల్,బిజినేపల్లి,తెలకపల్లి లలో అభ్యర్థులను టీడీపీ నిలబెట్టలేకపోయింది. దీనికి ప్రధాన కారణం బలం లే క పోవటమేనని తెలుస్తుంది.
అదే విధంగా 35 మండలాల పరిధిలోని ఎంపీటీసీ స్థానాలకు 1593 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 72 ఎంపీసీటీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ నుంచి 71 మంది,టీఆర్‌ఎస్ నుంచి 69, బీజేపీ నుంచి 64,టీడీపీ నుంచి 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.అచ్చంపేట పరిధిలో 70 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 245 మంది తమ అదృష్టాలను పరీక్షించుకుంటున్నారు.ఇక్కడ కాంగ్రెస్ నుంచి 68 మంది,టీఆర్‌ఎస్ నుంచి 66,టీడీపీ నుంచి 56 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలోనే ఈ ఎన్నికలు జరుగుతుండటంతో....ప్రచార పర్వం ముగింపులో ఒకటి,రెండు రోజులు ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
8735 మంది పోలింగ్ సిబ్బంది...
మొదటి విడతకు సంబంధించి పోలింగ్‌లో 8735 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించనున్నారు. ఇందులో 1747 మంది పీఓలు, 1747 మంది ఏపీఓలు, 5241 మంది పోలింగ్ అధికారులు ఉన్నారు. అదే విధంగా పోలింగ్ బాక్సులను ఇప్పటికే ఆయా మండలకు సరఫరా చేశారు. 1588 పోలీంగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగానే ప్రతీ పోలింగ్ స్టేషన్‌కు రెండు పోలింగ్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ విడతలో జరిగే ఎంపీటీసీ ఎన్నికలకు గాను మొత్తం 3176 పోలింగ్ బ్యాక్సులను వినియోగించనున్నారు. పదకొండు లక్షలకు పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇక తాయిలాలు
Published Sat, Apr 5 2014 2:28 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement