ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం సూరవరపు పల్లెలో టీడీపీ కార్యకర్తలు దాష్టీకానికి పాల్పడ్డారు. పోలింగ్ ముగిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం మొదలుపెట్టారు. దాంతో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో వారిని సమీపంలోని గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
రాత్రంతా పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతూనే ఉండాల్సి వచ్చింది. గ్రామంలో రాత్రంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తులు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఉండాల్సి వచ్చింది. టీడీపీ కార్యకర్తల దాష్టీకంతో ఏ ఒక్కరూ నిద్రపోకుండా గడిపినట్లు ఆ గ్రామంలోని పలువురు పెద్దలు తెలిపారు.
ప్రకాశంలో రాత్రంతా గాల్లో కాల్పులు
Published Thu, May 8 2014 9:38 AM | Last Updated on Wed, Sep 5 2018 9:51 PM
Advertisement
Advertisement