ఊరూరా గోదావరి నీళ్లు
రోడ్ షోలో టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య
జనగామ, న్యూస్‌లైన్ : నియోజకవర్గంలోని ప్రతీ ఊరుకు గోదావరి జలాలు అందించేందుకు కృషిచేస్తానని టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామలోని పలు వార్డుల్లో సోమవారం ఆయన సినీనటి, మాజీ ఎంపీ జయప్రద, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సం దర్భంగా పొన్నాల మాట్లాడుతూ తాను జనగామ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నట్లు తెలిపా రు. పట్టణాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు జనగామను జిల్లాగా చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇతర దేశాలకు వెళ్లే వారికోసం పట్టణంలో ప్రత్యేక హెల్స్‌డెస్క్ ఏర్పా టు చేస్తానని, గూగుల్ పాఠాలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ నియామకాల్లో దామాషా పద్ధతిని అవలంభిస్తామని, పార్టీ మేని ఫెస్టోను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం ఐదు ఎకరా ల్లో స్మృతి వనం ఏర్పాటు, వారి కుటుంబాలకు ఇళ్లు.. పింఛన్.. ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. జయశంకర్ పేరున *100కోట్ల నిధులతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యమ సమయంలో ఇబ్బందులు పడ్డ వారికి సేవలందించనున్నట్లు వివరించారు. మోసపూరిత టీఆర్‌ఎస్‌కు ఓటెయ్యొద్దని, తెలంగా ణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందు కు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో సోనియా పదిలం
తెలంగాణ గుండెల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోని యాగాంధీ పదిలంగా ఉన్నారని.. ఇక్కడి ప్రజ ల కు కాంగ్రెస్‌పైనే విశ్వాసముందని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇద్దరు ఎంపీలున్న టీఆర్‌ఎస్‌తో తెలంగాణ రాలేదని.. కేవలం సోనియాగాంధీ వల్లే వచ్చిందన్నారు. కేసీఆర్‌వి మోసపూరిత రాజకీయాలని.. సోనియాది ఇచ్చిన మాటకు కట్టుబడే నైతిక విలువలతో కూడి న రాజకీయమని పేర్కొన్నారు. అమరుల త్యాగాలను గుర్తించి సోనియా తెలంగాణ నిర్ణయం తీసుకుందని వివరించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏనాడు మాట మీద నిలబడలేదని విమర్శించారు.
2004లో తమతో పొత్తు.. 2009లో మహాకూటమి పొత్తులో నూ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తమతో పొత్తు ఉన్న సమయంలో టీఆర్‌ఎస్ 26 సీట్లు, పొత్తు లేనప్పుడు 10 సీట్లు వస్తే.. ఇప్పుడు ఎవరితో పొత్తులేకుండా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పా టు చేయడం కలేనని అన్నారు. బీజేపీ కూడా రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదానికి అడ్డం కులు సృష్టించిందన్నారు. తెలంగాణలో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశా రు. సమావేశంలో ఎంపీ రాపోలు ఆనందభాస్క ర్, టీ పీసీసీ అధికార ప్రతినిధులు బక్క నాగరా జు, మొగుళ్ల రాజిరెడ్డి, మార్కెట్ చైర్మన్ వై.సుధాక ర్, ఎండీ.రజీయొద్దీన్, జెల్లి.సిద్ధయ్య పాల్గొన్నారు.