మీ అవినీతి కేబినెట్ మాటేమిటి? | sonia fire to narendra modi | Sakshi
Sakshi News home page

మీ అవినీతి కేబినెట్ మాటేమిటి?

Published Tue, May 6 2014 12:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మీ అవినీతి  కేబినెట్ మాటేమిటి? - Sakshi

మీ అవినీతి కేబినెట్ మాటేమిటి?

మోడీపై సోనియా ధ్వజం
 

 
ముజఫర్‌పూర్ (బీహార్): సొంత కేబినేట్‌లోని అవినీతి మంత్రుల గురించి  గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఏం చెబుతారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రశ్నించారు. గుజరాత్‌లో అవినీతి నిరోధానికి ఏం చర్యలు తీసుకున్నారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లుగా లోకాయుక్తను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. తన ప్రభుత్వ హయాంలో అవినీతి కప్పిపుచ్చుకొనేందుకు మోడీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)తో దేశంలో ఎన్నో అవినీతి కేసులు వెలుగులోకి రాలేదా? అని నిలదీశారు.

బీజేపీ ఎన్నికల ఎజెండా దేశం కోసం కాదని, కేవలం ఓట్ల కోసమేనని ఎద్దేవా చేశారు. బీహార్‌లో తాము అధికారంలో లేకపోయినా రాష్ట్ర అభివృద్ధి కోసం మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇచ్చిందని చెప్పారు. ముజఫర్‌పూర్‌లో ప్రచారానికి ఆఖరి రోజైన సోమవారం నిర్వహించిన సభలో సోనియా మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement