బిచ్కుంద, న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల నేపథ్యంలో మ ద్యం అక్రమ రవాణాపై పొలీసులు దృషి సారించారు. మ హారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల వెంట జుక్కల్ నియోజకవర్గంలో మద్యం ప్రవేశించకుండా గట్టి నిఘా పెట్టారు. ఏ మార్గం ద్వారానైనా మద్యం రవాణా లేకుండా పొలీసులు డేగ కన్ను ఉంచారు. ఎన్నికల్లో మద్యం సరఫరాను అరికట్టేందుకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్ధేశిత మద్య దుకాణాలకే సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కోరినంత మద్యం అందడం లే దు. మద్యం కొరత ఏర్పడింది. అయినా కొందరు అడ్డదారుల్లో మద్యం రవాణాకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యం గా చెక్‌పోస్టుల దగ్గర ఎవరికి అనుమానం రాకుండా కాలినడకతో పొలాల నుంచి వెళ్లి చెక్‌పోస్టు దాటిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి మద్యం దిగుమతికి ఎత్తులు వేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మండల కేంద్రాల్లో ఉన్న వైన్స్‌ల్లో నిర్దేశిత స్టాక్ ఉంది. దీంతో ఎన్నికల ముందు కోరినంత మద్యం అందడం కష్టంగా మారింది. ఇప్పటి నుంచే వ్యాపారులు మద్యం సేకరించి రహస్య ప్రదేశాల్లో ఉంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
చెక్‌పోస్టుల ఏర్పాటు..
మద్యం అక్రమ రవాణా ఎత్తులను చిత్తు చేసేందుకు పొలీ స్ అధికారులు సన్నద్ధమయ్యారు. ఏ మార్గం ద్వారానైనా మద్యం రవాణాను నిరోధించేందుకు నిఘాను తీవ్రతరం చేశారు. ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా సరిహద్దు కల్హెర్ మండలం మాసన్‌పల్లి గేటు వద్ద, కర్ణాటక సరిహద్దులో జుక్కల్ మండలం గుల్లా, చండేగాం, సోమూర్, పిట్లం మండలం గోద్మెగాం, తిమ్మనగర్, మహారాష్ట్ర సరిహద్దు ఎస్‌ఎన్‌ఏ రోడ్డు మద్నూర్ మండలం సలాబత్‌పూర్ వద్ద పొలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
అక్రమ మద్యాన్ని అడ్డుకుంటాం..
ఎన్నికల సందర్భంగా అక్రమంగా మద్యం రవాణా కాకుండా నిఘా కట్టుదిట్టం చేశాం. నిఘాను పెంచాం. అక్రమ వ్యాపారుల మార్గాలను నిరోధించి తీరుతాం. నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో అక్కడక్కడ 7 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. అన్నిరకాలుగా ముమ్మర తనిఖీలు చేస్తున్నాం. రాత్రివేళ్లల్లో ప్రత్యేక దృష్టి పెట్టాం.
- వెంకటేశం, జుక్కల్ నియోజకవర్గ ఇన్‌చార్జి సీఐ, బిచ్కుంద.
మద్యం రవాణాపై డేగ కన్ను
Published Mon, Mar 24 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM
Advertisement