పింప్రి, న్యూస్‌లైన్: బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ తరఫున బరిలోకి దిగిన సుప్రియాసూలే 15 రోజుల వ్యయం అక్షరాలా రూ. 26 లక్షలు. వాస్తవానికి ఎన్నికల ప్రచారానికి ఎన్నికల సంఘం విధించిన పరిమితి రూ. 70 లక్షలు. అంతకుమించి ఖర్చుచేస్తే అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది.
అభ్యర్థులుు తమ ప్రచార వ్యయాన్ని కచ్చితంగా ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాలో పలు లోక్‌సభ నియోజకవర్గాల బరిలోకి దిగిన ఆయా అభ్యర్థులు గత 15 రోజుల ఖర్చులను ఎన్నికల సంఘానికి అందజేశారు. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. బారామతి నుంచి బరిలోకి దిగిన సుప్రియా సూలే (ఎన్సీపీ) రూ. 26,01,959, మహాదేవ్ జాణకర్ (మహాకూటమి) 11,78,700, సురేష్ కోవడే (ఆమ్ ఆద్మీ) రూ. 16,82,599లు ఖర్చు చేశారు. మావల్ నుండి....రాహుల్ నార్వేకర్ (ఎన్సీపీ)రూ. 17,82,977, శ్రీరంగ భరణ్ (శివసేన) రూ. 13,69,169, లక్ష్మణ్ జగతాప్ (శేత్కారీ కామ్‌గార్ పార్టీ)-రూ. 9,32,128, మారుతి (ఆమ్ ఆద్మీ)-రూ. 2,12,332లు వెచ్చించారు.
ఇక పుణే స్థానం నుంచి బరిలోకి దిగిన విశ్వజిత్ కదమ్ (కాంగ్రెస్) రూ. 14,13,847, అనిల్ శిరోలే (బీజేపీ)రూ. 4,40,231, దీపక్ పాయ్‌గుడే (ఎమ్మెన్నెస్) రూ. 2,07,640, అరుణ్ భాటియా (స్వతంత్ర) రూ. 1217,367, సుభాష్ నారే (ఆమ్ ఆద్మీ పార్టీ) రూ. 4,85,530లు వెచ్చించారు. ఇక శిరూర్ స్థానం నుంచి బరిలోకి దిగిన. శివాజీరావ్ ఆడల్‌రావ్ పాటిల్ (శివసేన) రూ. 16,15,337, దేవ్‌దత్త నికమ్ (ఎన్సీపీ) రూ. 3,47,251, అశోక్ ఖండేభరాడ్ (ఎమ్మెన్నెస్) రూ.1,98,375 చొప్పున ఖర్చు చేశారు.
సుప్రియ ప్రచార వ్యయం రూ. 26 లక్షలు
Published Fri, Apr 11 2014 10:50 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement