
పట్టుబడ్డ టీడీపీ నేతలు, ఆంధ్రజ్యోతి విలేకరి
గుంటూరు: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓటర్లకు మద్యం, డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎన్నికల కమిషన్ హెచ్చరికలు చేసినా నేతలు మాత్రం లెక్క చేయటం లేదు.
తాజాగా చేబ్రోలు మండలం నారాకోడూరులో డబ్బులు పంచుతూ టీడీపీ నేతలు, ఆంధ్రజ్యోతి విలేకరి పట్టుబడ్డారు. ఈ సందర్భంగా రూ.3.7లక్షలు నగదు, 77 బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసు నుంచి ఆంధ్రజ్యోతి విలేకరిని తప్పించేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.