తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో సరికొత్త వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో సరికొత్త వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు 80 శాతం మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేసినట్లు చెబుతున్నా, మరో నాలుగైదు రోజుల పాటు జాబితాను బయటపెట్టబోమని అనడానికి అదే కారణమని తెలుస్తోంది. వివాదాల కారణంగా మరోసారి ఈ జాబితాపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ కసరత్తు చేస్తున్నారు.
మంగళవారం నాడు కోమటిరెడ్డి సోదరులు, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, రేణుకా చౌదరి తదితరులు దిగ్విజయ్ సింగ్ను కలిశారు. కాగా, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కొంతమంది కీలక నేతలు అభ్యంతరం, అసంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపిక వెనుక జరుగుతున్న బండారాన్ని బయటపెడతామని ఓ కీలక నేతహెచ్చరిస్తున్నట్లు కూడా సమాచారం.