యాచారం, న్యూస్‌లైన్: సీమాంధ్రలో కాంగ్రెస్ వెనుకబడిపోతుందన్న విష యం తెలిసి కూడా యూపీఏ చైర్ పర్స న్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రా న్ని ఇచ్చిందని టీపీసీసీ క్రమ శిక్షణ సంఘం చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. పట్నం కాంగ్రెస్ అసెం బ్లీ అభ్యర్థి క్యామ మల్లేష్‌కు మద్దతుగా మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంతన్‌గౌరెల్లి, మాల్, నానక్‌నగర్ తదితర గ్రామాల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ.. మాట తప్పిన కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు క్షమించరని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు.అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సోనియాగాంధీ కాళ్లయినా పట్టుకుంటానని మాటిచ్చి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తున్న కేసీఆర్ తీరు దారుణమని మండిపడ్డారు. బిల్లు ప్రవేశ పెట్టడంలో బీజేపీ ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ఇచ్చిన మాట తప్పలేదన్నారు. కానీ తన పోరాటం ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ బహిరంగసభల్లో గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ అభ్యర్థి క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తానని, ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి వా రి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పా రు. మంతన్‌గౌరెల్లి, మాల్ గ్రామాల్లో క్యామకు మద్దతుగా వందలాది మంది కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పీఏసీఏస్ చైర్మన్ శీలం మధుకర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధంకి రజితారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి దెంది రాంరెడ్డి, నాయకులు కాలె మల్లేష్, సిద్ధంకి కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాగలక్ష్మి, యాలాల యాదయ్య, బాషా, అరవింద్ పాల్గొన్నారు.
సోనియా దయతోనే తెలంగాణ
Published Mon, Apr 21 2014 11:50 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement